అన్వేషించండి

Mirror Superstition: పిల్లలకు అద్దం ఎందుకు చూపించకూడదు? సైన్స్, ఆధ్యాత్మికం, ఆరోగ్య రహస్యం!

చిన్న పిల్లలకు అద్దం చూపించకూడదని ఎందుకంటారు? మాటలు రావన్న మాట నిజమా? బేబీ అద్దం చూస్తే భయపడుతుందా? దీనివెనుకున్న సైంటిఫిక్ రీజన్ ఏంటి, ఆధ్యాత్మిక రహస్యం ఏంటి? 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • చిన్న పిల్లలకు అద్దం చూపడం అయోమయం, భయం కలిగిస్తుంది.
  • అద్దం పిల్లల కళ్ళు, మెదడుపై అనవసర ఒత్తిడి కలిగిస్తుంది.
  • ఆధ్యాత్మికంగా, దిష్టి దోషం, పూర్వజన్మ స్మృతులు ప్రభావితం చేస్తాయి.
  • పిల్లలు 18 నెలల తర్వాతే అద్దంలో తమను గుర్తించగలరు.

Children Mirror:  చిన్న పిల్లలకు అద్దం చూపించకూడదని పెద్దవాళ్లు చెబుతుంటారు. ఎందుకు అని అడిగితే మాటలు రావంటారు, ఎత్తు పళ్లు వస్తాయని, మోషన్స్ అవుతాయని.. ఇలా చాలా చెబుతారు. ఇవన్నీ నిజమో కాదో తెలియకపోయినా ఇప్పటికీ దీన్ని అనుసరిస్తున్నవారెందరో ఉన్నారు. ఇంతకీ నిజంగా చిన్నారులకు అద్దం చూపించకూడదా? ఇది మూఢనమ్మకమా? దీనివెనుక శాస్త్రీయకారణం ఉందా? ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారు? 

జాతకంలో బుధ గ్రహం బలహీనంగా ఉంటే పిల్లలు బుద్ధి, చదువు, మాటలపై తీవ్ర ప్రభావం ఉంటుందా? పరిహారాలేంటి?

సైన్స్ ఏం చెబుతోందంటే...

నవజాత శిశువుల్లో తనను తాను గుర్తించడం అనే సామర్థ్యం పూర్తిగా ఏర్పడదు. కనీసం 18 నెలలు..అంటే ఏడాదిన్నర గడిచిన తర్వాత తమని తాము అద్దంలో గుర్తించే అవకాశం ఉంటుంది. ఈ లోగా అద్దం చూపిస్తే ఆ ప్రతిబింబాన్ని వేరొక బేబీగా భావిస్తారు. అలాంటప్పుడు గందరగోళం, భయం కలిగే అవకాశం ఉంది. ఆ సమయంలో చిన్నారులు భయపడితే అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. అతిగా అద్దం చూపిస్తే నిద్ర సమస్యలు, ఆందోళన ఏర్పడే అవకాశం ఉంది. ఆధునిక శిశు మనస్తత్వం శాస్త్రం కూడా ఈ వయసులో అధిక స్టిములేషన్ నివారించాలనే సూచిస్తోంది. 

చేతికి, కాలికి నల్లదానం ఎందుకు? ఆధ్యాత్మిక రహస్యం & సైన్స్ ఏం చెబుతున్నాయ్?

ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారు..

ఆరోగ్యపరంగా చూస్తే చిన్నారుల కళ్లు, మెదడు అభివృద్ధి చెందుతున్న దశలో ఉంటాయి. అద్దంలో కనిపించే ప్రతిబింబం కళ్లపై అనవసర ఒత్తిడి తీసుకొచ్చి అనారోగ్య సమస్యలు తెచ్చిపెట్టొచ్చు. చిన్నారుల చేతిలో అద్దం ఉంటే..పొరపాటున పగిలితే గాయాలవడం లాంటి రిస్క్ కూడా ఉంది. అందుకే చిన్నారులకు అమ్మ, నాన్న, మామ, అక్క, అన్నయ్య అని నేరుగా ముఖాలు పరిచయం కావడమే ఆరోగ్యకరం. ఇది భావోద్వేగ అభివృద్ధికి, బంధం బలపడేందుకు సహాయపడుతుంది. 

అద్దం చూపిస్తే ఏమవుతుంది? ఆధ్యాత్మిక రహస్యం

హిందూ ధర్మం, నమ్మకాల ప్రకారం..అద్దంలో కనిపించే ప్రతిబింబం పూర్వజన్మ స్మృతులను రేకెత్తించి..మనసుని అస్థిర పరుస్తుందని నమ్మకం. అద్దంలో కనిపించే ప్రతిబింబం..ఆత్మిక సమతుల్యతను దెబ్బతీస్తుంది. అప్పుడప్పుడే బాహ్య ప్రపంచానికి అలవాటు పడుతున్న చిన్నారి భావోద్వేగాలపై అద్దం ప్రభావం ఉంటుందట. పైగా అద్దాన్ని దృష్టి దోషానికి ద్వారంగా భావిస్తారు. శిశువు ఆరా చాలా సున్నితంగా ఉండడం వల్ల..బాహ్య ప్రభావాల నుంచి రక్షించేందుకు ఈ నియమాన్ని విధించారు పెద్దలు. కాటుక పెట్టడం, దిష్టి పూసలు కట్టడం కూడా సంప్రదాయ రక్షణలో భాగమే. దీనికి బదులుగా తల్లి కళ్లలోకి చూడడం, సహజ వెలుగును చూపించడం, ప్రకృతిలో ఎక్కువ సేపు ఉంచేలా చేయడం ద్వారా శిశువు ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటాడు.

నమ్మకాల పేరుతో ఇప్పటికీ పాటిస్తున్న ఎన్నో అలవాట్లు..సైన్స్ తో ముడిపడి ఉన్నవే. అయితే అందుకు స్పష్టమైన కారణాలపై పూర్తిస్థాయిలో అవగాహన లేకపోవడం వల్ల అవి నమ్మకాలుగా మిగిలిపోయాయి. చిన్నారులకు అద్దం చూపించాలి అనుకుంటే 18 నెలల తర్వాత ప్రయత్నించండి.  

హిందూ ధర్మం - "దుస్తులకు సంబంధించిందా , గుణానికి సంబంధించిందా?

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం కేవలం నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. పండితులు చెప్పిన వివరాలు, ఆధ్యాత్మిక గ్రంధాల నుంచి సేకరించి అందించిన వివరాలు ఇవి. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని అమలు చేయడానికి ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.

Frequently Asked Questions

చిన్న పిల్లలు తమను తాము అద్దంలో ఎప్పటి నుంచి గుర్తించగలుగుతారు?

నవజాత శిశువులు తమను తాము అద్దంలో గుర్తించలేరు. సుమారు 18 నెలల తర్వాతే ఈ సామర్థ్యం ఏర్పడుతుంది. అంతకు ముందు చూపిస్తే వారికి గందరగోళం, భయం కలగవచ్చు.

చిన్నారులకు అద్దం చూపించడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయా?

అవును, అద్దంలోని ప్రతిబింబం కళ్లపై అనవసర ఒత్తిడిని కలిగించవచ్చు. అభివృద్ధి చెందుతున్న మెదడు, కళ్ళకు ఇది మంచిది కాదు, గాయాలయ్యే ప్రమాదం కూడా ఉంది.

పిల్లలకు అద్దం చూపించకూడదని ఆధ్యాత్మికంగా ఎందుకు అంటారు?

హిందూ ధర్మం ప్రకారం, అద్దంలోని ప్రతిబింబం పూర్వజన్మ స్మృతులను రేకెత్తించి, ఆత్మిక సమతుల్యతను దెబ్బతీస్తుందని నమ్మకం. అద్దాన్ని దృష్టి దోషానికి ద్వారంగా కూడా భావిస్తారు.

చిన్నారులకు అద్దం చూపించడం వల్ల కలిగే ఇతర నష్టాలు ఏమిటి?

అద్దం చూపించడం వల్ల పిల్లల్లో నిద్ర సమస్యలు, ఆందోళన ఏర్పడవచ్చు. ఆధునిక శిశు మనస్తత్వం అధిక స్టిములేషన్ నివారించాలని సూచిస్తుంది.

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

బుధుడు అస్తమయం: ఉద్యోగం మారాలని ఆలోచిస్తున్నారా? ముందుగా ఈ విషయాన్ని తెలుసుకోండి!
బుధుడు అస్తమయం: ఉద్యోగం మారాలని ఆలోచిస్తున్నారా? ముందుగా ఈ విషయాన్ని తెలుసుకోండి!
Guru Gochar 2026: నిద్రలేవగానే మొబైల్ చూసే అలవాటుందా? మీపై గురుగ్రహం ప్రభావం ఎలా ఉంటుందో తెలుసా!
నిద్రలేవగానే మొబైల్ చూసే అలవాటుందా? మీపై గురుగ్రహం ప్రభావం ఎలా ఉంటుందో తెలుసా!
Chandra Grahan 2026: చంద్ర గ్రహణం రోజు రక్షా బంధన్! పూజ చేసేందుకు సమయం, నియమాలు తెలుసుకోండి!
చంద్ర గ్రహణం రోజు రక్షా బంధన్! పూజ చేసేందుకు సమయం, నియమాలు తెలుసుకోండి!
బుధవారం ఏ దేవుడిని పూజించాలి?చదవాల్సిన శ్లోకాలు, పూజా విధానం, నైవేద్యం తెలుసుకోండి!
బుధవారం ఏ దేవుడిని పూజించాలి?చదవాల్సిన శ్లోకాలు, పూజా విధానం, నైవేద్యం తెలుసుకోండి!
Advertisement

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Adilabad Spiny Gourd:ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!
ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!
Kakinada AE Nookaraju Family Suicide Case: కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
Kolkata Hotel Fire Accident: కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
LPG to PNG Shift: LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
NTR Trivikram Movie Title: గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
Embed widget