చాణక్య నీతి: జీవితంలో అన్ని సమస్యలకు మూలం ఇదే - దీనిని అదుపు చేస్తే ఆనందం మీ సొంతం
చాలా సమస్యలకు మూలం మనకు తెలిసీ తెలియక అలవరుచుకున్న అలవాట్లే. వీటిని మనం అదుపు చెయ్యగలిగితే ఎలాంటి సంక్షోభ స్థితినైనా విజయవంతంగా ఎదుర్కోగలుగుతాము.
చాణక్యుడు మానవ జీవిత బాధలకు మూలాల గురించి విస్తృత చర్చ చేశాడు. శాతాబ్దాల క్రితం చెప్పిన విషయాలైనా సరే ఇప్పటికీ అవి ఆచరణీయాలే సమస్య మూలం తెలస్తే దాని మీద అదుపు ఎలాగో తెలిస్తే ద్వారా విజయం సాధించడం సులువవుతుంది. చాలా వరకు సమస్య ఎక్కడుంది? ఏ విషయం వల్ల లేదా ఎందుకు మనకు పదేపదే సమస్యలు వస్తున్నాయనే క్లారిటి లేకపోవడం వల్ల సమస్యల పరిష్కారం దుర్లభం అవుతుంది. సమస్యకు మూలం కనుగొంటే వాటిని అధిగమించడం సులభమవుతుంది. ఆచార్య చాణక్యుడు సమస్యల మూలాల గురించి చర్చించాడు. అవేమిటో తెలుసుకుంటే సమస్యలను సులభంగా అధిగమించవచ్చు.
మనం చేసుకున్న కర్మల ఆధారంగానే మన సుఖదు:ఖాలు ఆధారపడి ఉంటాయనేది నిర్వివాదాంశం. మన అలవాట్లు, మానసిక స్థితి మన జీవితవిధానాన్ని నిర్ధారిస్తాయి. చాణక్య నీతి 13వ అధ్యాయం 15వ శ్లోకంలో అలవాట్ల గురించి ప్రస్తావించాడు. కొన్ని అలవాట్లు చక్కగా సాగుతున్న పనులను సైతం చెడగొడుతాయి. చాలా సమస్యలకు మూలం మనకు తెలిసీ తెలియక అలవరుచుకున్న అలవాట్లే. వీటిని మనం అదుపు చెయ్యగలిగితే ఎలాంటి సంక్షోభ స్థితినైనా విజయవంతంగా ఎదుర్కోగలుగుతాము. లేదంటే ఈ అలవాట్లు మన మీద పైచేయి సాధించి మనకు విజయాన్ని దూరం చేస్తాయి. అలవాట్లను ఎలా జయించాలో చాణక్యుడు చెప్పిన విషయాలను తెలుసుకుందాం.
అనవస్థికాయస్య నజానే నవనే సుఖం
జానే దహతి సంఘద్వాన్ సగ్వివర్ణనాత్
ఈ శ్లోకంలో ఆచార్య చాణక్యుడు మనసే మన సమస్యలకు మూలకారణం అని వివరిస్తున్నాడు. మనసు అదుపులో లేకుంటే అతడు ఎప్పుడూ సంతోషంగా, సంతృప్తిగా ఉండలేడు. జీవితంలో అన్ని సౌఖ్యాలు, సౌకర్యాలు అందుబాటులో ఉన్నా కూడా మన: చాంచల్యం సంతోషం లేకుండా చేస్తుంది. మనసు మీద అదుపు లేని వారైతే ఎలాంటి పనిలో ఉన్నా అది చెడిపోతుంది. మనసును అదుపులో ఉంచుకునే శక్తిలేని వ్యక్తులు ఒంటరిగా ఉన్న సమూహంలో ఉన్నా ఎలా ఉన్నా ఎలాంటి స్థితిలో ఉన్న సంతోషంగా జీవించలేరు.
వీరికి సుఖం ఉండదు
భావోద్వేగాల మీద అదుపు లేని వారి వల్ల వారికీ సుఖం ఉండదు. వారితో ఉండే వారికి సుఖం ఉండదు. అతడి సాంగత్యం చాలా బాధ కలిగించేదిగా ఉంటుంది. అసూయతో రగిలిపోయే వాడు ఇతరుల విజయాన్ని చూసి ఈర్ష్య పడతాడు. అందువల్ల అతడు ఎప్పటికీ సంతోషంగా ఉండలేడు. మానసికంగా ఒంటరితనం ఎప్పుడూ వారిని వేధిస్తుంటుంది. ఎంత మందిలో ఉన్నప్పటికీ లోపల ఉండే ఒంటరితనం వీరిని దహించి వేస్తుంది. ప్రపంచమంతా తనకు వ్యతిరేకంగా ఉన్నారనే భావనలో ఉంటుంటారు. వీరి వల్ల ఎవరికీ సంతోషం ఉండదు.
లక్ష్యా సాధనకు ఇలా చెయ్యాలి
మోసపూరిత ఆలోచనలు, మాటల గారడి చేసి మనుషులను మభ్యపెట్టి పబ్బం గడుపుకోవాలనుకునే వారికి లక్ష్మీ కటాక్షం అసలు లభించదు. లక్ష్యసాధనలో వెనుకబడి పోతాడు. లక్ష్య సాధనకు మంచి సాంగత్యం, క్రమశిక్షణ, ఉన్న దానిలో ఆనందంగా ఉండాలనే ఆలోచనతోపాటు జీవితంలో ముందుకు సాగాలన్నఉత్సుకత ఉండాలి. ఇలాంటి ధోరణిలో జీవితం గడిపే వరు డబ్బు సంపాదించడం మాత్రమే కాదు, సమాజంలో కీర్తి ప్రతిష్టలు కూడా సాధిస్తారు.
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ఏబీపీ దేశం ఎలాంటి భాధ్యత తీసుకోవదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి విరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.