ఆమె తెలుగు సాహిత్యం, లోకకథలలో ప్రసిద్ధ ఊహాత్మక పాత్ర. ఆమె నిజమైన చారిత్రక వ్యక్తి కాదు, కానీ కథలు చెప్పే సంప్రదాయిక ముసలమ్మగా స్థిరపడింది.
పేదరాసి పెద్దమ్మ ఎవరు? ఆమె నిజంగా ఉండేదా? ఆమె గురించి పుస్తకాల్లో ఏముంది?
పేదరాసి పెద్దమ్మ అనే పేరు వినే ఉంటారుగా? ఆమె నిజంగా ఉండేదా? ఆమె పేరుతో కథలు చెప్పేవారా? పేదరాసి పెద్దమ్మ గురించి పుస్తకాల్లో ఏముంది?

- తెలుగు కథలలో పేదరాసి పెద్దమ్మ ఊహాత్మక, జ్ఞానవంతురాలైన పాత్ర.
- ఆమె కథలు నీతి, పరోపకారం, బుద్ధి, ధైర్యం బోధిస్తాయి.
- చందమామ, పత్రికలు, 1968 సినిమాలో ఆమె కథలు ప్రాచుర్యం.
Pedarasi Peddamma: తెలుగు కథల పాత్రల్లో అమ్మమ్మ పేదరాసి పెద్దమ్మ అని తెలుగు సాహిత్యం, లోకకథలు, పిల్లల సాహిత్యంలో ప్రసిద్ధ ఊహాత్మక పాత్ర. ఆమె నిజమైన చారిత్రక వ్యక్తికాదు కానీ తెలుగు సంస్కృతిలో అమ్మమ్మ కథలు చెప్పే సంప్రదాయిక గ్రామీణ ముసలమ్మగా స్థిరపడిన పాత్ర.
పేదరాసి అంటే సాధారణ జీవనం, పెద్దమ్మ అంటే ముసలామె, అమ్మమ్మ అని అర్థం. సాధారణంగా గ్రామంలో ఓ చిన్న ఇంట్లో నివసించే పరోపకారి, జ్ఞానవంతురాలైన ముసలమ్మగా చిత్రీకరించారు. రాకుమారులు, దొంగలు, సామాన్యులు..ఇలా ఎందరో ఆమె ఇంటికి వచ్చి సహాయం పొందారని,... రాజు వచ్చినా, దొంగ వచ్చినా, సామాన్యుడు వచ్చినా ఆమె అందరకీ ఒకేలాంటి నీతి కథలు బోధిస్తుంది.
కలలో పాములు, దేవాలయాలు, నదులు కనిపిస్తే..దాని వెనుక కారణం ఏంటో తెలుసా?
చందమామ పిల్లల మాసపత్రిక 1948 జనవరి సంచికలో ఆమె గురించి వివరంగా ఉంది. అందులో పేదరాసి పెద్దమ్మను... తెలియని విషయం లేని సప్త సముద్రాల అవతల ఉన్న విషయాలు కూడా తెలిసిన జ్ఞానవంతురాలిగా వర్ణించారు. రాజకథల్లో ఆమె తప్పకుండా వస్తుంది. ఆమె కథలు సాధారణంగా నీతి, పరోపకారం, బుద్ధి, ధైర్యం, మంచి చెడు తేడా వంటి సందేశాలను అందిస్తాయి. పిల్లలంతా సాయంత్రం వేళ ఆమె చుట్టూ చేరి కథలు వింటారు అనే మాట బాగా ప్రజాదరణ పొందింది.
తెలంగాణ జానపద కళారూపమైన ఒగ్గు కథల్లో పేదరాశి పెద్దమ్మ కథకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ కథలు మంచితనం, దయ, పెద్దల పట్ల గౌరవాన్ని చాటిచెబుతాయి. పేదరాసి పెద్దమ్మ కథల్లో నిస్వార్థ గుణం, ఇతరులకు సహాయం చేసే తత్వం ప్రధానంగా కనిపిస్తాయి. తెలంగాణలో ఎందరో ఒగ్గు కళాకారులు సానికె బాలప్ప, సలేంద్ర కొమురయ్య..ఈ కథలను తమదైన శైలిలో గేయాలుగా, సంభాషణలతో అద్భుతంగా ప్రదర్శిస్తారు.
దేవశయని ఏకాదశి 2026, చాతుర్మాస్యం ప్రారంభం! 120 రోజులు శుభకార్యాలకు బ్రేక్, మళ్లీ మొదలయ్యేది ఎప్పుడంటే!
పేదరాసి పెద్దమ్మ కథల సంకలనాలు ఎన్నో ఉన్నాయ్...
చందమామ, ఇతర పిల్లల పత్రికలు, ప్రతిలిపి, ఆన్ సైట్లలో వందలాది కథలు లభ్యంఅవుతున్నాయ్. (పేదరాసి పెద్దమ్మ కథలు - A.N.జగన్నాథ శర్మ, అమరావతి పబ్లికేషన్స్) , పండిట్ ధీరూభాయ్ సంకలనాలు, మద్దురి పద్మావతి వజ్జులు రచనలు..ఇవన్నీ బాల సాహిత్యంగా ప్రచురితమయ్యాయి. ఇక 1968లో పేదరాశి పెద్దమ్మ కథ సినిమాగా వచ్చింది. గిడుతూరి సూర్యం దర్శకత్వంలో కాంతారావు, కృష్ణకుమారి, నిర్మలమ్మ నటించారు. చందమామ శైలిలో ముసలమ్మ కథ సాగుతుంది. తెలంగాణలో ఒగ్గు కథలుగా కూడా 1968లో పేదరాశి పెద్దమ్మ కథ సినిమా వచ్చింది (దర్శకుడు గిడుతూరి సూర్యం, నటీనటులు కాంతారావు, కృష్ణకుమారి, నిర్మలమ్మ). ఇందులో చందమామ శైలిలోని ముసలమ్మ కథ సాగుతుంది.
పేదరాసి పెద్దమ్మ తెలుగు సంస్కృతికి మంచి సారాంశం.. గ్రామీణ జ్ఞానం. నీతి, కథల ద్వారా తరతరాలకు అందించే సంప్రదాయం. ఆధునిక కాలంలోనూ ఆమె ఇంకా డిజిటల్ కథల్లో జీవించి ఉంది. పేదరాసి పెద్దమ్మ కథలు చదివితే పిల్లల్లో మంచి విలువలు, ఊహాశక్తి, సహనం పెరుగుతాయి.
Frequently Asked Questions
పేదరాసి పెద్దమ్మ నిజమైన వ్యక్తిత్వమా?
పేదరాసి పెద్దమ్మ అనే పేరుకు అర్థం ఏమిటి?
'పేదరాసి' అంటే సాధారణ జీవనం, 'పెద్దమ్మ' అంటే ముసలామె లేదా అమ్మమ్మ అని అర్థం. ఆమె సాధారణంగా జ్ఞానవంతురాలైన పరోపకారిగా చిత్రీకరించబడింది.
పేదరాసి పెద్దమ్మ కథలు ఎలాంటి సందేశాలను అందిస్తాయి?
ఆమె కథలు నీతి, పరోపకారం, బుద్ధి, ధైర్యం, మంచి చెడు తేడాలు వంటి సందేశాలను ఇస్తాయి. పిల్లలు సాయంత్రం ఆమె చుట్టూ చేరి కథలు వింటారు.
పేదరాసి పెద్దమ్మ గురించి ఎక్కడ ప్రస్తావించారు?
చందమామ పిల్లల మాసపత్రిక 1948 జనవరి సంచికలో ఆమె గురించి వివరంగా ఉంది. రాజకథల్లో ఆమె తప్పకుండా వస్తుందని అందులో వర్ణించారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు























