Horoscope Today 15 August 2022: స్వాతంత్ర్య దినోత్సవం ఈ రాశులవారి జీవితంలో రంగులు నింపుతుంది, ఆగస్టు 15 రాశిఫలాలు
Horoscope 15th August : ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. పూర్తి వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు
Horoscope Today 15 August 2022
మేషం
ఈ రాశివారికి ప్రేమ వ్యవహారాలకు ఇది మంచి సమయం. ఉద్యోగులకు కార్యాలయంలో చిన్న చిన్న ఇబ్బందులు తప్పవు. నిబద్ధత లేకపోవడం ఆర్థిక వైపు ప్రతికూల హెచ్చు తగ్గులకు కారణం అవుతుంది. అనారోగ్యో సమస్యలు ఇబ్బంది పెడతాయి.
వృషభం
ఈ రోజు మీ లైఫ్ కలర్ ఫుల్ గా ఉంటుంది. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది. ఆరోగ్యం బావుంటుంది. పాత మిత్రులను కలుసుకునే అవకాశం ఉంటుంది. ప్రయాణం చేసేందుకు ప్రణాళికలు వేసుకుంటారు. మీడియాతో సంబంధం ఉన్న వ్యక్తులు ప్రయోజనం పొందుతారు.విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు.
మిథునం
గృహస్థుల మధ్య పరస్పర ప్రేమ ఉంటుంది. మీ కొత్త పరిచయాలు భవిష్యత్తులో సహాయకరంగా ఉంటాయని రుజువవుతుంది. ఉద్యోగులు శుభవార్త వింటారు. ఆదాయం విషయంలో మాత్రం పెద్దగా మార్పులుండవు. లావాదేవీల విషయంలో తొందరపడొద్దు.
రోజంతా బిజీగా ఉంటారు
Also Read: రాశిమారిన అంగారకుడు, ఈ రాశులవారికి ఆరోగ్యం, ఆదాయం, ఆనందం
కర్కాటకం
ఈ రోజు ఆశించిన విజయాన్ని పొందే అవకాశం ఉంది. మీ ఆదాయం పెరగుతుంద. ఆకస్మిక ధనలాభం లేదా బహుమతి రావొచ్చు. ఖర్చులను తగ్గించుకోవాలి. పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయి. మనసు ఆనందంగా ఉంటుంది.
సింహం
ఈ రోజు మీ కెరీర్ కొత్త దిశలో ఉంటుంది. ఉద్యోగులకు కార్యాలయంలో మీ ప్రతిష్ట పెరుగుతుంది. సీనియర్ల సహాయంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. మీ ప్రేమ-బంధం కూడా బలంగా ఉంటుంది.
కన్యా
ఈ రోజు కుటుంబంలో చిన్న చిన్న సమస్యల కారణంగా మనసు కలవరపడుతుంది. కొత్త ప్రాజెక్టుకు సంబంధించి ఏం చేస్తారో అందరికీ అర్థం అయ్యేలా బహిర్గతం చేయడం వల్ల మీకు ఉపయోగకరంగా ఉంటుంది. ముఖ్యమైన పనులపట్ల అలసత్వం వద్దు.
Also Read: వృషభ రాశిలో కుజుడి సంచారం, ఈ 5 రాశులవారికి అన్నీ సవాళ్లే!
తులా
ఈ రోజు మీపై ఆర్థికంగా ఒత్తిడి ఉంటుంది. ఆర్థిక విషయాల్లో తెలివిగా వ్యవహరించాలి. వ్యాపారులు కొత్త ప్రణాళికలు వేసుకోవచ్చు. మీ ఆలోనచలను మరింత అభివృద్ధి చేసుకోవడం మంచిది.
వృశ్చికం
ఈ రోజు మీరు తలపెట్టిన పనులు మీ తల్లిదండ్రుల సహకారంతో పూర్తవుతాయి. అకస్మాత్తుగా ఓ స్నేహితుడు ఇంటికి రావొచ్చు. ఈ రాశి విద్యార్థులకు ఈ రోజు సాధారణంగానే ఉంటుంది. ఇంట్లో ఆనందం పెరిగుతుంది. కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి.
ధనుస్సు
ఈ రోజంతా ఉత్సాహంగా గడుపుతారు.ఆర్థిక పరిస్థితి వేగంగా బలపడుతుంది. మానసికంగా కొంత ఇబ్బంది పడతారు. వ్యాపారులకు మంచిది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపడం వల్ల మనసు ఆనందంగా ఉంటుంది. ఉద్యోగులు, విద్యార్థులకు మంచి రోజు.
Also Read: ఆగస్టు 18 or 19 శ్రీ కృష్ణ జన్మాష్టమి ఎప్పుడు జరుపుకోవాలి
మకరం
ఈ రోజంతా మీకు శుభప్రదంగా ఉంటుంది. సామాజిక లేదా రాజకీయాలతో సంబంధం ఉన్న వ్యక్తులు కొన్ని ముఖ్యమైన విజయాలు అందుకుంటారు. కొన్ని కొత్తపరిచయాలు ఏర్పడతాయి. సృజనాత్మక రంగాల్లో అనూహ్యంగా రాణిస్తారు. పోటీ పరీక్షలు రాసిన వారికి కానీ ఉద్యోగం కోసం పరీక్ష లేదా పోటీ ద్వారా ఉద్యోగం కోసం చూస్తున్న వారికి శుభ ఫలితాలు లభిస్తాయి.
కుంభం
ఈ రోజు మీ పని విధానంలో మార్పు వస్తుంది. కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. భౌతిక ఆనందాలు పెరుగుతాయి. కార్యాలయంలో ఎప్పటినుంచో ఉన్న సమస్య ఈరోజు పరిష్కారం అవుతుంది.
మీనం
ఈ రోజు మీకు కొత్త కొత్తగా ఉంటుంది.తలపెట్టిన పనిలో స్నేహితులు, సన్నిహితుల నుంచి సహకారం లభిస్తుంది. తప్పనిసరి అయితే కానీ ప్రయాణాలు చేయకపోవడమే మంచిది. తొందరగా అలసిపోతారు. ఇంటా బయటా మీకు గౌరవం పెరుగుతుంది.
Also Read: ఈ 5 రాశుల అబ్బాయిలను పెళ్లిచేసుకున్న అమ్మాయిలు అదృష్టవంతులు