అన్వేషించండి

Purpose Of Life: మనిషి జీవితం ఓ ప్రయాణం అయితే గమ్యస్థానం ఏంటి?

మనిషి జీవితానికి గమ్యస్థానం ఏంటి? ఈ ప్రశ్నకు సమాధానం ఆ వ్యక్తి మీద, తన అనుభవాల మీద, విశ్వాసాల మీద ఆధారపడి ఉంటాయి. ఈ ప్రశ్నకు ఆధ్యాత్మికవేత్తలు ఏం చెబుతారంటే..

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • మనిషి భౌతిక ఆకర్షణలకు లొంగి మోక్షం మర్చిపోతాడు.
  • అహంకారం వీడితేనే భగవంతుని శరణు లభించి రక్షిస్తాడు.
  • మోక్షం, సంపూర్ణ సామర్థ్యం, జీవిత ప్రయాణం గమ్యంగా వర్ణించబడింది.

మనిషి జీవితానికి గమ్యస్థానం ఏంటనేది వివరిస్తూ ఆధ్యాత్మికవేత్తలు ఓ కథ చెబుతారు.  

ఓ కుక్క కాశికి వెళ్దామని బయలు దేరింది...మార్గ మధ్యలో ఎముక కనపడింది. కాశికి వెళ్లాలన్న ఆలోచన మర్చిపోయి ఆ ఎముక తినడం మొదలుపెట్టింది.

ఇలాగే..

జీవుడు కూడా తల్లి గర్భంలో ఉన్నప్పుడు..ఈ బాధను భరించలేను తిరిగి దేవుడి వద్దకు చేరాలని నిర్ణయించుకుంటాడు. తన లక్ష్యం అదే అని ఎందుకుంటాడు. కానీ భూమ్మీదపడిన తర్వాత అసలు లక్ష్యాన్ని మర్చిపోతాడు. సంతోషం, బాధ, జననం, మరణం అనే చట్రంలోనే ఉండిపోతున్నాడు. ఇలా ప్రతి జన్మలోనూ అనుకుంటాడు..మళ్లీ మళ్లీ జన్మిస్తుంటాడు..కానీ మోక్షం వైపు అడుగువేయడు. అతికొద్దిమందిమాత్రమే దైవాన్ని చేరుకుంటారు.

మరో కథ.

ఓ ఆవు అడవికి మేతకు వెళ్లింది. చీకటి పడే వరకూ ఉండిపోయింది. తిరిగి ఇంటికి బయలుదేరే సమయంలో పులికంటపడింది. తప్పించుకునేందుకు అటు ఇటు పరుగులుతీసింది ఆవు. పులి కూడా అంతే వేగంగా వెంబడించింది. ఆవుకు ఎదురుగా ఉన్న చెరువు కనిపించింది. పులి నుంచి తప్పించుకునేందుకు ఆ చెరువులో దూకేసింది. పులి కూడా ఆవును పట్టుకునేందుకు చెరువులో దూకేసింది. ఆవు ఈదుకుంటూ చెరువు మధ్యలోకి వెళ్లిపోయింది. అక్కడ ఊబి ఉండడంతో పీకలవరకూ కూరుకుపోయింది. పులి కూడా ఆవు వెనుకే వెళ్లి.. పరిస్థితి గమనించి కొద్ది దూరంలోనే ఆగిపోయింది. ఒకదానికి ఒకటి ఎదురుగా కొద్దిదూరంలో కదల్లేని స్థితిలో నిలబడిపోయాయి. 

కొద్ది సేపటి తర్వాత ఆవు..పులితో ఇలా అంది..

ఆవు-  నీకెవరైనా యజమాని, గురువు ఉన్నారా?
 
పులి - నేనే ఆ అడవికి రాజును..నాకు వేరే యజమానులు ఎవరుంటారు?
 
ఆవు - నీ గొప్పదనం, నీ శక్తి ఇప్పుడు నిన్ను ఈ స్థితి నుంచి రక్షించలకేపోయాయి
 
పులి - నీ పరిస్థితి కూడా నాలాంటిదే కదా..నువ్వు కూడా పీకల్లోతు మునిగిపోయి ఉన్నావు..మరి నిన్ను ఎవరు రక్షిస్తారు అని..
 
ఆవు - నీ ఆలోచన తప్పు..నాకు యజమాని ఉన్నాడు..సాయంత్రం అయ్యేసరికి ఇంటికి చేరుకోకుంటే నన్ను వెతుక్కుంటూ ఎంతదూరమైనా వస్తాడు. ఈ బురదనుంచి ఎంత కష్టమైనా బయటకు లాగి..ఇంటికి తీసుకెళ్తాడు.

కొద్దిసేపటికి నిజంగానే ఆవు యజమాని రానే వచ్చాడు. అతి కష్టంమీద ఆ బురద గుమ్మి నుంచి బయటకు లాక్కొచ్చాడు. ఇంటికి వెళ్లేటప్పుడు ఆ ఆవు..తన యజమాని వైపు ఎంతో కృతజ్ఞతా పూర్వకంగా చూసింది. 

వాస్తవానికి ఆ పులిని కూడా ఆ యజమాని బయటకు తీయగలడు..కానీ.. పులిని కాపాడితే తమ ప్రాణాలకు ముప్పు అని భావించి అక్కడే వదిలేసి వెళ్లిపోయారు.  

ఇక్కడ ఆవు - పులి అంటే జంతువులు కాదు...

ఆధ్యాత్మిక దృక్పథంలో...

ఆవు అంటే భగవంతుడికి సమర్పించిన సాధకుడి హృదయం

పులి అంటే అహంకారంతో నిండిన మనసు

ఆ యజమాని పరమాత్మ...

ఆ బుదరగుంట ఈ ప్రపంచం

ఆవు-పులి మధ్య జరిగిన చర్చ..నలుగురిలో మన ఉనికిని చాటుకునేందుకు చేసే పోరాటం

నేను లేకపోతే ఏదీ లేదు అనుకోవడం భ్రమ..నాకు ఎవరి అవసరం రాదు అనుకోవడం అనే భావన ఎప్పుడూ కలగకూడదు.దీన్నే అహంకారం అంటారు. మీ పని మీరు చేసుకోండి..నలుగురి మంచి కోరుకోండి. అప్పుడు మీరు ఏ పరిస్థితుల్లో, ఎక్కడున్నా...భగవంతుడు స్వయంగా వచ్చి మిమ్మల్ని మోక్షం వైపు నడిపిస్తాడు..
 
ఆధ్యాత్మిక దృక్పథంలో - జనన మరణ చక్రం నుంచి ముక్తి పొందడమే ఈ జీవితానికి గమ్యస్థానం

తత్వశాస్త్ర దృక్పథంలో - పూర్తి సామర్థ్యాన్ని వ్యక్తంచేసి సంతోషంగా సార్థకంగా జీవించడం

ఆధునిక దృక్పథంలో - జీవితానికి స్థిరమైన గమ్యం లేదు..ఇదో ప్రయాణం

బాధలో, కష్టంలో ఉన్నప్పుడు 'భగవద్గీత' ఎందుకు చదవమంటారు!

గమనిక: ఆధ్యాత్మికవేత్తలు సూచించిన వివరాలు, ఆధ్యాత్మిక గ్రంధాల్లో పొందుపరిచిన సమాచారం ఆధారంగా అందించిన కథనం ఇది. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.  దీనిని అనుసరించేముందు మీరు విశ్వశించే పండితుల సలహాలు స్వీకరించగలరు. 


 

Frequently Asked Questions

మనిషి జీవితానికి ఆధ్యాత్మిక గమ్యం ఏమిటి?

ఆధ్యాత్మిక దృక్పథంలో, జనన మరణ చక్రం నుండి ముక్తి పొందడమే (మోక్షం) మనిషి జీవితానికి గమ్యం. భూమిపైకి వచ్చిన తర్వాత చాలామంది తమ అసలు లక్ష్యాన్ని మర్చిపోతారు.

ఆవు, పులి కథలోని ఆధ్యాత్మిక అర్థం ఏమిటి?

ఆవు భగవంతుడికి సమర్పించిన సాధకుడి హృదయాన్ని సూచిస్తుంది. పులి అహంకారంతో నిండిన మనసును సూచిస్తుంది. ఆ యజమాని పరమాత్మగా పరిగణించబడతాడు.

జీవిత గమ్యం గురించి భిన్న దృక్పథాలు ఏమిటి?

ఆధ్యాత్మికంగా మోక్షం గమ్యం. తత్వశాస్త్రం పూర్తి సామర్థ్యాన్ని, సార్థక జీవనాన్ని నొక్కి చెబుతుంది. ఆధునిక దృక్పథంలో, జీవితం స్థిరమైన గమ్యం లేని ప్రయాణం.

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

03-08-2026 సోమవారం మీ రాశిఫలాలు!
03-08-2026 సోమవారం మీ రాశిఫలాలు!
మీన రాశి ఆగస్టు 2-8 వారఫలాలు: ప్రేమ, కెరీర్, ఆర్థిక విజయాలు మీ సొంతం!
మీన రాశి ఆగస్టు 2-8 వారఫలాలు: ప్రేమ, కెరీర్, ఆర్థిక విజయాలు మీ సొంతం!
కుంభ రాశి ఆగస్టు 2-8 వారఫలాలు: అద్భుత అవకాశాలు, ఆర్థిక వృద్ధి
కుంభ రాశి ఆగస్టు 2-8 వారఫలాలు: అద్భుత అవకాశాలు, ఆర్థిక వృద్ధి
మకర రాశి: ఆగస్టు 2-8 వారం - మీ జీవితంలో స్థిరత్వం, ఎదుగుదలకు ఇదే సమయం!
మకర రాశి: ఆగస్టు 2-8 వారం - మీ జీవితంలో స్థిరత్వం, ఎదుగుదలకు ఇదే సమయం!
Advertisement

వీడియోలు

Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్
Hardik Pandya Trade to CSK IPL 2027 | రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన ముంబై ఇండియన్స్
Zaheer Abbas About Rohit Sharma & Virat | రో, కోపై పాక్ లెజెండ్ సంచలన వ్యాఖ్యలు
Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MLC Teenmar Mallanna: తెలంగాణ ఏమైనా రెడ్ల అయ్య జాగీరా.. చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
తెలంగాణ ఏమైనా రెడ్ల అయ్య జాగీరా.. చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
498A IPC to Live In Relationships: సుప్రీంకోర్టు సంచలన తీర్పు - లైవ్-ఇన్ భాగస్వాములకూ సెక్షన్ 498A వర్తింపు!
సుప్రీంకోర్టు సంచలన తీర్పు - లైవ్-ఇన్ భాగస్వాములకూ సెక్షన్ 498A వర్తింపు!
Telangana Constable: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్‌ కుటుంబానికి కోటి బీమా చెక్కు అందజేసిన తెలంగాణ డీజీపీ
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్‌ కుటుంబానికి కోటి బీమా చెక్కు అందజేసిన తెలంగాణ డీజీపీ
Spider Man Collections : ఇండియాలో సూపర్ 'స్పైడర్' మ్యాన్ - ఫస్ట్ వీకెండ్ రికార్డ్ కలెక్షన్స్
ఇండియాలో సూపర్ 'స్పైడర్' మ్యాన్ - ఫస్ట్ వీకెండ్ రికార్డ్ కలెక్షన్స్
Rains In AP, Telangana: ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్- 50 కి.మీ వేగంతో గాలులు
ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్- 50 కి.మీ వేగంతో గాలులు
Netanna Sevalo Scheme: ఏపీలో నేతన్న సేవలో పథకం దరఖాస్తు గడువు పెంపు, ఈ 7 నుంచి ఖాతాల్లో 25 వేలు జమ
ఏపీలో నేతన్న సేవలో పథకం దరఖాస్తు గడువు పెంపు, ఈ 7 నుంచి ఖాతాల్లో 25 వేలు జమ
Rangam 2026: సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!.. కుంభవర్షాలు ప్రకృతి విపత్తులు తప్పవా?
సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!
Varanasi : వారణాసి To అంటార్కిటికా - కథ కోసం నాలుగన్నరేళ్లు... రాజమౌళి చెప్పిన గ్లోబ్ ట్రాటింగ్ జర్నీ విశేషాలివే!
వారణాసి To అంటార్కిటికా - కథ కోసం నాలుగన్నరేళ్లు... రాజమౌళి చెప్పిన గ్లోబ్ ట్రాటింగ్ జర్నీ విశేషాలివే!
Embed widget