Horoscope Today 14th January 2022: భోగభాగ్యాలు కలిగించే భోగి ఈ రాశుల వారికి భలే మంచి రోజు, మీ రాశి ఫలితం ఇక్కడ తెలుసుకోండి..
ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా చాలా మార్పులుంటాయి. పూర్తి వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.
2022 జనవరి 14 శుక్రవారం రాశిఫలాలు
మేషం
భోగి పండుగ రోజు మీకు ఆర్థికంగా బావుంటుంది. పూర్వీకుల నుంచి ఆస్తి లభిస్తుంది. కుటుంబంలో సంతోషం నెలకొంటుంది. సామాజిక రంగానికి సంబంధించిన వ్యక్తులకు ప్రశంసలు పొందుతారు.
వృషభం
ఏదో తెలియని భయం మీ కార్యాచరణను ప్రభావితం చేస్తుంది. ఆర్థికంగా అంత కలిసొచ్చే రోజు కాదిది. ఎవరితోనైనా వివాదాలు తెలెత్తవచ్చు. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. అవమానాలు ఎదుర్కోవాల్సి రావొచ్చు. అప్పుగా ఇచ్చిన మొత్తం తిరిగి చేతికందడం కష్టమే.
మిథునం
మీకు ఈ రోజంతా శుభసమయమే. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వృత్తిపరమైన సమస్యలు తొలగిపోతాయి. విద్యార్థులు విజయం సాధిస్తారు. కుటుంబం అంతా సంతోష సమయం గడుపుతారు. వైవాహిక జీవితం బావుంటుంది. ఉద్యోగులకు ప్రమోషన్ లభించే అవకాశం ఉంది.
Also Read: బసవన్నగా శివయ్య , హరిదాసుగా శ్రీహరి .. ఆ సంబరమే వేరప్పా…
కర్కాటకం
ఈ రోజు ఆర్థికంగా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. అనవసర వివాదాలు రావొచ్చు. కుటుంబంలో ఒత్తిడి ఉంటుంది. బంధువులతో సమావేశం అవుతారు కానీ చర్చలు సఫలం కావు. పోటీపరీక్షలు రాసే విద్యార్థులు మరింత ఎక్కువగా శ్రమించాల్సి ఉంటుంది. కళ్లకు సంబంధించిన సమస్యలు ఎదురవుతాయి. పిల్లల చదువుల గురించి తల్లిదండ్రులు ఆందోళన చెందుతారు.
సింహం
మానసికంగా ఏదో కలత చెందినట్టుంటారు. ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. కుటుంబంలో కొన్ని ఇబ్బందులుంటాయి. బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించలేరు. వైవాహిక జీవితంలో కొంత దూరం ఉండవచ్చు. విద్యార్థులకు చదువులో కొంత ఆటంకాలు ఏర్పడవచ్చు.
కన్య
ఆధ్యాత్మిక వ్యవహారలాపై ఆసక్తి ఉంటుంది. ఆర్థికంగా బలంగా ఉంటారు. పిల్లల వైపు నుంచి సంతోషకరమైన సమాచారాన్ని పొందుతారు. ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సామాజిక జీవితంతో అనుబంధం, ఉపాధ్యాయులు, వక్తలు ప్రయోజనం పొందుతారు. విద్యార్థులు విజయం సాధిస్తారు.
Also Read: సంక్రాంతి అనగానే మహానగరాల నుంచి పల్లెబాట పడతారెందుకు...
తుల
కొత్త పనులు ప్రారంభిస్తారు. ప్రత్యర్థులు ఓడిపోతారు. వ్యాపారంలో మంతి లాభాలొస్తాయి. మానసిక ఆందోళనలు దూరమవుతాయి. ఆర్థికంగా లాభపడే అవకాశాలు ఉంటాయి. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ పెరుగుతుంది. వివాహితులు సంతోషంగా ఉంటారు.
వృశ్చికం
చేపట్టిన పనుల్లో కొన్ని అడ్డంకులు ఎదురవుతాయి. ఏ పనిపై ప్రయాణం చేస్తారో ఆ పని పూర్తికాదు. బంధువులతో వివాదాలు వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. అనవసర ఖర్చులు చేయాల్సి వస్తుంది.
ధనుస్సు
ఆర్థికంగా కలిసొచ్చే రోజు. అన్ని పనుల్లోనూ విజయం సాధిస్తారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. విద్యార్థులు చదువుపై దృష్టి సారిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే సమాచారం అందుతుంది. వృత్తిపరమైన సమస్యలు పరిష్కారమవుతాయి. ధార్మిక పనులపట్ల ఆసక్తి పెరుగుతుంది.
Also Read: భోగి పళ్లుగా రేగు పళ్లు ఎందుకు పోస్తారు… వీటికి-దిష్టికి ఏంటి సంబంధం…
మకరం
మీజీవిత భాగస్వామితో విభేదాలు రావచ్చు. స్నేహితుల నుంచి దూరం పెరుగుతుంది. వ్యాపారంలో నష్టపోతారు. పిల్లల నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటారు. మానసికంగా కుంగిపోతారు. ఓవరాల్ గా చెప్పాలంటే మకరరాశి వారికి టైమ్ అస్సలు బాలేదట. కానీ మానసికంగా ధైర్యంగా ఉంటే వాటిని అధిగమించడం కూడా కష్టం కాదు.
కుంభం
మతపరమైన కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం మీకు లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి బావుటుంది. సానుకూల ఆలోచనలు పెరుగుతాయి. కుటుంబంలో సంతోషం ఉంటుంది. సమాజంలో ప్రశంసలు పొందుతారు. ఇంటి వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ప్రయాణం చేయవచ్చు.
మీనం
ఆరోగ్యం క్షీణించవచ్చు. మనసు సంతోషంగా ఉంటుంది. తలపెట్టిన పనులు పూర్తయ్యే సూచనలు లేవు. కుటుంబంలో ఒత్తిడి ఉంటుంది. ధన నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రయాణాలలో జాగ్రత్త వహించాలి. ప్రత్యర్థులు చురుకుగా ఉంటారు. ఉద్యోగస్తులు ఇబ్బంది పడతారు.
Also Read: అన్నమయ్య పాటల్లోనూ సంక్రాంతి గొబ్బిళ్లకు ప్రత్యేక స్థానం...
Also Read: ఏడాదంతా పండుగలే.. మరి సంక్రాంతినే పెద్దపండుగ అంటారెందుకు...
Also Read: గతేడాది ఎలా చేశారో తెలియదు కానీ… ఈ సంక్రాంతికి ఇలా చేయండి
Also Read: తిరుమల శ్రీవారిని మొదటి గడప నుంచి దర్శించుకునే అవకాశం.. సామాన్యుడి కల తీరినట్టేనా....!
Also Read: మకర సంక్రాంతి రోజు సూర్యుడి ఆశీర్వాదం కావాలంటే ఇలా చేయకుండా ఉంటే చాలు...
Also Read: సంక్రాంతికి శ్రీశైలం మల్లన్న కల్యాణం, భక్తులకు ఈ నిబంధనలు తప్పనిసరి...
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి