Horoscope Today 23 December 2021: ఈ రాశి వారు ఈ రోజు అందరి నుంచి ప్రశంసలు అందుకుంటారు, అందులో మీరున్నారా ఇక్కడ తెలుసుకోండి..
ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా చాలా మార్పులుంటాయి. పూర్తి వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు…
మేషం
ఉద్యోగస్తులు బదిలీకి సంబంధించిన సమాచారం కానీ ప్రమోషన్ సమాచారం కానీ వింటారు. మీ ప్లానింగ్ ని అంతా అభినందిస్తారు. దినచర్య మెరుగుపడుతుంది. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కార్యాలయంలో మార్పులు జరగొచ్చు. కీర్తి ప్రతిష్టలు పొందుతారు. కుటుంబంలో కొన్ని గొడవలు అలాగే ఉంటాయి.
వృషభం
ఆర్థిక పరిస్థితి బావుంటుంది. ఒకరి మాటలు మిమ్మల్ని బాధించవచ్చు. ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రయత్నించండి. భగవంతుని ఆరాధించడంలో ధైర్యాన్ని పొందుతారు. పూర్వీకుల వ్యవహారాలు సాగుతాయి. రిస్క్ తీసుకోకండి.
మిథునం
మీ పనులు సులభంగా పూర్తవుతాయి. ఎప్పటి నుంచో నిలిచిపోయిన డబ్బు చేతికందుతుంది. సమీపంలోని నగరాలను సందర్శించవచ్చు. ఆదాయం పెరుగుతుంది. వ్యాపారం అనుకూలంగా ఉంటుంది. పెట్టుబడి లాభదాయకంగా ఉంటుంది. కార్యాలయంలో సాధారణ పరిస్థితి ఉంటుంది. బంధువుల నుంచి మంచి సమాచారం అందుతుంది.
Also Read: పద్మవ్యూహం అనే మాట పదే పదే వాడేస్తుంటాం కానీ.. పద్మవ్యూహం ఎంత భయంకరంగా ఉంటుందో తెలిస్తే..
కర్కాటకం
కాన్ఫిడెన్స్ పీక్స్‌లో ఉంటుంది. ఓ శుభవార్త వింటారు. కొత్త పనులు ప్లాన్ చేస్తారు. వ్యాపారంలో లాభం ఉంటుంది. వస్తు వనరుల పెరుగుదల ఉంటుంది. కుటుంబ సభ్యులు ఆనందంగా ఉంటారు. ధనం అందుతుంది. స్త్రీ ద్వేషానికి దూరంగా ఉండండి.
సింహం
ఆఫీసులో మీ ప్రభావం పెరుగుతుంది. గతంలో మీరు పడిన కష్టానికి తగిన ఫలితం ఇప్పుడు లభిస్తుంది. బాధ్యతలు నెరవేరుస్తారు. స్నేహితుల నుంచి సహాయం అందుతుంది. పెట్టుబడుల నుంచి లాభాలొస్తాయి.
కన్య
ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి. తలపెట్టిన పనులు పూర్తిచేస్తారు. గౌరవప్రదమైన వ్యక్తి మార్గదర్శకత్వం మీకు లభిస్తుంది. ఈ రోజు మీరు చాలా సంతోషంగా ఉంటారు. కొత్త బాధ్యతలను పొందుతారు. వ్యాపారం బాగానే సాగుతుంది. ఉద్యోగులకు అనుకూల సమయం. విద్యార్థులు చదువుపై శ్రద్ధపెట్టాలి.
Also Read: వాలు జడలో వంద కథలు.. ప్రతి జడకి, ముడికి అర్థం ఉంది..
తుల
ఆధ్యాత్మిక పరమైన లేదా వ్యాపారపరమైన ప్రయాణాలు ప్రయోజనకరంగా ఉంటాయి. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. నిలిచిపోయిన పనులను పూర్తికావడంతో సంతోషంగా ఉంటారు. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. కార్యాలయంలో మంచి వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. ప్రత్యర్థులపై ఆదిపత్యం చెలాయిస్తారు.
వృశ్చికం
మీ దినచర్య మెరుగుపడుతుంది. మతపరమైన పనుల పట్ల ఆసక్తి చూపుతారు. వైవాహిక సంబంధాల్లో మధురానుభూతి ఉంటుంది. కుటుంబ సమస్యలను తేలికగా తీసుకోవద్దు. పిల్లల్ని పట్టించుకోకుండా ఉండొద్దు..వాళ్లకు తప్పొప్పులు చెప్పేందుకు ప్రయత్నించండి.
ధనుస్సు
మీపై కుటుంబ సభ్యులకు అంచనాలు రెట్టింపవుతాయి. రోజంతా సానుకూలంగా ఉంటుంది. వ్యక్తిగత విషయాలను అందరితో పంచుకోవద్దు. లావాదేవీలు జరిపేటప్పుడు తొందరపడొద్దు. తెలియని వ్యక్తులను నమ్మొద్దు. బంధువుల ఇంటికి వెళతారు. పాత మిత్రులను కలుస్తారు. అప్పిచ్చిన మొత్తం తిరిగి చేతికందుతుంది.
Also Read: ఈ రాశుల వారిని ప్రేమిస్తే నెత్తిన గుడ్డేసుకుని కూర్చోవడమే..
మకరం
వ్యాపార పరిస్థితులు బాగుంటాయి. పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి. కార్యాలయంలో సహోద్యోగులకు మద్దతు లభిస్తుంది. తెలియని అడ్డంకులు తొలగిపోతాయి. టెన్షన్ తగ్గుతుంది. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. సమయం మీకు అనుకూలంగా ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన సంతోషాన్నిస్తుంది.
కుంభం
ఉద్యోగులు ప్రమోషన్ కి సంబంధించిన సమాచారం పొందుతారు. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. ప్రత్యర్థులు ప్రశాంతంగా ఉంటారు. ఈరోజు మీ పనులన్నీ పూర్తవుతాయి. కార్యాలయంలో సవాళ్లు ఎదురవుతాయి. స్నేహితుడిని కలుస్తారు. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం వద్దు.
మీనం
ఈ రాశివారు ఈ రోజు వాహనాన్ని జాగ్రత్తగా నడపండి. గాయపడే ప్రమాదం ఉంది. ఎవరితోనైనా పెద్ద వివాదం రావొచ్చు. ఆందోళన, ఒత్తిడి అలాగే ఉంటుంది. అవసరం లేకుంటే ప్రయాణం వాయిదా వేసేందుకు ప్రయత్నించండి. వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. రిస్క్ తీసుకోవద్దు. బంధువులను కలుస్తారు.
Also Read: శీతాకాలం.. మంచు కురిసే సమయం.. ఈ రాశుల వారికి భలే ఇష్టమట!
Also Read: ఈ టైమ్ లో చెడుమాట్లాడితే అంతే...
Also Read: 2022 ఈ నాలుగు రాశుల వారికి కొత్తకొత్తగా ఉంటుంది, చాలా సమస్యల నుంచి రిలీఫ్ పొందుతారు..
Also Read: 2022 లో ఈ నాలుగు రాశులవారి ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుందంటే...
Also Read: 2022 లో ఈ నాలుగు రాశుల వారు అన్నింటా విజయం సాధిస్తారు, ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి