Representational Image/Pexels
శివుని మించిన కరుణామయుడు ఈ జగాన లేడు. భక్తసులభుడుగా శివుని కొనియాడుతారు. అయితే శివపూజకు కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటించాలని పండితులు సూచిస్తున్నారు. శివపూజలో కొన్ని వస్తువులు మరచిపోయి కూడా వాడకూడదు. అవేమిటో తెలుసుకుందాం.
శివుడు చాలా త్వరగా ప్రసన్నుడవుతాడు. ఆయన అభిషేక ప్రియుడు. ఒక చెంబు నీటితో ఆయన కరుణ పొందవచ్చు. సోమవారాలు, మాసశివరాత్రుల్లో, శ్రావణ మాసంలో, ప్రతి రోజూ ప్రదోష వేళలో శివారాధన చెయ్యడం వల్ల సంకల్పాలు నెరవేరుతాయని శాస్త్రం చెబుతోంది. శివభక్తులకు ఉన్నంత స్వేచ్ఛ మరెవరి భక్తులకు ఉండదని చెప్పవచ్చు. ఎవరికి తోచిన రీతిలో వారు శివారాధన చేస్తారు.
శివారాధన కొన్ని ప్రత్యేక నియమాలను అనుసరించి చెయ్యడం వల్ల మరింత మంచి ఫలితాలను పొందవచ్చు. కొన్ని వస్తువులు శివుడికి సమర్పించేందుకు పనికి రావు. అలాంటి వస్తువులను శివారాధనలో వాడితే ఆయన కోపానికి గురి కావాల్సి రావచ్చు. ఆ వస్తువులు వాడినందు వల్ల ఆపూజ ఫలించదని అది సంపూర్ణం అయినట్టు కాదని వేదాలలో చెప్పబడిందని పండితులు వివరిస్తున్నారు.
శివలింగం మీద తులసీదళాలను సమర్పించకూడదు. తులసి శ్రీమహా విష్ణువు, హనుమంతుడు, శ్రీ కృష్ణుడికి ప్రీతికరమైనవి. వీరికి చేసే పూజ తులసి లేకుండా సంపూర్ణం కాదు. కానీ శివ పూజకు తులసిని ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదు. తులసిని నైవేద్యంగా అందిస్తే శివాగ్రహానికి గురికావల్సి ఉంటుందని శాస్త్రం చెబుతోంది. శివ పురాణం ప్రకారం తులసీ దేవి భర్త అసురుడు జలంధరుడిని శివుడే సంహరించాడని అందువల్లే శివుడికి తులసీదళాలు సమర్పించకూడదు.
శివుడు అభిషేక ప్రియుడని ప్రతీతి. అయితే శివాభిషేకానికి శంఖం ఉపయోగించకూడదు. అసురుడు శంఖచుడిని సంహరించినది శివుడే. శంఖచుడు అనే రాక్షసుడు లోకకంటకుడిగా ఉన్నపుడు ఆయన ఈ సంహారాన్ని చేశాడు. కనుక శంఖాన్ని ఉపయోగించి చేసే అభిషేకం ఫలితాన్ని ఇవ్వదు.
శివ పూజకు కొబ్బరి నీళ్లు ఎప్పుడూ ఉపయోగించకూడదు. పూర్తి కొబ్బరి కాయను సమర్పించవచ్చు. కానీ పొరపాటున కూడా అభిషేకంలో కొబ్బరి నీళ్లు వాడకూడదు.
శివపూజలో ఎరుపు రంగు పూవ్వులు ఉపయోగించకూడదు. కేతకి, చంపా వంటి సువాసన కలిగిన పువ్వులను కూడా శివపూజకు వాడకూడదు. తెలిసి చేసినా తెలియక చేసినా శివపూజకు ఈ పువ్వులు వాడినపుడు పూజకు తగిన ఫలితం దొరకదు.
శివ పూజలో కుంకుమ, సింధూరం ఉపయోగించకూడదు. శివుడు ఏకాంతంగా గడిపే దేవుడు. ఏకాంతంగా గడిపే వారు నుదుటన బూడిదను ధరిస్తారు. కుంకుమ ధరించకూడదు. శివుడు విభూతి ధరించేందుకు ఇష్టపడతాడు. అందుకే శివుడికి కుంకుమ సమర్పించకూడదు. కానీ పార్వతి దేవి పూజలో కుంకుమ వాడుతారు.
బిల్వ పత్రాలు శివుడికి చాలా ఇష్టమైన పత్రాలు. శివపూజలో వీటిని విరివిగా వాడుతారు. అయితే శివపూజకు సేకరించే బిల్వపత్రాలు ఆరోగ్యంగా శుభ్రంగా నిగనిగలాడుతూ ఉండేవి మాత్రమే వాడాలి. చిరిగిపోయినవి, పురుగు తినేసిన బిల్వ పత్రాలను శివారాధనకు వాడితే పూజ ఫలితాన్ని ఇవ్వదు.
ఆ చిన్న చిన్న జాగ్రత్తలు పాటించడం వల్ల శివారాధన సంపూర్ణం అవుతుంది. సంకల్పం నెరవేరుతుంది.
Also Read: చాణక్య నీతి: జీవితంలో అన్ని సమస్యలకు మూలం ఇదే - దీనిని అదుపు చేస్తే ఆనందం మీ సొంతం
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ఏబీపీ దేశం ఎలాంటి భాధ్యత తీసుకోవదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి విరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.
చేతిలో డబ్బు నిలవడం లేదా? మట్టి కలశంతో ఇలా చేసి చూడండి
Dreams Meaning: మీకు ఇలాంటి కలలు వస్తున్నాయా? త్వరలో మీకు పెళ్లికాబోతుందని అర్థం!
జూన్ 2023 రాశి ఫలాలు: జూన్ నెలలో ఈ రాశులవారికి ఎదురులేదు, ఆ రెండు రాశులపై కుజుడి ప్రభావం
జూన్ 1 రాశిఫలాలు, ఈ రాశులవారిపై ఈ రోజు లక్ష్మీదేవి కరుణాకటాక్షాలుంటాయి!
Eruvaka Pournami 2023: ఏరువాక పున్నమి ఎప్పుడొచ్చింది, ప్రత్యేకత ఏంటి!
Telangana New Party : తెలంగాణలో కొత్త పార్టీ ఖాయమా ? బీఆర్ఎస్ ను ఓడించడానికా ? గెలవడానికా ?
కేశినేని నానీ, ఏందయ్యా నీ బిల్డప్, సోది ఆపు: పీవీపీ
Rahul US Visit: హలో మిస్టర్ మోడీ, ఫోన్ ట్యాపింగ్ గురించి ప్రస్తావిస్తూ రాహుల్ కౌంటర్
Welcome Banners Minister KTR: విదేశీ పర్యటన ముగించుకొని హైదరాబాద్ వస్తున్న కేటీఆర్- ఓఆర్ఆర్ పై వెలసిన స్వాగత బ్యానర్లు