అన్వేషించండి

బిడ్డ పుట్టకముందే వస్తువులు కొనొద్దు: మూఢనమ్మకమా, ఆరోగ్య జాగ్రత్తా?

బిడ్డ పుట్టకముందు తనకు సంబంధించిన ఏ వస్తువులు కొనుగోలు చేయకూడదంటారు పెద్దలు.. ఎందుకు? శాస్త్రం ఏం చెబుతోంది? సైన్స్ ఎందుకు వద్దంటోంది? 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • పుట్టబోయే బిడ్డ వస్తువులు ముందుగా కొనుగోలు వద్దని పెద్దల సూచన.
  • ఆధ్యాత్మికంగా, దుష్ట శక్తులు, ఈర్ష్య బిడ్డపై ప్రభావం చూపుతాయి.
  • సైన్స్ ప్రకారం, గర్భస్రావ ప్రమాదం, తల్లి ఆందోళన ప్రమాదకరం.
  • ప్రశాంతంగా ఉండటం, ఆరోగ్యంపై దృష్టి తల్లిబిడ్డకు శ్రేయస్కరం.

బిడ్డ ఇంకా భూమ్మీద పడకముందే తనకోసం భారీగా ప్లాన్లు వేసుకోవడం, ఏవైనా కొనిపెట్టడం లాంటివి చేయొద్దని పెద్దలు చెబుతుంటారు. ఇది మూఢ నమ్మకమా? జీవిత అనుభవం నుంచి వచ్చిన జాగ్రత్తా?... ఆధ్యాత్మిక కారణాలేంటి, సైన్స్ ఏం చెబుతోంది...తెలుసుకుందాం.. 

బిడ్డ పుట్టకముందే వస్తువులు కొనొద్దు: మూఢనమ్మకమా, ఆరోగ్య జాగ్రత్తా?

పుట్టబోయే బిడ్డ కోసం దస్తులు, చిన్న చిన్న బొమ్మలు కొనుగోలు చేసి పెట్టి వాటిని చూసి సంతోష పడడం సహజం. కానీ ఇంట్లో ఉండే పెద్దలు ఇలా కొనుగోలు చేయకూడదు అని చెబుతుంటారు. అదంతా మూఢనమ్మకం అని కొట్టిపడేస్తుంటారు..కానీ..దానివెనుక కారణాలున్నాయని మీకు తెలుసా? 
 
ఆధ్యాత్మిక కారణాలు

మన హిందూ సంస్కృతిలో గర్భందాల్చడం పవిత్రమైన దశ. గర్భసంస్కారం అనేది బిడ్డ మనసు, శరీరం ఆరోగ్యంగా ఉండాలని చేసే ప్రక్రియ. వేదాలు, ఆయుర్వేదం ప్రకారం తల్లి ఆలోచనలు, భావాలు, చుట్టుపక్కల వాతావరణ ప్రభావం లోపలున్న బిడ్డపై ఉంటుంది. అందుకే బిడ్డ పుట్టకముందే ఎక్కువగా ఆలోచించడం, వారికోసం అన్నీ కొనుగోలు చేసి పెట్టడం ద్వారా వారిపై చెడు దృష్టి పడే అవకాశం ఉందంటారు ఆధ్యాత్మికవేత్తలు.

బిడ్డ ఇంకా బయటపడకముందే..వారికి సంబంధించిన వస్తువులు కొని ఇంట్లో వినియోగించకుండా పెడితే వాటిపై దుష్టశక్తుల ప్రభావం ఉంటుందని చెబుతారు. బయటప్రపంచం నుంచి వచ్చే ఈర్ష్య, అసూయలు లోపలున్న చిన్నారిపై ప్రభావం చూపించే ప్రమాదం ఉంది. పైగా.. రాబోయే జీవితం గురించి అతిగా ఆలోచించకుండా ప్రస్తుత క్షణాన్ని ఆస్వాదించాలనే సందేశం కూడా ఇందులో ఉంది.

ధ్యానం, శ్లోకాలు చదువుకోవడం, సాత్విక ఆహారం, మంచి వాతావరణంలో ప్రశాంతంగా ఉండడం..ఇవన్నీ లోపలున్న బిడ్డకు మంచి సంస్కారం అందించేందుకు ఉపయోగపడతాయి. పిల్లలు.. భగవంతుడు ప్రసాదించే వరం. ఆ బహుమతి మీ కళ్లముందుకి వచ్చిన తర్వాతే మీ సొంతం అవుతుంది..అతి ఆతురత కారణంగా కొత్త సమస్యలు వస్తాయని హెచ్చరిస్తారు ఆధ్యాత్మికవేత్తలు.


బిడ్డ పుట్టకముందే వస్తువులు కొనొద్దు: మూఢనమ్మకమా, ఆరోగ్య జాగ్రత్తా?

సైన్స్ దృక్పథంలో చూస్తే..
 
అప్పట్లో పసిపిల్లల మరణాలు ఎక్కువ. వైద్య సౌకర్యాలు తక్కువగా ఉండడంతో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. పూర్వకాలంలో ప్రతి ఇంట్లో ఎక్కువ మంది సంతానం ఉండడం వెనుక ఇది కూడా ఓ కారణం అని చెబుతారు ఆరోగ్య నిపుణులు. అయితే.. ఆధునిక వైద్యం కూడా బిడ్డ పుట్టకముందే వారికోసం ఏమీ కొనుగోలు చేయొద్దని చెబుతోంది. మొదటి మూడు నెలలు గర్భస్రావం అయ్యే అవకాశం ఎక్కువ. ఆ తర్వాత కూడా ప్రసవంలోగా ఎలాంటి సమస్యలు వస్తాయో ఊహించలేం. పిల్లల కోసం ముందే బొమ్మలు, రూమ్ సహా అన్నీ సిద్ధం చేసి పెడితే..ఏదైనా జరగకూడనిది జరిగితే ఆందోళన పెరుగుతుంది. ఆయుర్వేదం ప్రకారం గర్భిణి స్త్రీ ప్రశాంతంగా ఉండాలి.. అతి ఆలోచనల, ఆందోళన రెండూ మంచివి కాదు. పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి కానీ.. వారికి కొనుగోలు చేయాల్సిన వస్తువులపై కాదంటారు ఆయుర్వేద నిపుణులు.  స్ట్రైస్ హార్మోన్లు పెరిగితే బిడ్డ పెరుగుదలపై ప్రభావం పడుతుంది.
 
ఇది మూఢ నమ్మకమా అంటే కాదు..కేవలం జాగ్రత్త మాత్రమే అని చెబతారు పెద్దలు. వాస్తవానికి పసిపిల్లలకు కొత్త దుస్తులు వేయరు..అప్పటికే ఇంట్లో ఉండే చిన్నారుల దుస్తులు ఏమైనా వేస్తారు..ఇలా చేస్తే బిడ్డ ఆయుష్షు పెరుగుతుందని నమ్మకం. ఆరోగ్యపరంగా ఆలోచిస్తే.. నూతన వస్త్రాల్లో రసాయనాలు చిన్నారి ఆరోగ్యంపై ప్రభావం చూపించవచ్చు. ఏదైమైనా ...ఈ జాగ్రత్తలన్నీ తల్లి-బిడ్డ రక్షణకోసమే కానీ మూఢనమ్మకం కాదు. అతిగా భయపడొద్దు, అనవసర ఒత్తిడి తీసుకోవద్దు.. మంత్రాలు వినండి, సంగీతాన్ని ఆస్వాదించండి, సాత్విక ఆహారం తీసుకోండి, యోగా చేయండి..ఇవే మీరు మీకు పుట్టబోయే బిడ్డకు ఇచ్చే అది పెద్ద బహుమతులు అని సూచిస్తున్నారు ఆధ్యాత్మికవేత్తలు.

పిల్లలకు అద్దం ఎందుకు చూపించకూడదు? సైన్స్, ఆధ్యాత్మికం, ఆరోగ్య రహస్యం!


   

 

Frequently Asked Questions

పుట్టబోయే బిడ్డ కోసం వస్తువులు ముందుగానే కొనవద్దని పెద్దలు ఎందుకు చెబుతారు?

ఇది మూఢనమ్మకం కాదు, కేవలం జాగ్రత్త మాత్రమే. ఆధ్యాత్మికంగా చెడు దృష్టి, దుష్టశక్తులు ప్రభావం చూపవచ్చని అంటారు. సైన్స్ ప్రకారం, ప్రసవానికి ముందు సమస్యలు రావచ్చు కాబట్టి అనవసర ఒత్తిడిని నివారించడానికి ఇది ఒక జాగ్రత్త.

పుట్టబోయే బిడ్డకు ముందుగా వస్తువులు కొనుగోలు చేయకూడదనేందుకు ఆధ్యాత్మిక కారణాలు ఏమిటి?

తల్లి ఆలోచనలు, భావాలు లోపలున్న బిడ్డపై ప్రభావం చూపుతాయి. ముందుగా వస్తువులు కొనిపెడితే వాటిపై చెడు దృష్టి లేదా దుష్టశక్తుల ప్రభావం ఉండవచ్చని, ఈర్ష్య, అసూయలు చిన్నారిపై పడవచ్చని ఆధ్యాత్మికవేత్తలు చెబుతారు.

పుట్టబోయే బిడ్డకు ముందుగానే వస్తువులు కొనవద్దని సైన్స్, ఆధునిక వైద్యం ఎందుకు చెబుతున్నాయి?

మొదటి మూడు నెలలు గర్భస్రావం అయ్యే అవకాశం ఎక్కువ. ప్రసవంలోగా సమస్యలు రావచ్చు. ముందే సిద్ధం చేస్తే ఏదైనా జరిగితే ఆందోళన పెరుగుతుంది. గర్భిణి ప్రశాంతంగా ఉండాలని, ఒత్తిడి హార్మోన్లు బిడ్డ పెరుగుదలపై ప్రభావం చూపుతాయని ఆయుర్వేదం, ఆధునిక వైద్యం అంటున్నాయి.

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

06-08-2026 గురువారం మీ రాశిఫలాలు!
06-08-2026 గురువారం మీ రాశిఫలాలు!
చీకటిలోనూ వెలుగు: గబ్బిలం నేర్పే లోపలి కన్ను రహస్యం!
చీకటిలోనూ వెలుగు: గబ్బిలం నేర్పే అంతర్ధృష్టి రహస్యం!
Nag Panchami 2026 Date: నాగ పంచమి 2026 తేదీ, పూజావిధానం, ప్రాముఖ్యత తెలుసుకోండి
నాగ పంచమి 2026 తేదీ, పూజావిధానం, ప్రాముఖ్యత తెలుసుకోండి
Gen Z ఫోటో స్టిల్స్! ఆలయాలను సందర్శించేటప్పుడు ఫొటోలు ఇలా తీసుకుంటే అదిరిపోతాయ్!
Gen Z ఫోటో స్టిల్స్! ఆలయాలను సందర్శించేటప్పుడు ఫొటోలు ఇలా తీసుకుంటే అదిరిపోతాయ్!
Advertisement

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
AP DSC 2026 Notification: డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
Breaking News: ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
Amritsar Police:జంతర్ మంతర్‌లో ఐఎస్ఐ ముఠాల రెక్కీ! దాడులకు పాకిస్తాన్‌ కుట్ర! 9 మంది అరెస్టు! నిందితుల్లో నలుగురు మైనర్లు!
జంతర్ మంతర్‌లో ఐఎస్ఐ ముఠాల రెక్కీ! దాడులకు పాకిస్తాన్‌ కుట్ర! 9 మంది అరెస్టు! నిందితుల్లో నలుగురు మైనర్లు!
కలుషిత E20 ఇంధనంతో జాగ్రత్త! వెహికల్‌ ఓనర్లకు SIAM హెచ్చరిక - కేంద్రం కీలక ఆదేశాలు
E20 పెట్రోల్‌పై కొత్త ఆందోళన.. దెబ్బతింటున్న ఇంజిన్ పార్ట్స్, పెరుగుతున్న రిపేర్లు!
PM Modi Praises Nara Lokesh: నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
Embed widget