అన్వేషించండి

Khairatabad Ganesh 2022: ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకున్నారా, మరి ఈ ప్రత్యేకతలు గమనించారా!

ఒక్క అడుగు నుంచి మొదలై 60 అడుగులకు చేరిన ఖైరతాబాద్ గణేషుడు మళ్లీ ఒక్కో అడుగూ తగ్గుతూ 50 అడుగులకు చేరాడు. మరి ఈ ఏడాది కొలువుతీరిన గణపయ్యని దర్శించకునేముందు స్వామివారి ప్రత్యేకతలేంటో తెలుసుకున్నారా...

Khairatabad Ganesh 2022: శ్రీ పంచముఖ మహాలక్ష్మీ గణపతిగా భక్తులకు దర్శనమిస్తున్న ఖైరతాబాద్ వినాయకుడి ప్రత్యేకతలు చాలా ఉన్నాయి. 1954లో ఒక్క అడుగుతో మొదలైన ఖైరతాబాద్ గణపయ్య...2014లో 60 అడుగులకు చేరుకున్నాక షష్టి పూర్తి ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. ఆ తర్వాత ఒక్కో అడుగు తగ్గుతూ వస్తోంది. ప్రస్తుతం మండపంల కొలువుతీరిన లంబోదరుడి విగ్రహం 50 అడుగులు. పూర్తిగా మట్టితో రూపొందించారు. పంచముఖ లక్ష్మీగణపతిగా దర్శనమిస్తోన్న స్వామివారికి కుడివైపున మయూర వాహనంపై  కుమారస్వామి, ఎడమ వైపు గాయత్రీదేవి కొలువుతీరారు. 

ఈసారి ఎన్నో ప్రత్యేకతలు

  • సుప్రీం కోర్టు ఆదేశాలు, తెలంగాణ ప్రభుత్వ సూచనలతో 68 ఏళ్లలో తొలిసారిగా పూర్తిగా మట్టితో తయారుచేశారు
  • జూన్ 10 నుంచి ప్రారంభమైన విగ్రహ నిర్మాణపనులు
  • 150 మంది కళాకారులు అహర్నిశలు పనిచేయడంతో తుదిరూపు వచ్చేందుకు 80 రోజులు పట్టింది
  • విగ్రహ తయారీకి 35 టన్నుల మట్టి వినియోగం
  • మహాగణపతిని పాదాలకు సమీపం నుంచి నమస్కరించే అవకాశం లేకపోవడంతో ప్రత్యేకంగా పాదాలకు నమస్కరించే విధంగా పాదముద్రికలు అందుబాటులో ఉంచారు( ఇందుకోసం అయిన ఖర్చు కోటిన్నర రూపాయలు అన్న నిర్వాహకులు)
  • గతంలో లడ్డు కోసం తొక్కిసలాట జరగడంతో ఈసారి బొమ్మ లడ్డూ మాత్రమే గణపతి వద్ద ఉంచారు
  • ఈ నెల 9న హుస్సేన్ సాగర్‌లో విగ్రహ నిమజ్జనం
  • స్థానిక  పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన 55 అడుగుల యజ్ఞోపవీతం, 50 అడుగుల కండువా సమర్పించారు

Also Read:  ఈ రాశులవారికి శాంతి, ఆ రాశులవారికి అశాంతి- సెప్టెంబరు నెల రాశిఫలాలు!

శ్రీ లక్ష్మీ గణపతి స్తోత్రం
ఓం నమో విఘ్నరాజాయ సర్వసౌఖ్య ప్రదాయినే !
దుష్టదారిద్ర్య వినాశాయ పరాయ పరమాత్మనే !!
లంబోదరం మహావీర్యం నాగయజ్ఞోప శోభితమ్ !
అర్థచన్ద్రధరం దేవం విఘ్న వ్యూహ వినాశనమ్ !!
ఓం హ్రాం హ్రీం హ్రూం హ్రైం హ్రోం హ్రః హేరంబాయ నమో నమః
సర్వసిద్ధి ప్రదో సిత్వం సిద్ధి బుద్ధి ప్రదోభవః
చిన్తితార్థ ప్రదస్త్వం సతతం మోదక ప్రియః
సిన్దూరారుణ వస్త్రైశ్చ పూజితో వరదాయకః
ఇదం గణపతి స్తోత్రం యః పఠేత్ భక్తిమాన్ నరః
తస్యదేహంచ గేహంచ స్వయం లక్ష్మీర్న ముచ్యతి !!
శ్రీ లక్ష్మీ గణపతి స్తోత్రం సంపూర్ణం

శ్రీ గణేశ పంచరత్నం 
ముదా కరాత్త మోదకం సదా విముక్తి సాధకం
కళాధరావతంసకం విలాసిలోకరక్షకమ్ |
అనాయకైకనాయకం వినాశితేభదైత్యకం
నతాశుభాశునాశకం నమామి తం వినాయకమ్ || 

నతేతరాతిభీకరం నవోదితార్కభాస్వరం
నమత్సురారినిర్జరం నతాధికాపదుద్ధరమ్ |
సురేశ్వరం నిధీశ్వరం గజేశ్వరం గణేశ్వరం
మహేశ్వరం తమాశ్రయే పరాత్పరం నిరంతరమ్ || 

సమస్తలోకశంకరం నిరస్తదైత్యకుంజరం
దరేతరోదరం వరం వరేభవక్త్రమక్షరమ్ |
కృపాకరం క్షమాకరం ముదాకరం యశస్కరం
మనస్కరం నమస్కృతాం నమస్కరోమి భాస్వరమ్ || 

అకించనార్తిమార్జనం చిరంతనోక్తిభాజనం
పురారిపూర్వనందనం సురారిగర్వచర్వణమ్ |
ప్రపంచనాశభీషణం ధనంజయాదిభూషణం
కపోలదానవారణం భజే పురాణవారణమ్ ||

నితాంతకాంతదంతకాంతిమంతకాంతకాత్మజం
అచింత్యరూపమంతహీనమంతరాయకృన్తనమ్ |
హృదన్తరే నిరన్తరం వసన్తమేవ యోగినాం
తమేకదంతమేవ తం విచింతయామి సంతతమ్ || 

మహాగణేశపంచరత్నమాదరేణ యోఽన్వహం
ప్రజల్పతి ప్రభాతకే హృది స్మరన్గణేశ్వరమ్ |
అరోగతామదోషతాం సుసాహితీం సుపుత్రతాం
సమాహితాయురష్టభూతిమభ్యుపైతి సోఽచిరాత్ || 

ఇతి శ్రీ గణేశ పంచరత్నం సంపూర్ణం ||

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ambani School Annual Day Celebrations | ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవానికి క్యూకట్టిన సెలబ్రెటీలు | ABP DesamPawan Kalyan Tribal Villages Tour | పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్ల బాగు కోసం తిరిగిన డిప్యూటీ సీఎం | ABP Desamకాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Tirumala News: శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
New Year New Mindset : న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
UGC NET Exam Schedule: యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Embed widget