స్వర్గాన్ని మించిన నగరం వారణాసి! ఒక్క రోజు పుణ్యం వంద సంవత్సరాల తీర్థ ఫలం!

Published by: RAMA

శ్రీనాథుడు రచించిన 'కాశీ ఖండం'లో వారణాసి గురించి ఇలా ఉంది

ఒక వర్ష శతంబున నొం
డొక తీర్ధము నందు గల ప్రయోజన లాభము
బొక దివసంబున నానం
ద కాననము నందు సర్వదా సిద్ధించున్!

వేరే తీర్థాల్లో వందేళ్లు ఉంటే లభించే పుణ్యఫలం కాశీ క్షేత్రంలో ఒక్కరోజున్నా సిద్ధిస్తుందని అర్థం

కాశీ ముందు స్వర్గం సరితూగదన్నారు శ్రీనాథుడు

విశ్వానికి ఆది నగరం కాబట్టి..ఇక్కడ పరమేశ్వరుడు విశ్వనాథుడిగా వెలిశాడు

ప్రళయం వచ్చినా, సృష్టి ముగిసినా కాశీ క్షేత్రం చెక్కుచెదరదని స్కంద పురాణంలో ఉంది

అంటే కలియుగం పూర్తై సత్యయుగం ప్రారంభమైనా..కాశీ క్షేత్రం అలానే వెలుగుతుందని అర్థం

ఓం నమఃశివాయ