News
News
వీడియోలు ఆటలు
X

Mahabharat: మహాభారతంలోని ఈ ముఖ్యమైన ప్రదేశాలను ఇప్పుడు ఏయే పేర్లతో పిలుస్తున్నారో తెలుసా?

Mahabharat: మహాభారత కాలంలోని చాలా ప్రదేశాల గురించి మ‌నం వినవచ్చు, ఈ ప్రదేశాలను సందర్శించి ఉండ‌వ‌చ్చు. మహాభారత కాలం నాటి కొన్ని ప్రాంతాల పేర్లు మారగా, మరికొన్ని అసలు పేర్లతోనే ఇప్పటికీ ఉన్నాయి.

FOLLOW US: 
Share:

Mahabharat: మనందరికీ తెలిసినట్లుగా, మహాభారతం హిందువుల‌ పవిత్ర గ్రంథం. ఈ గ్రంథంలో మహాభారతానికి సంబంధించిన అనేక నగరాలు, ప్రదేశాల వివరణను మనం చూడవచ్చు. మహాభారతంలో పేర్కొన్న‌ అనేక ప్రసిద్ధ ప్రదేశాలను కూడా మనం చూడవచ్చు. కానీ, మహాభారతం కాలంతో పోలిస్తే, ప్ర‌స్తుతం ఆయా ప్రాంతాల రూపాల్లో, పేర్లలో కొన్ని మార్పులు వచ్చాయి. మహాభారత కాలం నాటి ముఖ్యమైన ప్రదేశాలు.. వాటి ఇటీవలి పేర్ల గురించి తెలుసుకుందాం.

ఇంద్రప్రస్థ

ఇంద్రప్రస్థ మహాభారతంలోని అత్యంత ముఖ్యమైన ప్రదేశాలలో ఒకటిగా పేరొందింది. హస్తినాపురం నుంచి బహిష్కరించిన‌ తరువాత, పాండవులు ఇంద్రప్రస్థాన్ని తమ రాజధానిగా చేసుకున్నారు. మహాభారతంలోని ఇంద్రప్రస్థ ప్ర‌స్తుత‌ భారతదేశ‌ రాజధాని ఢిల్లీ న‌గ‌రం.

హస్తినాపురం

ఇంద్రప్రస్థ లాగానే హస్తినాపురం కూడా మహాభారతంలో చాలా ప్రాముఖ్యత కలిగిన ప్రదేశం. ఎందుకంటే హస్తినాపురం కౌరవుల రాజ్యం. మహాభారతం మొత్తం కథ హస్తినాపురం చుట్టూ తిరుగుతుంది. ఈ ప్రదేశం ప్రస్తుత మీరట్ నగరానికి సమీపంలో ఉంది. మహాభారత యుద్ధం కారణంగానే నేటికీ ఇక్కడి నేల ఎర్రగా ఉంద‌ని భావిస్తారు.

త‌క్షిలా

మహాభారత కాలంలో గాంధార ప్రాంత రాజధాని అయిన తక్షిలాను కాందహార్ అని పిలుస్తారు. ఇది ఆఫ్ఘనిస్తాన్‌లో ఉంది. కౌరవుల తల్లి గాంధారి, గాంధార రాజు సుబల కుమార్తె. గాంధారి కారణంగా ఈ ప్రాంతానికి గాంధార అని పేరు వచ్చింది.

ఉజ్జనిక

మహాభారతంలో ప్రస్తావించిన ఉజ్జనిక అనే ప్రదేశం ప్రస్తుత ఉత్తరాఖండ్‌లోని కాశీపూర్‌. ద్రోణాచార్యుడు ఇక్క‌డే కౌరవులకు, పాండవులకు విద్య నేర్పాడ‌ని చెబుతారు. ఇక్కడ ద్రోణ సాగర సరస్సును పాండవులు నిర్మించార‌ని భావిస్తారు.

వారణావతం

మహాభారత కాలంలో ప్రస్తావించిన ప్రదేశాల్లో వారణావతం ఒకటి. కౌరవులు పాండవులను లక్షగృహంలో కాల్చి చంపడానికి ప్రయత్నించిన ప్రదేశం ఇదే. ఈ లక్షగృహం నేడు ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పత్‌లో ఉంది.

పాంచాల

పాంచాల రాజ్యం ద్రౌపది తండ్రి ద్రుపద‌ రాజుకు చెందిన‌ది. ప్ర‌స్తుతం ఈ ప్రదేశం హిమాలయాలు, చంబా నది మధ్య ప్రాంతాల్లో ఉంది. ద్రౌపదికి పాండవులతో ఈ ప్రదేశంలో వివాహం జరిగిందని చెబుతారు.

బృందావనం

మహాభారత కాలం నాటి బృందావనం ఇప్పటికీ ఈ పేరుతోనే ప్ర‌చారంలో ఉంది. ప్రస్తుతం ఇది ఉత్తరప్రదేశ్‌లో ఉంది. ఈ ప్రదేశానికి శ్రీకృష్ణుడితో ప్రత్యేక సంబంధముందని భావిస్తారు. ఇక్కడ శ్రీకృష్ణుడు గోపికలతో గ‌డిపేవాడు.

అంగ రాజ్యం                   

కర్ణుడి రాజ్యమైన అంగ రాజ్యం గురించి భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కొందరి అభిప్రాయం ప్రకారం, బీహార్‌లోని భాగల్‌పూర్ మహాభారత కాలం నాటి అంగదేశంగా ఉంది. మరికొందరు, ఉత్తర ప్రదేశ్‌లోని గోండును కర్ణుని రాజ్యంగా పరిగణిస్తారు. దీని కారణంగా అంగ‌ దేశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మథుర                  

మథుర నగరం వర్ణన మహాభారతంలో కూడా కనిపిస్తుంది. నేటికీ ఈ ప్రాంతాన్ని మథుర అని పిలుస్తారు. ఈ ప్రదేశంలో శ్రీకృష్ణుడు జన్మించాడని మ‌హాభార‌తంలో కథనం ఉంది. ఈ ప్రాంతాన్ని శ్రీకృష్ణుని జన్మస్థలంగా భావించి భక్తులు భారీగా త‌ర‌లివ‌స్తారు.

Also Read: మహాభారతం నేర్పే ఐదు జీవిత పాఠాలు

Published at : 26 Apr 2023 02:25 PM (IST) Tags: mahabharat prominent places in mahabharat present names of mahabharat cities

సంబంధిత కథనాలు

Vastu Tips In Telugu: బోర్, వాటర్ ట్యాంక్ మీ అపార్ట్ మెంట్ లో ఎక్కడున్నాయి, వాస్తు ప్రకారం ఎక్కడుండాలి!

Vastu Tips In Telugu: బోర్, వాటర్ ట్యాంక్ మీ అపార్ట్ మెంట్ లో ఎక్కడున్నాయి, వాస్తు ప్రకారం ఎక్కడుండాలి!

Katra Vaishnodevi: గుహలో ప్రయాణం , ముగ్గురమ్మలు కొలువుతీర్చిన శక్తి దర్శనం- కట్రా'వైష్ణోదేవి' విశిష్ట‌త‌ తెలుసా!

Katra Vaishnodevi: గుహలో ప్రయాణం , ముగ్గురమ్మలు కొలువుతీర్చిన శక్తి దర్శనం- కట్రా'వైష్ణోదేవి' విశిష్ట‌త‌ తెలుసా!

జూన్ 4 రాశిఫలాలు, ఈ రాశివారు ఒకరి మాటల్లో కూరుకుపోవద్దు తెలివిగా ఆలోచించండి

జూన్ 4 రాశిఫలాలు, ఈ రాశివారు ఒకరి మాటల్లో కూరుకుపోవద్దు తెలివిగా ఆలోచించండి

Weekly Horoscope (05-11 June): ఈ వారం ఈ రాశులవారికి లైఫ్ కొత్తగా ప్రారంభమైనట్టు ఉంటుంది

Weekly Horoscope (05-11 June): ఈ వారం ఈ రాశులవారికి  లైఫ్ కొత్తగా ప్రారంభమైనట్టు ఉంటుంది

Navagrahas Pooja: నవగ్రహాల దర్శనానికి వెళ్లేవారు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలివి!

Navagrahas Pooja: నవగ్రహాల దర్శనానికి వెళ్లేవారు తెలుసుకోవాల్సిన  ముఖ్యమైన విషయాలివి!

టాప్ స్టోరీస్

Gudivada Amarnath: రైల్వే మంత్రితో మంత్రి అమర్నాథ్ భేటీ, ఏపీ సీఎం జగన్ ను అభినందించిన అశ్విని వైష్ణవ్

Gudivada Amarnath: రైల్వే మంత్రితో మంత్రి అమర్నాథ్ భేటీ, ఏపీ సీఎం జగన్ ను అభినందించిన అశ్విని వైష్ణవ్

Coromandel Express Accident: మృతుల సంఖ్య 288 కాదు, 275 - రెండు సార్లు లెక్కపెట్టడం వల్లే కన్‌ఫ్యూజన్

Coromandel Express Accident: మృతుల సంఖ్య 288 కాదు, 275 - రెండు సార్లు లెక్కపెట్టడం వల్లే కన్‌ఫ్యూజన్

Bhola Mania Song : వన్ అండ్ ఓన్లీ బిందాస్ భోళా, మెగాస్టార్ వస్తే స్విచ్ఛాన్ గోల - ఫస్ట్ సాంగ్ విన్నారా?

Bhola Mania Song : వన్ అండ్ ఓన్లీ  బిందాస్ భోళా, మెగాస్టార్ వస్తే స్విచ్ఛాన్ గోల - ఫస్ట్ సాంగ్ విన్నారా?

Telangana Rains: ఒక్కసారిగా మారిన వాతావరణం, హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో మోస్తరు వర్షం - 3 రోజులపాటు ఎల్లో అలర్ట్

Telangana Rains: ఒక్కసారిగా మారిన వాతావరణం, హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో మోస్తరు వర్షం - 3 రోజులపాటు ఎల్లో అలర్ట్