Eating Rules In Shastra: కంచంలో చేయి కడుతున్నారా? అయితే ఈ ఇబ్బందులు తప్పవు..!
Things Not to Do After Eating: భోజనం చేసేటప్పుడు కొన్ని తప్పులు చేయకూడదని మన గ్రంథాలు, పెద్దలు చెబుతుంటారు. తిన్న తర్వాత మనం చేయకూడని తప్పులు ఏంటో తెలుసా? భోజనం తర్వాత ఈ తప్పులు చేస్తే ఏమౌతుంది?
![Eating Rules In Shastra: కంచంలో చేయి కడుతున్నారా? అయితే ఈ ఇబ్బందులు తప్పవు..! never do this one mistake after having food it will make you poor Eating Rules In Shastra: కంచంలో చేయి కడుతున్నారా? అయితే ఈ ఇబ్బందులు తప్పవు..!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/10/479d0abacf4198f4d2970c26b458ae781686415071956691_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Things Not to Do After Eating: మత గ్రంథాలలో, మనం చేసే ప్రతి పనికి సంబంధించిన నియమాలు స్పష్టంగా వివరించారు. ఈ నియమాలు మనం ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు చేసే ప్రతి పనికి వర్తిస్తాయి. కానీ, కొందరు అలాంటి నియమాలను పాటిస్తుంటే మరికొందరు వాటిని విస్మరిస్తున్నారు. గ్రంధాలలో ఆహారానికి సంబంధించిన అనేక నియమాలను మనం చూడవచ్చు. ఈ నియమాలలో కొన్ని ప్రతిరోజూ మనకు తెలియకుండానే విస్మరిస్తుంటాము. అయితే అలా చేయడం మన పేదరికానికి దారి తీస్తుంది. ఆహారం విషయంలో చేయకూడని తప్పులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
Also Read : భోజనానికి ముందు ప్లేటు చుట్టూ నీళ్లు ఎందుకు చల్లాలి? శాస్త్రాలు ఏం చెబుతున్నాయి?
1. భోజనం తర్వాత ఈ తప్పు చేయవద్దు
చాలా మంది భోజనం తర్వాత తిన్న కంచంలోనే చేతులు కడుక్కోవడం మీరు గమనించి ఉంటారు. మనం ఈ తప్పు చేస్తే ఆహార నియమాలను ఉల్లంఘించినట్లే, తినే ఆహారాన్ని అవమానించినట్లే. ఇలా చేయడం వల్ల ఆహారం గౌరవం పోవడమే కాకుండా భవిష్యత్తులో దాని దుష్పరిణామాలను కూడా ఎదుర్కోవాల్సి రావచ్చు. కంచంలో చేతులు కడుక్కోవడానికి బదులుగా, సింక్ వద్ద లేదా మరో ప్రాంతంలో చేతులు కడుక్కోవాలి. దీనికి సంబంధించిన మరో అంశం ఏమిటంటే, తిన్న తర్వాత కంచం అలా వదిలేయకూడదు. భోజనం చేసిన వెంటనే కడిగి శుభ్రం చేయాలి.
2. అన్నపూర్ణేశ్వరికి అవమానం
మత గ్రంథాల ప్రకారం, అన్నపూర్ణాదేవి ఆహారానికి అధి దేవత. ఆవిడ అనుగ్రహం వల్లనే మనకు ఆహారం లభిస్తుంది కాబట్టి భోజనం చేసే ముందు ఒకసారి ఆమెను స్మరించుకోవాలి. తిన్న తర్వాత అదే ప్లేటులో చేతులు కడుక్కోవడం అన్నపూర్ణా దేవిని అవమానించినట్లే. అన్నపూర్ణ దేవి మరెవరో కాదు, సాక్షాత్తూ మహాలక్ష్మి స్వరూపం. అన్నపూర్ణా దేవిని అవమానించే వ్యక్తి ఎప్పుడూ పేదరికాన్ని ఎదుర్కొంటాడు.
3. అశుభ ఫలితాలు
జ్యోతిష్యం ప్రకారం మనం మన దైనందిన జీవితంలో తెలిసి లేదా తెలియక అనేక తప్పులు చేస్తుంటాము. వాటిలో ఒకటి తిన్న కంచంలో చేతులు కడుక్కోవడం. చాలా మంది ప్రతిరోజూ ఇలాంటి తప్పులు చేస్తుంటారు. అందుకే వారు జీవితంలో అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటారు. జ్యోతిష్యుల అభిప్రాయం ప్రకారం, గ్రహాలు కూడా అతనికి వ్యతిరేకంగా సంచరిస్తాయి. ఆహారం తిన్న కంచంలో చేతులు కడుక్కోవడం ద్వారా ఆ వ్యక్తికి అశుభ ఫలితాలు ఇవ్వడం ప్రారంభిస్తాయి. దాని అత్యంత ప్రతికూల ప్రభావం ఒక వ్యక్తి ఆరోగ్యంపై ఉంటుంది. అందుకే తిన్న కంచంలో చేతులు కడుక్కోవడం మానుకోవాలి. తిన్న కంచంలో చేతులు కడుక్కునే వ్యక్తి పేదరికానికి గురవుతాడు. అలాంటి వ్యక్తులు జీవితంలో డబ్బు సమస్యలతో పాటు ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. ఈ కారణంగా, కంచంలో చేయి కడిచే అలవాటు మానుకోండి.
Also Read : జ్యేష్ఠ మాసంలో ఇలాంటి ఆహారం తీసుకుంటే కష్టాలే!
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)