Horoscope Today 18 August 2022: మేషం, వృషభం సహా మరో మూడు రాశులవారు ఈ రోజు గుడ్ న్యూస్ వింటారు, ఆగస్టు 19 రాశిఫలాలు
Horoscope 19th August : ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. పూర్తి వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు
![Horoscope Today 18 August 2022: మేషం, వృషభం సహా మరో మూడు రాశులవారు ఈ రోజు గుడ్ న్యూస్ వింటారు, ఆగస్టు 19 రాశిఫలాలు Horoscope Today 19 August 2022 Horoscope 19th August 2022 Rashifal astrological prediction for Gemini, Leo, Capricorn, Libra and Other Zodiac Signs Horoscope Today 18 August 2022: మేషం, వృషభం సహా మరో మూడు రాశులవారు ఈ రోజు గుడ్ న్యూస్ వింటారు, ఆగస్టు 19 రాశిఫలాలు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/18/7f49110a08e33a4f74c81bc85aee4f021660824106977217_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Horoscope Today 19th August 2022
మేషం
ఈ రోజు మీకు సంతోషంగా ఉంటారు. శ్రమకు తగిన ఫలితం పొందుతారు. ఉద్యోగులు కొత్త వాహనం లేదా ఇల్లు కొనుగోలు దిశగా అడుగులేస్తారు. ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. తండ్రికి అనారోగ్య సూచనలున్నాయి జాగ్రత్త.
వృషభం
ఈ రోజు మీకు మంచి ఆదాయం కలిసొస్తుంది. కుటుంబ సభ్యుల సహకారంతో మీ సమస్యలు పరిష్కారం అవుతాయి. ప్రణాళికల ప్రకారం ముందుకు సాగడం వల్ల సక్సెస్ అవుతారు. ఆధ్యాత్మిక ప్రయాణం చేసేందుకు ప్లాన్ చేసుకుంటారు. ఉద్యోగులు, వ్యాపారులకు మంచి రోజు.
మిథునం
ఈ రోజు మీరు పెరుగుతున్న ఖర్చుల గురించి మీరు ఆందోళన చెందుతారు. ఖర్చులు నియంత్రించే దిశగా జీవిత భాగస్వామితో వాగ్వాదం ఉండొచ్చు. కార్యాలయంలో మీకు గౌరవం లభిస్తుంది. అనుకున్న ప్రణాళికలు పూర్తిస్థాయిలో అమలు చేయవచ్చు. అధికపని కారణంగా అలసిపోతారు. తీసుకున్న అప్పులు చెల్లిస్తారు.
Also Read: శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి!
కర్కాటకం
ఈ రోజు మీరు సృజనాత్మక పనిలో గడుపుతారు. స్నేహితులు ఎవరైనా మీ ఆస్తికి సంబంధించిన పనిలో మీకు ఆటంకం కలిగించవచ్చు, ఈ రాశి విద్యార్థులు చదువుపై దృష్టిసారిస్తారు. విదేశాల్లో ఉంటూ వ్యాపారం చేసేవారు శుభవార్త వింటారు. మీ చుట్టుపక్కన కొన్ని గొడవలు జరుగుతాయి. ఉద్యోగులు పనివిషయంలో ప్రయోగాలు చేస్తే సక్సెస్ అవుతారు.
సింహం
ఈ రోజు మీకు మిశ్రమంగా ఉంటుంది.ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. వ్యాపారులు లాభాలు ఆర్జిస్తారు. ఒకటికి రెండుసార్లు ఆలోచించి ఖర్చు చేయడం మంచిది. కుటుంబంలో ఉన్న సమస్యలు ఓ కొలిక్కి వస్తాయి. మీ ప్రత్యర్థులు కూడా కార్యాలయంలో చురుగ్గా ఉంటారు..జాగ్రత్త.
కన్యా
ఈ రోజు మీకు కొంత గందరగోళంగా ఉంటుంది.వరుస పనులు తలకెత్తుకోవడం వల్ల ఏది ముందు చేయాలో, ఏది తర్వాత చేయాలో అర్థంకాదు. మీ శత్రువులు ఆదిపత్యం కోసం ప్రయత్నిస్తారు. పాత అఫ్పులు చెల్లించేందుకు ప్లాన్ చేసుకోండి. పిల్లలు చదువుకి సంబంధించిన సమస్యలను తండ్రితో మాట్లాడాల్సి వస్తుంది. ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి.
Also Read: శ్రీ కృష్ణుడు చిన్నప్పుడు ఎలా ఉన్నాడో చూడాలనుకుంది రుక్మిణి, ఏం చేసిందో తెలుసా!
తులా
ఈ రోజు మీకు ఆర్థికంగా మంచి రోజు అవుతుంది. డబ్బును ఆదా చేయడంలో విజయవంతమవుతారు, ఫ్యూచర్ కోసం ప్లాన్ చేసుకుంటారు. సంపాదనతో పాటు ఖర్చులు కూడా పెరుగుతాయి. ఉద్యోగులుకు పదోన్నతులకు సంబంధించిన సమాచారం వింటారు.బంధువులతో ఏమైనా వివాదాలు ఉంటే మౌనంగా ఉండడం మంచిది. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ పెరుగుతుంది.
వృశ్చికం
ఈ రోజు వృశ్చికరాశివారికి అనుకూల ఫలితాలున్నాయి. కార్యాలయంలో మీ స్థానం ఉన్నతంగా ఉంటుంది. మీకంటూ ఓ సర్కిల్ ఏర్పాటు చేసుకోవడంలో సక్సెస్ అవుతారు. ప్రణాళికాబద్ధంగా పని చేయడం ద్వారా విజయాన్ని పొందుతారు.మీ జూనియర్లు కూడా మీతో కలిసి పనిచేయడానికి సంతోషిస్తారు. ఆస్తికి సంబంధించిన ఏదైనా ఒప్పందాన్ని ఖరారు చేయడానికి ముందు మీరు పత్రాలు తనిఖీ చేయడం మంచిది.
ధనస్సు
ఈ రోజు మీ ఆదాయం పెరుగుతుంది. వ్యాపారులు తమని తాము నమ్ముకోవడం మంచిది. ఆర్థికంగా నిలదొక్కుకునే అవకాశం ఏదైనా వచ్చినప్పుడు అతిగా ఆలోచించి చేజార్చుకోవద్దు. కొత్త వాహనం లేదా ఇల్లు కొనుగోలు చేయడానికి ఇదే మంచి సమయం. అన్నదమ్ముల మధ్య జరుగుతున్న వివాదాలు ఓ కొలిక్కివస్తాయి. కుటుంబంలో చీలికల కారణంగా మానసికంగా బాధపడతారు.
Also Read: కృష్ణాష్టమి రోజు కృష్ణుడి అడుగులు ఎందుకు వేస్తారు, కన్నయ్య అడుగు పెడితే!
మకరం
ఈ రోజు మీకు మిశ్రమ ఫలితాలున్నాయి. వ్యాపారం చేసేవారు ప్రయాణం చేయాల్సి రావొచ్చు. చట్టపరమైన విషయాలు ఏవైనా కోర్టులో నడుస్తున్నట్లయితే ఇంకొన్నాళ్లు వెయిట్ చేయక తప్పదు. కుటుంబ జీవితం మెరుగ్గా ఉంటుంది. పొట్టకు సంబంధించిన సమస్యలు ఎదుర్కొంటారు.
కుంభం
ఈ రోజు మీకు ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగులు ఉన్నతాధికారుల నుంచి ప్రయోజనం పొందుతారు. ప్రేమ జీవితాన్ని గడిపే వ్యక్తులు తమ భాగస్వామికి బహుమతి ఇస్తారు. వర్క్ ఫ్రం హోం చేసే ఉద్యోగులపై పనిభారం పడుతుంది. వ్యాయామంపై శ్రద్ధ వహించడం మంచిది. ఆదాయం పెరగడం వల్ల సంతోషంగా ఉంటారు.
మీనం
ఈ రోజు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మీరు మీ ప్రవర్తనతో అందర్నీ ఆకట్టుకుంటారు. ఉద్యోగులు సంయమనం పాటిస్తనే పని ముందుకు సాగుతుంది. సామాజిక సంస్థలతో అనుబంధం ఉన్న వ్యక్తులు కొత్త గుర్తింపును పొందుతారు. కుటుంబ పెద్దల మాటకు కట్టుబడి వ్యవహరించండి. మీ ప్రత్యర్థులు మిమ్మల్ని వేధించడానికి ప్రయత్నిస్తారు..జాగ్రత్తగా ఉండాలి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)