8 రకాల సమస్యలకు ఒక్క టాబ్లెట్!

Published by: RAMA

బుద్ధిర్బలం యశో ధైర్యం, నిర్భయత్వ మరోగతా
అజాఢ్యం వాక్పటుత్వంచ హనుమత్ స్మరణాద్భవేత్

నిత్యం ఈ ఒక్క శ్లోకం చదివితే చాలు.. మీ సమస్యలు తీరి 8 వరాలు మీ సొంతమవుతాయి

బుద్ధి - సూర్యుడి దగ్గర విద్య నేర్చుకున్న హనుమాన్ స్మరణతో సరైన సమయంలో మైండ్ పదునుగా పనిచేస్తుంది

బలం - రామకార్యం కోసం అడుగు వెనక్కు వేయలేదు - కష్టమైనా దాటుకుని లక్ష్యాన్ని చేరుకునే బలం వచ్చేస్తుంది

యశః - హనుమాన్ కీర్తి గౌరవం కోసం పరిగెత్తలేదు..తన కర్తవ్యాన్ని నిర్వహించినందుకు అవే వచ్చాయ్

ధైర్యం - రావణుడి లంకకు ఒక్కడే వెళ్లి రామకార్యం పూర్తిచేసివచ్చాడు - ధైర్యంతో అడుగేస్తే మీరు సాధించనిది ఏముంటుంది

నిర్భయత్వం - జై హనుమాన్ అనే పిలుపుచాలు నిర్భయత్వం వచ్చేస్తుంది..మీ లక్ష్యసాధనలో అడ్డుగా వచ్చేదెవరు?

అరోగతా - సంజీవని తీసుకొచ్చి వైద్యుడు హనుమాన్ స్మరణ.. ఎలాంటి మానసిక రోగాన్ని అయినా తొలగించేస్తుంది

అజాఢ్యం - సాధ్యం అవుతుందా లేదా అనుకోలేదు సముద్రాన్ని లంఘించాడు.. మీరు వాయిదా వేసే తత్వం వదిలేస్తే విజయం మీ సొంతం

వాక్పటుత్వం - వ్యక్తిని బట్టి సందర్భాన్ని బట్టి మాట్లాడే విధానం మిమ్మల్ని గొప్పగా నిలబెడుతుంది..