Horoscope Today 19 December 2021: ఆదివారం ఈ రాశుల వారు కోపం తగ్గించుకోండి.. మీ రాశిఫలితం ఎలా ఉందో ఇక్కడ తెలుసుకోండి..
ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా చాలా మార్పులుంటాయి. పూర్తి వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు…
మేషం
అప్పులు తీర్చగలుగుతారు. వాహనం కొనుగోలు చేసేందుకు ప్రణాళిక రూపొందిస్తారు. ప్రభుత్వ పనులు పూర్తవుతాయి. కుటుంబ సభ్యులతో గతంలో ఉన్న విభేదాలు పరిష్కారమవుతాయి. మీరు సంతోషంగా ఉంటారు. ఉద్యోగులు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించగలుగుతారు.
వృషభం
ఆర్థిక పరిస్థితి బావుంటుంది. స్నేహితులతో సంతోషంగా గడుపుతారు. ఈ రోజు ముఖ్యమైన పనులు వాయిదా వేయడమే మంచిది. విద్యార్థులు మరింత కష్టపడాల్సి ఉంటుంది. ఉద్యోగులు ప్రమోషన్ కి సంబంధించిన సమాచారం పొందొచ్చు. ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, మీరు దినచర్యలో మార్పులు తీసుకొస్తారు. అదృష్టం కలిసొస్తుంది.
మిథునం
బంధువులను కలుస్తారు. ప్రభుత్వ పనుల్లో విజయం సాధిస్తారు. తెలియని అడ్డంకిని అధిగమిస్తారు. ఈ రోజు మీరు దాదాపు అన్ని పనులను పూర్తి చేయగలుగుతారు. మీకు ప్రియమైనవారి మద్దతు లభిస్తుంది. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
Also Read: 2022 లో ఈ నాలుగు రాశుల వారు అన్నింటా విజయం సాధిస్తారు, ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం..
కర్కాటకం
జీవిత భాగస్వామి నుంచి సహాయం అందుతుంది. పాత పెట్టుబడుల వల్ల ప్రయోజనం పొందుతారు. ఈరోజు ఎక్కువ ఖర్చు చేస్తారు. అవసరమైన నిర్ణయాలు తీసుకోవచ్చు. ఆఫీసు వాతావరణం మీకు అనుకూలంగా ఉంటుంది. ఈ రోజు స్నేహితులు, బంధువులను కలుస్తారు. కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. వ్యాపారంలో పురోగతి ఉంటుంది.
సింహం
వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. పెద్దల ఆశీస్సులు పొందుతారు. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండండి. వాహనాన్ని జాగ్రత్తగా నడపండి. ఒత్తిడి తగ్గినట్టు అనిపిస్తుంది. ప్రవర్తనలో సానుకూలత ఉంటుంది. భగవంతుడిపై మనసు నిమగ్నమై ఉంటుంది. ప్రమాదకర పనులు చేయవద్దు. ఆరోగ్యం జాగ్రత్త.
కన్య
కొత్త వ్యక్తులను నమ్మొద్దు. వాహనాన్ని జాగ్రత్తగా నడపండి ప్రమాదం జరగొచ్చు. కుటుంబంతో సంతోషంగా ఉంటారు. ఆహారం పట్ల నిర్లక్ష్యం వద్దు. విద్యార్థులు మరింత కష్టపడాల్సి ఉంటుంది. వృద్ధులను జాగ్రత్తగా చూసుకోండి.
Also Read: 2022 ఈ నాలుగు రాశుల వారికి కొత్తకొత్తగా ఉంటుంది, చాలా సమస్యల నుంచి రిలీఫ్ పొందుతారు..
తుల
ఈ రోజంతా సంతోషంగా ఉంటారు. స్నేహితులతో ఎంజాయ్ చేస్తారు. పిల్లల వైపు నుంచి శుభవార్తలు అందుకుంటారు. అడగకుండా ఎవరికీ సలహా ఇవ్వకండి. శత్రువుల కదలికలపై నిఘా ఉంచండి. వృద్ధుల ఆరోగ్యం క్షీణించవచ్చు. ఈ రోజు సాధారణంగా ఉంటుంది.
వృశ్చికం
ప్రత్యర్థులు చురుగ్గా ఉంటారు మీరు జాగ్రత్తగా ఉండండి. అవివాహితులకు సంబంధాలు కుదిరే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. సేవాకార్యక్రమాల్లో పాల్గొంటారు. సహోద్యోగులతో సంతోషంగా ఉంటారు.
ధనుస్సు
మీరు పెట్టుబడి ప్రతిపాదనలను అందుకుంటారు. ఒత్తిడి లేకుండా పనిచేస్తారు. సహోద్యోగుల నుంచి సహకారం అందుతుంది. మిత్రుల సహకారంతో పనులు సాగుతాయి. కుటుంబ పెద్దల ఆశీస్సులు పొందుతారు. వరుస పనులతో బాగా అలసిపోయినట్టు అనిపిస్తుంది.
Also Read: 2022 లో ఈ నాలుగు రాశులవారి ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుందంటే...
మకరం
పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన పనులు ముందుకు సాగుతాయి. ఈ రోజు ఖర్చులు ఎక్కువ కావొచ్చు. ఇంట్లో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. భగవంతుని ఆరాధించడంలో ధైర్యం పొందుతారు. పెద్దల ఆశీస్సులు తీసుకోండి. బయటి ఆహారానికి దూరంగా ఉండండి. జీవిత భాగస్వామి ఆరోగ్యం క్షీణించవచ్చు. ప్రత్యర్థులు చురుకుగా ఉంటారు. ,
కుంభం
ఈ రోజు వరుస పనులతో బిజీ బిజీగా ఉంటారు. దూరప్రాంత ప్రయాణాలకు ప్లాన్ చేసుకోవచ్చు. బంధువులను కలుస్తారు. విద్యార్థులు విజయం సాధిస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. మీకు తెలియని వ్యక్తుల వల్ల కొంత నష్టం వాటిల్లవచ్చు. కోపం తగ్గించుకోండి, మాటలు నియంత్రించండి. మీ మాటపై సంయమనం పాటించండి.
మీనం
ఎవరితోనైనా మనస్పర్థలు రావొచ్చు. మీరు వ్యాపారానికి సంబంధించి రుణం తీసుకోవచ్చు. కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. వ్యాపారస్తులు కొత్త ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ఈ రోజు స్నేహితుల నుంచి శుభవార్త వింటారు. ఆహారం విషయంలో నిర్లక్ష్యం వద్దు, ఆరోగ్యం బాగానే ఉంది.
Also Read: చెడు మాట్లాడకు.. తథాస్తు దేవతలున్నారు అంటారు కదా.. నిజంగా ఉన్నారా, దీని వెనుక అసలు విషయం ఏంటి..
Also Read: జీవితకాలంలో ఈ ఏడు క్షేత్రాలను ఒక్కసారైనా దర్శించుకుంటే.. స్వర్గలోకంలోకి ఎంట్రీ ఖాయమట
Also Read: కలియుగం అంతం అయ్యేసరికి మనిషి ఆయుష్షు ఎంతో తెలిస్తే షాకైపోతారు..
Also Read: గుడ్ల గూబను అశుభం అనుకుంటే పొరపాటే.. ఈ విషయం తెలుసా..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి