Married Women: భర్త ఆరోగ్యం, సంపద కోసం భార్య రోజూ చేయాల్సిన 4 పనులు ఏమిటో తెలుసా?
Married Women: పురుషుడి జీవితం, ఆరోగ్యం, సంపద అన్నీ అతని భార్య చేసే పనుల మీద ఆధారపడి ఉంటాయి. భర్త ఆర్థిక శ్రేయస్సు కోసం భార్య రోజూ ఎలాంటి పనులు చేయాలి?
Married Women: హిందూ ధర్మంలో వివాహానికి చాలా ప్రాముఖ్యత ఉంది. హైందవ సంస్కృతిలో వివాహం అత్యంత పవిత్రంగా పరిగణిస్తారు. వైవాహిక వ్యవస్థలో మహిళలకు ప్రత్యేక స్థానం ఇచ్చారు. వివాహిత స్త్రీని భర్త అర్ధాంగి అంటారు. పెళ్లయిన తర్వాత భార్య చేసే పని భర్త ఒక్కడినే కాకుండా మొత్తం కుటుంబాన్ని ప్రభావితం చేస్తుంది. కాబట్టి భార్య రోజూ మంచి పనులు చేయాలి. ఇది ఆమె భర్తతో పాటు మొత్తం కుటుంబానికి ఐశ్వర్యాన్ని తెస్తుంది. భార్య రోజూ చేయాల్సిన పనులు ఏమిటో తెలుసుకోండి.
1. తులసి పూజ
భార్య ఉదయాన్నే ఇల్లు శుభ్రం చేసి, తులసి పూజ చేసి, తులసి మొక్కకు నీళ్లు సమర్పించాలి. తులసి ఇంటిని కాపాడే పవిత్రమైన మొక్క. తెల్లవారుజామున ఈ మొక్కను పూజించి, నీళ్లు పోయడం ద్వారా, లక్ష్మీదేవి రూపమైన తులసి ఆమెకు, ఆమె కుటుంబానికి ఆనందంతో పాటు శ్రేయస్సును కలిగిస్తుంది.
Also Read : తులసి పూజలో ఈ నియమాలు పాటించండి లక్ష్మి కటాక్షిస్తుంది
2. ఈ వ్రతాన్ని పాటించండి
వివాహానంతరం స్త్రీలు ఏకాదశి, పౌర్ణమి రోజుల్లో ఉపవాసాలను పాటించాలి. ఈ రోజుల్లో భక్తిశ్రద్ధలతో ఆయా దేవతలను పూజించి ఉపవాసం ఉండాలి. దీంతో వారి వైవాహిక జీవితం మధురంగా మారుతుంది.
3. స్నానం తర్వాత ఇలా చేయండి
భార్య ఉదయాన్నే లేచి స్నానం చేసి ఇంటిని, పూజా మందిరాన్ని శుభ్రం చేయడమే కాకుండా ఇంట్లోని చెత్తాచెదారాన్ని తొలగించిన తర్వాత రాగి పాత్రలో నీటిని తీసుకుని ఆ నీటిని ఇల్లంతా చల్లాలి. దీంతో ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తి తొలగిపోయి సానుకూల శక్తులు స్థిరపడతాయి. ఇది ఇంట్లో చిన్న చిన్న ఆందోళనలను కూడా తొలగిస్తుంది. వివాహిత స్త్రీలు స్నానం చేయకుండా పూజ గది, వంటగదిలోకి ప్రవేశించకూడదని శాస్త్ర వచనం.
4. సంధ్యా సమయంలో ఇలా చేయాలి
వివాహమైన స్త్రీ సంధ్యా సమయంలో స్నానం చేయాలి లేదంటే ముఖం, చేతులు, కాళ్లు కడుక్కోవాలి. ఆ తర్వాత తులసి మొక్క ముందు, పూజ గదిలో, ఇంటి ప్రధాన ద్వారం దగ్గర దీపం వెలిగించాలి. ప్రతిరోజూ సాయంత్రం ఇంట్లో దీపం వెలిగించడం వల్ల ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. అలాంటి ఇంట్లో ఎప్పటికీ ధన, ధాన్య సమస్యలు తలెత్తవు.
Also Read : శివ పూజలో ఇవి వినియోగిస్తున్నారా? మీ పూజ ఫలించదు
రోజూ ఈ పనులు చేయడం వల్ల భార్య తన భర్తకు ఐశ్వర్యం, ఆరోగ్యం, సమాజంలో గౌరవంతో పాటు కుటుంబానికి ఆనందాన్ని కలిగిస్తుంది.
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.