అన్వేషించండి

Uttarayan Punyakalam 2026: మకర సంక్రాంతి రోజున ఈ పని చేస్తే దారిద్ర్యం దూరం! ఉత్తరాయణం విశిష్టత తెలుసుకోండి!

Makar Sankranti 2026 : మకర సంక్రాంతి నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. ఉత్తరాయణం విశిష్టత ఏంటి? ఈ రోజు పాటించాల్సిన నియమాలేంటి?

Uttarayana Punyakalam 2026:  2026 సంవత్సరంలో జనవరి 15 శుక్రవారం సంక్రాంతి వచ్చింది. ఈ రోజు నుంచి ఉత్తరాయణం ప్రారంభమవుతుంది. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పటి నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుంది. 2026 జనవరి 14 రాత్రి 8 గంటల 43 నిముషాలకు మకర రాశిలోకి అడుగుపెడతాడు. జనవరి 15 సూర్యోదయానికి ఉత్తరాయణం సందర్భంగా మకర సంక్రాంతి జరుపుకుంటారు.

'సరతి చరతీతి సూర్యః' సంచరించేవాడు అని దీని అర్థం 

సూర్యభగవానుడి సంచారం 2 విధాలుగా ఉంటుంది. మానవులకు ఏడాది కాలం అంటే దేవతలకు ఓ రోజుతో సమానం. అంటే మనకు సంవత్సరం అంటే దేవతలకు 6 నెలలు పగలు, 6 నెలలు రాత్రితో సమానం. మనం పగలు దేవతలకు ఉత్తరాయణం, మన రాత్రి దేవతలకు దక్షిణాయనం. 

'ఆయనే దక్షిణే రాత్రిః ఉత్తరేతు దివా భవేత'  

సంక్రమణం అంటే?
 
సంక్రమణం అంటే మారడం, చేరడం అని అర్థం. సూర్యుడు మేషం నుంచి 12 రాశులల్లో మారుతూ పూర్వరాశి నుంచి ఉత్తర రాశిలోకి అడుగుపెట్టడమే సంక్రమణం. ఏ రాశిలో అడుగుపెడితే ఆ సంక్రాంతి వస్తుంది. మకరంలోకి వచ్చినప్పుడు మకర సంక్రాంతి అవుతుంది. ఈ రోజు ఎవరైతే సూర్యభగవానుడు ఉదయించేలోగా నిద్రలేచి స్నానమాచరించి సూర్యుడికి నమస్కరిస్తారో వారి దారిద్ర్యం తొలగిపోతుంది. అనారోగ్య సమస్యలు తీరిపోతాయి
 
ఉత్తరాయణం పుణ్యకాలం అని ఎందుకంటారు?
 
ఉత్తరాయణం పుణ్యకాలం అని పిలిస్తే..మరి దక్షిణాయనం పాపకాలం అవుతుందా అనే సందేహం రావొచ్చు. కానేకాదు..దక్షిణాయనం కూడా పుణ్యకాలమే అయితే ఉత్తరాయణం దేవతలకు పగటి సమయం కావున ఈ సమయం వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. పుణ్యక్షేత్రాల సందర్శనకు అనువైన సమయం. తీర్థయాత్రలు చేసేవారంతా బయలుదేరేది ఈ సమయంలోనే. ఇక దక్షిణాయనం అంటే దేవతలకు రాత్రి కాలం.. వాతావరణంలో చాలా మార్పులుంటాయి. ఈ సమయంలో పితృదేవతల స్మరణ ద్వారా కుటుంబానికి మంచి జరుగుతుంది. 
 
వేదాల్లోనూ నార్త్ కే ప్రయార్టీ ఎక్కువ
 
దక్షిణ దిక్కుకి అధిపతి యముడు అయితే ఉత్తరానికి అధిపతి కుబేరుడు. అందుకే దక్షిణం కన్నా ఉత్తర దిక్కుని పవిత్రమైనదిగా భావిస్తారు. వేదాల జననం కూడా ఉత్తర భూముల్లోనే జరిగింది.  హైందవ సంస్కృతి , జ్ఞాన విజ్ఞానం , భాష , నాగరికత అంతా ఉత్తరాది నుంచి దక్షిణాదికి వచ్చింది. సమస్తభాషలకు అమ్మ అయిన సంస్కృతం ఉత్తరాదిన పుట్టింది. సమస్త రుషులు, దేవతలు, పండితులకు ఉత్తర భూములే నివాస స్థలాలు కావడంతో పాటూ..సూర్యుడు ఉత్తరంవైపు చలనం చేయడం కూడా ఇది పుణ్యకాలంగా భావిస్తారు
 
దేవతలు ఉత్తరాయణంలో నిద్రలేచే సమయం..ఈ సమయంలో భక్తిపూర్వకంగా ఏం కోరుకున్నా నెరవేరుతుందని చెబుతారు. ఆ ఉద్దేశంతోనే ఉత్తరాయణం ప్రారంభం అవగానే వచ్చిన సంక్రాంతిని పెద్దపండుగగా జరుపుకుంటున్నారు. మకర సంక్రాంతి రోజున పితృ తర్పణాలు విడిస్తే వారికి ఉత్తమ గతులు ప్రాప్తిస్తాయని నమ్మకం

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం కేవలం నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. ABPదేశం ఎలాంటి నమ్మకాలను, సమాచారాన్ని ధృవీకరించదని ఇక్కడ చెప్పడం ముఖ్యం. ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని అమలు చేయడానికి ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.

Happy Bhogi 2026: భోగి శుభాకాంక్షలు మీ బంధుమిత్రులకు ఈ కోట్స్ తో చెప్పండి!

Makar Sankranti 2026 Wishes: మకర సంక్రాంతి శుభాకాంక్షలు 2026.. ఫ్రెండ్స్, ఫ్యామిలీకి ఈ శ్లోకాల ద్వారా తెలియజేయండి!

 

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More

టాప్ హెడ్ లైన్స్

నాగ పంచమి 2026: సకల దోషాలు తొలగి, శుభాలు కలిగే పూజా విధానం, మంత్రాలు!
నాగ పంచమి 2026: సకల దోషాలు తొలగి, శుభాలు కలిగే పూజా విధానం, మంత్రాలు!
మిథున రాశి ఆగస్టు 16-22 వారఫలం
మిథున రాశి ఆగస్టు 16-22 వారఫలం
వృషభ రాశి ఆగస్టు 16-22 వారఫలం: కెరీర్, ప్రేమలో అద్భుత ప్రగతి!
వృషభ రాశి ఆగస్టు 16-22 వారఫలం: కెరీర్, ప్రేమలో అద్భుత ప్రగతి!
జెన్ Z...సోషల్ మీడియా లైక్‌, షేర్ అనే ఉచ్చులో చిక్కుకున్నారా? బయటపడాలంటే ఇది తెలుసుకోండి!
జెన్ Z...సోషల్ మీడియా లైక్‌, షేర్ అనే ఉచ్చులో చిక్కుకున్నారా? బయటపడాలంటే ఇది తెలుసుకోండి!

వీడియోలు

Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Revanth Reddy:
"చేతబడి తిరగబడింది, అష్టదిగ్బంధమయ్యారు" బీఆర్‌ఎస్ నేతలపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు 
Vadala OTT : ఓటీటీలో జగపతి బాబు సైకలాజికల్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్ - ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలో జగపతి బాబు సైకలాజికల్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్ - ఎందులో చూడొచ్చంటే?
AP Group 1 SIT Report: డీఎస్సీపై ఉద్యమం - గ్రూప్ 1లో భారీ అక్రమాలు వెలుగులోకి - వైఎస్ఆర్సీపీకి కాలం కలసి రావట్లేదా?
డీఎస్సీపై ఉద్యమం - గ్రూప్ 1లో భారీ అక్రమాలు వెలుగులోకి - వైఎస్ఆర్సీపీకి కాలం కలసి రావట్లేదా?
జెన్ Z...సోషల్ మీడియా లైక్‌, షేర్ అనే ఉచ్చులో చిక్కుకున్నారా? బయటపడాలంటే ఇది తెలుసుకోండి!
జెన్ Z...సోషల్ మీడియా లైక్‌, షేర్ అనే ఉచ్చులో చిక్కుకున్నారా? బయటపడాలంటే ఇది తెలుసుకోండి!
Friday OTT Movies : ఓటీటీలో ఒక్క రోజే 14 సినిమాలు - ఫ్రైడే ఓటీటీ మూవీస్ లిస్ట్... ఈ సినిమాలు డోంట్ మిస్
ఓటీటీలో ఒక్క రోజే 14 సినిమాలు - ఫ్రైడే ఓటీటీ మూవీస్ లిస్ట్... ఈ సినిమాలు డోంట్ మిస్
Independence Day Speech : స్వాతంత్య్ర దినోత్సవ 2026 ప్రసంగం.. స్కూల్ స్పీచ్ పోటీలో గెలవాలంటే ఈ టిప్స్ పాటించండి
స్వాతంత్య్ర దినోత్సవ 2026 ప్రసంగం.. స్కూల్ స్పీచ్ పోటీలో గెలవాలంటే ఈ టిప్స్ పాటించండి
Embed widget