Horoscope Today 19th April 2022: ఈ రాశివారికి ఈ రోజు అనుకోని ఖర్చులు, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి
Horoscope In Telugu: ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా మార్పులుంటాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్యులను సంప్రదించాలి.
2022 ఏప్రిల్ 19 మంగళవారం రాశిఫలాలు
మేషం
ఈరోజు మీరు కొంత గందరగోళంలో ఉంటారు. కార్యాలయంలో ఎవరితోనైనా వాదన జరగొచ్చు. ఆరోగ్యం పట్ల అజాగ్రత్తగా ఉండొద్దు. ఎవ్వరికీ డబ్బు అప్పుగా ఇవ్వకండి. నిబంధనలను విస్మరించకూడదు. చెప్పుడు మాటలు వినకండి. ఆహారాన్ని నిర్లక్ష్యం చేయొద్దు.
వృషభం
ఈ రోజు ఈ రాశివారికి అనుకూలంగా ఉంటుంది. అనవసర పనులకు సమయాన్ని వృథా చేయకండి. చాలా రోజులుగా నిలిచిపోయిన పనులను తక్కువ సమయంలో పూర్తి చేస్తారు. భాగస్వామ్యంతో చేసే వ్యాపారంలో లాభం ఉంటుంది. మీ ఆలోచనలు, అభిప్రాయాలు ఇతరులపై రుద్దకండి. మీరు వైవాహిక జీవితాన్ని పూర్తిగా ఆనందిస్తారు. కుటుంబ సమస్యలు దూరమవుతాయి.
మిథునం
అధిక పని అలసటకు దారితీస్తుంది. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. ఈరోజు మీరు మీ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. మీ ప్రణాళికలు, మీ శైలితో ప్రశంసలు అందుకుంటారు. సహోద్యోగులతో కలిసి పని చేయండి. శ్రేయోభిలాషులతో చర్చలు జరపొచ్చు. ఏదైనా వివాదం ఉండొచ్చు.
Also Read: శుక్రుడు సంచారం, ఈ ఏడు రాశులవారికి ఆనందం-ధనం సహా అన్నింటా శుభసమయమే
కర్కాటకం
ఈ రోజు మీరు మంచి వ్యక్తులను కలవడం వల్ల ప్రయోజనం పొందుతారు. అపరిచితుల పట్ల జాగ్రత్త వహించండి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. వ్యాపార విస్తరణకు ప్రయత్నిస్తారు. అనవసర మాటలు వద్దు. ఈరోజు ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకోవడం సరికాదు. విద్యార్థులు చదువు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. అవసరమైన నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోండి.
సింహం
ఈ రాశి వారు ఈరోజు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఆరోగ్యం పట్ల అజాగ్రత్తగా ఉండొద్దు. ఆకస్మిక ఖర్చుల కారణంగా ఆర్థికంగా ఇబ్బంది పడతారు. ఎక్కువ నీళ్లు తాగాలి. ఉద్యోగులు పనుల్లో బిజీగా ఉంటారు. లావాదేవీల సమయంలో జాగ్రత్త వహించండి.
కన్యా
సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఏదైనా సమస్య పరిష్కారం అవుతుంది. యువత పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. రాజకీయాలతో ముడిపడిన వారికి పెద్ద పదవులు దక్కుతాయి. జీవిత భాగస్వామి మీ విశ్వాసాన్ని పెంచుతారు. మీ ఆలోచనలను ఎల్లప్పుడూ స్పష్టంగా ఉంచుకోండి. అపరిచితుల పట్ల జాగ్రత్త వహించండి.
Also Read: ఏప్రిల్ 29 న కుంభరాశిలోకి శని, ఈ ప్రభావం మీ రాశిపై ఎలాఉందో ఇక్కడ తెలుసుకోండి
తులా
ఈ రోజు మీకు సాధారణంగా ఉంటుంది. మీరు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. మీ మొండి వైఖరి వల్ల మీ కుటుంబ సభ్యులు కలత చెందుతారు. ప్రయాణాలలో ఇబ్బందులు ఎదరవొచ్చు. ప్రతికూల ధోరణి ఉన్న వ్యక్తులకు దూరంగా ఉండండి. బంధువులు వస్తారు. ప్రభుత్వ పనులను పూర్తి చేయగలుగుతారు. ధన సమస్యలు దూరమవుతాయి.
వృశ్చికం
సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆదాయం పెరుగుతుంది. ప్రముఖులతో మీ సంబంధాలు బలంగా ఉంటాయి. మీరు మీ లక్ష్యాలను సులభంగా సాధిస్తారు. మీ సమర్థత పెరుగుతుంది.మీ దినచర్యలో మార్పు ఉంటుంది. మంచి ఉద్యోగావకాశాలు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రేమికులు సంతోషంగా ఉంటారు.
ధనుస్సు
ఆస్తి తగాదాల కారణంగా వివాదాలు ఏర్పడతాయి. ప్రతికూల ఆలోచనలు ప్రభావం చూపుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. దంపతులు సంతోషంగా ఉంటారు. విచారకరమైన వార్తలను వింటే భావోద్వేగానికి లోనవుతారు. ఈరోజు వ్యాపారంలో ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. మీ పనులు సులభంగా పూర్తవుతాయి.
Also Read: ఈ వారం ఈ రాశులవారు లక్ష్యాలను సులభంగా సాధించేస్తారు, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి
మకరం
సాంకేతిక పనుల పట్ల ఆసక్తి ఉంటుంది. ఆస్తికి సంబంధించిన వివాదాలు పరిష్కారమవుతాయి. అవివాహితులకు సంబంధం కుదురుతుంది. మీ ప్రణాళికలు సకాలంలో పూర్తవుతాయి. కార్యాలయంలో మీ సంబంధాలు బలంగా ఉంటాయి. కొత్త భాగస్వాములు వ్యాపారంలో చేరవచ్చు. మీ వ్యక్తిత్వం చాలా మెరుగుపడుతుంది. మతపరమైన యాత్రకు వెళ్తారు.
కుంభం
ఈ రోజు మీకు అద్భుతమైన రోజు అవుతుంది. కొన్ని ఇబ్బందుల నుంచి ఉపశమనం పొందుతారు. పని పట్ల శ్రద్ధ వహించండి. జీవిత భాగస్వామితో మంచి సమయం గడుపుతారు. వ్యాపారం విషయంలో కొంచెం ఆందోళన చెందుతారు. ఆర్థిక కార్యకలాపాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులు, విద్యార్థులకు శుభసమయం.
మీనం
కుటుంబంతో సమయం గడుపుతారు. పాత మిత్రులను కలుస్తారు. అధికారులు మీతో చాలా సంతోషంగా ఉంటారు. సహాయం అర్థించిన వారికి సహాయం చేస్తారు.మీ జీవిత భాగస్వామి పట్ల మంచి ప్రవర్తన కలిగి ఉండండి. సాహిత్యంతో అనుబంధం ఉన్నవారికి గౌరవం లభిస్తుంది. వృత్తిపరమైన సమస్యలు దూరమవుతాయి.