వారణాసి గురించి ఆశ్చర్యపరిచే రహస్యం!

Published by: RAMA

ఒకప్పుడు విశ్వం మొత్తం నీటితో నిండిఉండేది.. సృష్టి ప్రారంభించేందుకు భూమిలేదు

నీరునిండిన ప్రదేశం నుంచి కొంతభాగాన్ని త్రిశూలంతో పైకెత్తి పట్టుకున్నాడు శివుడు..అదే భూమి

త్రిశూలంపై ఉన్న భూభాగం నుంచి సృష్టి ప్రారంభించాడు బ్రహ్మదేవుడు

దేవతలు,రుషుల విన్నపం మేరకు ఆ భూబాగాన్ని సురక్షితంగా కిందకు దించాడు శివుడు

త్రిశూలాన్ని కాశిక అంటారు..అందుకే కాశీ అనే పేరొచ్చింది..అలా సృష్టిలో మొదటి నగరం కాశీ అయింది

చుట్టూ నీరున్నా వారణాసి నగరం అలానే ఉంది..అందుకే ప్రళయం వచ్చి భూమి మునిగినా వారణాసి చెక్కుచెదరదు

సృష్టిలో మొదటి నగరం మాత్రమే కాదు..చివరి నగరం కూడా కాశి అని బ్రహ్మవైవర్త పురాణంలో ఉంది

ఐదువేల ఏళ్ల క్రితమే కాశి నగరం ప్రస్తావన వేదాల్లో, ఇతిహాసాల్లో ఉంది