Mars Transit 2022: వృషభ రాశిలో కుజుడి సంచారం, ఈ 5 రాశులవారికి అన్నీ సవాళ్లే!
ఆగస్టు 10న వృషభ రాశిలో ప్రవేశించిన కుజుడు అక్టోబరు 16 వరకూ..అంటే..68 రోజుల పాటూ వృషభ రాశిలోనే సంచరిస్తాడు. ఈ రెండు నెలల కాలంలో జాగ్రత్తగా ఉండాల్సిన రాశులివే...
Mars Transit 2022: గ్రహాల సేనాధిపతిగా పేరున్న కుజుడు ఆగస్టు 10న రాత్రి దాదాపు 9:12 గంటలకు మేష రాశిని విడిచి వృషభ రాశిలోకి ప్రవేశించాడు. . దీని ప్రభావం మెుత్తం 12 రాశులపై ఉంటుంది.శ్రావణమాసంలో ఇప్పటికే బుధుడు, సూర్యుడు, శుక్రుడు తమ రాశిని మార్చాయి. తాజాగా కుజుడు కూడా రాశి మారాడు. అంగారకుడి సంచారం కొన్ని రాశులవారికి మంచి చేస్తే మరికొన్ని రాశులవారు అశుభ ఫలితాలనిస్తుంది. ఈ సమయంలో ప్రపంచంలో కూడా విధ్వంసాలు జరగొచ్చంటారు పండితులు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కుజుడు మంచి స్థానంలో ఉంటే ధైర్యం, విజయం మీతో ఉంటుంది. కానీ కుజుడి సంచారం సరిగా లేనప్పుడు ఆ రాశులవారు అడుగడుగూ జాగ్రత్తగా వ్యవహరించాలి. అన్నీ సవాళ్లే ఎదురవుతాయి. ఆగస్టు 10న వృషభ రాశిలో ప్రవేశించిన కుజుడు అక్టోబరు 16 వరకూ..అంటే..68 రోజుల పాటూ వృషభ రాశిలోనే సంచరిస్తాడు. ఈ రెండు నెలల కాలంలో జాగ్రత్తగా ఉండాల్సిన రాశులివే...
మేష రాశి
అంగారకుడి సంచారం మేష రాశి వారికి అంతగా బాలేదు. అనుకున్న పనులు అనుకున్నట్టు జరగవు. ఎంత కష్టపడినా ఆశించిన ఫలితం దక్కదు. కోపం పెరగడం వల్ల మీరు చేసే పని కూడా చెడిపోతుంది. వైవాహిక జీవితంలో కొన్ని ఇబ్బందులుంటాయి. ఆవేశం తగ్గించుకుని సమస్యలు పరిష్కరించుకుంటే కొంత ఉపశమనం ఉంటుంది.
మిథున రాశి
అంగారకుడి సంచారం మిథున రాశివారికి కూడా ప్రతికూల ఫలితాలనిస్తోంది. అనుకోని ఖర్చులు పెరుగుతాయి. అయితే ఖర్చులు తప్పవు అనుకున్నప్పుటు ఆచి తూచి ఖర్చు చేసేలా ప్లాన్ చేసుకోవాలి. ఈ రెండు నెలల పాటూ ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి. ఏ చిన్న సమస్యను కూడా నిర్లక్ష్యం చేయవద్దు. వైవాహిక జీవితంలో వివాదాలు తప్పదు. కోపం తగ్గించుకుంటే చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి.
కన్య రాశి
కన్యారాశివారికి కుజుడి సంచారం మిశ్రమ ఫలితాలనిస్తుంది. లాభనష్టాలు రెండూ ఉంటాయి. ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి, ఆచితూచి అడుగేయాలి
Also Read: నిద్రలేవగానే చాలామంది అరచేతులు చూసుకుని లేస్తారు, ఇది మంచిదా కాదా!
తులా రాశి
తులా రాశి వారికి కూడా కుజుడి సంచారం అంత బాగాలేదు. ఈ రెండు నెలల పాటూ ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. శారీరకంగా, మానసికంగా ఒత్తిడులు ఎదుర్కోవాల్సి వస్తుంది. నోటికొచ్చినట్టు మాట్లాడకండి..మాట, పని అన్ని విషయాల్లోనూ జాగ్రత్తగా ఉండాలి. మాట తూలితే కొన్ని బంధాలకు బ్రేక్ పడుతుంది అందుకే జాగ్రత్త పడండి.
మీన రాశి
మీన రాశివారికి కుజుడి సంచారం ప్రతికూల ఫలితాలనిస్తోంది. డబ్బులు చేతికొస్తాయి కానీ ఖర్చవకుండా నిలవవు. వచ్చినట్టే వచ్చి మాయమైపోయినట్టుంటాయి. ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బందిగానే ఉంటుంది. కోపం తగ్గించుకోకుంటే చాలా నష్టపోతారు. తండ్రి, భార్యపై అనవసర కోపాన్ని వీడడం మంచిది.ఉద్యోగులకు గడ్డుకాలమే , వ్యాపారులు జాగ్రత్త పడాలి.ఇంటా బయటా అన్నీ సవాళ్లే ఎదురవుతాయి. మనోధైర్యంత ముందుకు సాగండి...
Also Read: ఈ 5 రాశుల అబ్బాయిలను పెళ్లిచేసుకున్న అమ్మాయిలు అదృష్టవంతులు
నోట్: ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. పూర్తి వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు. వీటిని ఎంతవరకూ విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం....