అన్వేషించండి

శ్రావణమాసం: జ్యోతిర్లింగ దర్శన పుణ్యం, ఇంట్లో శివారాధనతో సకల శుభాలు!

Dwadasa Jyotirlinga: శ్రావణమాసంలో ఉజ్జయిని మహాకాల్, కేదార్‌నాథ్ సహా జ్యోతిర్లింగాలను దర్శించుకుంటే ఎలాంటి ప్రయోజనాలుంటాయ్? దర్శించుకునే భాగ్యం లేనివారు ఏం చేయాలి? ఆధ్యాత్మికవేత్తలు ఏం చెబుతున్నారు?

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • శ్రావణమాసంలో శివ, పార్వతి ఆరాధనకు విశేష ప్రాధాన్యత ఉంది.
  • శ్రావణంలో జ్యోతిర్లింగ దర్శనంతో కష్టాలు తొలగి మోక్షం లభిస్తుంది.
  • దర్శనం కుదరకపోతే, ఇంట్లో శివాభిషేకం, మంత్ర పఠనం చేయాలి.
  • ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్ర పఠనం పాప విముక్తి, శుభ ఫలాలనిస్తుంది.

Sravana Masam 2026: శ్రావణమాసంలో దక్షిణాదిలో శ్రావణ మంగళవారం మంగళగౌరి, శ్రావణ శుక్రవారం వరలక్ష్మీదేవి పూజల సందడి నడిస్తే..ఉత్తరాదిన పరమేశ్వరుడి ఆరాధనలో మునిగితేలుతారు భక్తులు. ఆషాఢ అమావాస్య తర్వాత వచ్చే పాడ్యమి నుంచి దక్షిణాదిన శ్రావణమాసం ప్రారంభమవుతుంది. అయితే ఉత్తరాదిన 15 రోజుల ముందే..ఆషాఢ పౌర్ణమి తర్వాత పాడ్యమి (జూలై 30 )నుంచి శ్రావణమాసం ప్రారంభమైంది. ఏదేమైనా శ్రావణమాసంలో అమ్మవారి ఆరాధనతో పాటూ అయ్యవారి ఆరాధనకు విశేష ప్రాధాన్యత ఉంది.ఈ నెలలో శివారాధన చేయడం, జ్యోతిర్లింగ దర్శనం అత్యంత పుణ్యఫలం అంటారు ఆధ్యాత్మికవేత్తలు. 

శివ పురాణం ప్రకారం, శ్రావణ మాసంలో శివుడిని దర్శించుకుంటే కష్టాలన్నీ తొలగిపోతాయి. ఉత్తరాదిన జూలై 30 నుంచి శ్రావణమాసం ప్రారంభం కావడంతో శివాలయాలు భక్తులతో కళకళలాడుతున్నాయ్. ఆలయాల వద్ద భారీ క్యూలైన్లలో భక్తులు బారులుతీరారు. సాధారణ రోజులతో పోలిస్తే  శ్రావణ మాసంలో 12 జ్యోతిర్లింగ ఆలయాల వద్ద భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది.

జాతకంలో పితృ, కాలసర్ప దోషాలు తొలగించే శివపూజా విధానం!

స్కంద పురాణంలోని కాశీ ఖండం ప్రకారం, శ్రావణ మాసం శివునికి అత్యంత ప్రియమైనది. ఈ సమయంలో 12 జ్యోతిర్లింగాలను దర్శించే భక్తులు గ్రహ దుష్ప్రభావాల నుంచి విముక్తి పొంది, మోక్ష మార్గాన్ని పొందుతారని నమ్ముతారు. ఒకవేళ ఏదైనా కారణంతో మీరు శ్రావణ మాసంలో జ్యోతిర్లింగాన్ని దర్శించుకోలేకపోతే, ఇంట్లోనే శివ భగవానునికి అభిషేకం చేసి ద్వాదశ జ్యోతిర్లింగ మంత్రాన్ని పఠించండి. ఇలా చేయడం వల్ల దీర్ఘాయువు మంచి ఆరోగ్యం, విజయం, వైవాహిక జీవితంలో సుఖం , సంతానం వంటి ఆశీస్సులు లభిస్తాయని నమ్ముతారు.
 
ఆది శంకరాచార్యులు ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రంలో ఇలా అన్నారు 
"ద్వాదశైతానీ నామానీ ప్రతరుత్థాయ యః పతేత్"
 
అంటే, సకల పాపాల నుంచి విముక్తి పొందడం, సకల పరిపూర్ణతల ఫలాలను పొందడం. దీని అర్థం ఏంటంటే ప్రతి ఉదయం 12 జ్యోతిర్లింగాల నామాలను స్మరించే లేదా పఠించే వ్యక్తి పాపాల నుంచి విముక్తి పొంది, సకల సిద్ధులను శుభ ఫలితాలను పొందుతాడు. ఈ స్తోత్రాన్ని శ్రావణ మాసంలో పఠించడం వల్ల రెట్టింపు ఫలాలు లభిస్తాయి. 

12 జ్యోతిర్లింగాలు - సోమనాథ్, మల్లికార్జున, మహాకాళేశ్వర్, ఓంకారేశ్వర్ (మమ్లేశ్వర్), కేదార్‌నాథ్, భీమశంకర్, కాశీ విశ్వనాథ్, త్రయంబకేశ్వర్, వైద్యనాథ్, నాగేశ్వర్, రామేశ్వరం, ఘృష్ణేశ్వర్.

మీకు పెళ్లైనట్టు మీకు కలొచ్చిందా ఎప్పుడైనా! దాని సంకేతం ఏంటో తెలుసా?

శివ పురాణం ప్రకారం, పరమశివుడు అనంతమైన అగ్ని స్తంభం (జ్యోతి) రూపంలో అవతరించాడు. ఆయన తన భక్తుల సంక్షేమం కోసం భూమిపై 12 ప్రదేశాలలో జ్యోతిర్లింగ రూపంలో కొలువుదీరాడు.

జ్యోతిర్లింగ స్తోత్రం

ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం 

సౌరాష్ట్రే సోమనాథం చ శ్రీశైలే మల్లికార్జునమ్ 
ఉజ్జయిನ್ಯಾಂ మహాకాలం ఓంకారమమలేశ్వరమ్ ||

పర్ల్యాం వైద్యనాధంచ ఢాకిన్యాం భీమ శంకరమ్ ।
సేతుబంధేతు రామేశం నాగేశం దారుకావనే ॥

వారణాశ్యాంతు విశ్వేశం త్రయంబకం గౌతమీతటే ।
హిమాలయేతు కేదారం ఘృష్ణేశంతు విశాలకే ॥

ఫలశృతి

ఏతాని జ్యోతిర్లింగాని సాయం ప్రాతః పఠేన్నరః ।
సప్త జన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి ॥

చాతుర్మాస్యం ప్రారంభం.. నాలుగు నెలలు దీక్ష ఎవరైనా చేయొచ్చా , నియమాలేంటి, దీని వెనుకున్న ఆరోగ్యం రహస్యం తెలుసా?

గమనిక: ఆధ్యాత్మికవేత్తలు సూచించిన వివరాలు, ఆధ్యాత్మిక గ్రంధాల్లో పొందుపరిచిన సమాచారం ఆధారంగా అందించిన కథనం ఇది. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.  దీనిని అనుసరించేముందు మీరు విశ్వశించే పండితుల సలహాలు స్వీకరించగలరు

Frequently Asked Questions

శ్రావణ మాసం ఉత్తర మరియు దక్షిణ భారతదేశంలో ఎప్పుడు మొదలవుతుంది?

దక్షిణాదిన ఆషాఢ అమావాస్య తర్వాత పాడ్యమి నుండి ప్రారంభమవుతుంది. ఉత్తరాదిన ఆషాఢ పౌర్ణమి తర్వాత పాడ్యమి (జూలై 30) నుండి మొదలవుతుంది.

శ్రావణ మాసంలో శివారాధన ప్రాముఖ్యత ఏమిటి?

ఈ నెలలో శివారాధన చేయడం, జ్యోతిర్లింగ దర్శనం అత్యంత పుణ్యఫలం. శివ పురాణం ప్రకారం, ఈ మాసంలో శివుడిని దర్శించుకుంటే కష్టాలన్నీ తొలగిపోతాయి.

శ్రావణ మాసంలో జ్యోతిర్లింగాలను దర్శించడం వల్ల లేదా మంత్ర పఠనం వల్ల కలిగే లాభాలు ఏమిటి?

గ్రహ దుష్ప్రభావాల నుండి విముక్తి పొంది, మోక్ష మార్గాన్ని పొందుతారు. దీర్ఘాయువు, మంచి ఆరోగ్యం, విజయం, వైవాహిక సుఖం మరియు సంతానం వంటి ఆశీస్సులు లభిస్తాయి.

శ్రావణ మాసంలో జ్యోతిర్లింగాన్ని దర్శించలేనివారు ఏమి చేయాలి?

ఇంట్లోనే శివ భగవానునికి అభిషేకం చేసి, ద్వాదశ జ్యోతిర్లింగ మంత్రాన్ని పఠించాలి. ఇలా చేయడం వల్ల దీర్ఘాయువు, మంచి ఆరోగ్యం వంటి శుభ ఫలితాలు లభిస్తాయి.

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

శ్రావణమాసం: జ్యోతిర్లింగ దర్శన పుణ్యం, ఇంట్లో శివారాధనతో సకల శుభాలు!
శ్రావణమాసం: జ్యోతిర్లింగ దర్శన పుణ్యం, ఇంట్లో శివారాధనతో సకల శుభాలు!
జాతకంలో పితృ, కాలసర్ప దోషాలు తొలగించే శివపూజా విధానం!
జాతకంలో పితృ, కాలసర్ప దోషాలు తొలగించే శివపూజా విధానం!
మీకు పెళ్లైనట్టు మీకు కలొచ్చిందా ఎప్పుడైనా! దాని సంకేతం ఏంటో తెలుసా?
మీకు పెళ్లైనట్టు మీకు కలొచ్చిందా ఎప్పుడైనా! దాని సంకేతం ఏంటో తెలుసా?
30-07-2026 గురువారం మీ రాశిఫలాలు!
30-07-2026 గురువారం మీ రాశిఫలాలు!
Advertisement

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy: కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
Supreme Court Big Relief Telangana: తెలంగాణ ప్రాజెక్టులకు సుప్రీంకోర్టులో ఊరట - పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మ సాగర్‌కు గ్రీన్ సిగ్నల్!
తెలంగాణ ప్రాజెక్టులకు సుప్రీంకోర్టులో ఊరట - పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మ సాగర్‌కు గ్రీన్ సిగ్నల్!
Pallaburusu Teaser Review : టూత్ బ్రష్ కోసం తండ్రీ కొడుకుల వార్ - లెనిన్ తర్వాత చిన్న సినిమా టీజర్ వచ్చేసింది
టూత్ బ్రష్ కోసం తండ్రీ కొడుకుల వార్ - లెనిన్ తర్వాత చిన్న సినిమా టీజర్ వచ్చేసింది
Ramayana Trailer Review : రామాయణ ట్రైలర్ - శ్రీరాముడి శాంత స్వరూపం... రావణుడి ఉగ్ర రూపం... సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్
రామాయణ ట్రైలర్ - శ్రీరాముడి శాంత స్వరూపం... రావణుడి ఉగ్ర రూపం... సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్
US Iran War: ఇరాన్ దాడిపై అమెరికా తీవ్ర ఆగ్రహం, క్షిపణుల ప్రయోగం, తగిన సమాధానం ఇస్తామన్న ట్రంప్‌! 
ఇరాన్ దాడిపై అమెరికా తీవ్ర ఆగ్రహం, క్షిపణుల ప్రయోగం, తగిన సమాధానం ఇస్తామన్న ట్రంప్‌! 
Adilabad Rains News: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో జోరు వానలు- ఉప్పొంగుతున్న వాగులు, వంకలు! చూడముచ్చటగా జలపాతాలు!
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో జోరు వానలు- ఉప్పొంగుతున్న వాగులు, వంకలు! చూడముచ్చటగా జలపాతాలు!
Tamil Nadu Head Shaving Scam: ప్రభుత్వ పథకం పేరిట వింత మోసం - గుండు గీయించుకుంటే రూ.15 వేలంటూ మహిళలకు బురిడీ!
ప్రభుత్వ పథకం పేరిట వింత మోసం - గుండు గీయించుకుంటే రూ.15 వేలంటూ మహిళలకు బురిడీ!
Commonwealth Games 2026: CWG 2026లో భారత్‌కు మూడో స్వర్ణ, బాక్సింగ్‌లో 10 పతకాలు ఖాయం!
CWG 2026లో భారత్‌కు మూడో స్వర్ణ, బాక్సింగ్‌లో 10 పతకాలు ఖాయం!
Embed widget