News
News
X

Mangal Gochar 2022: రాశిమారిన అంగారకుడు, ఈ రాశులవారికి ఆరోగ్యం, ఆదాయం, ఆనందం

ఆగస్టు 10న వృషభ రాశిలో ప్రవేశించిన అంగారకుడు అక్టోబరు 16 వరకూ..అంటే..68 రోజుల పాటూ వృషభ రాశిలోనే సంచరిస్తాడు. ఈ రెండు నెలల కాలం ఈ రాశులవారికి బాగా కలిసొస్తుంది.

FOLLOW US: 

2022 Mangal Gochar:  సౌరకుటుంబంలో అంగారక గ్రహానికి ప్రత్యేక స్థానముంది. దీన్నే అరుణ గ్రహం లేదా కుజుడు అని కూడా పిలుస్తారు. భూమికి దూరంగా ఉన్నప్పటికీ మన జీవితంపై అంగారకుడి ప్రత్యక్ష ప్రభావం ఉంటుంది. జ్యోతిషశాస్త్రంలో అంగారకుడికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే ఈ గ్రహాన్ని శక్తి, శక్తి కారక గ్రహంగా పరిగణిస్తారు. అంతేకాకుండా క్రూరమైన గ్రహంగా భావిస్తారు. అంగారకుడు గ్రహాల సేనాధిపతిగా పరిగణిస్తారు. జ్యోతిషశాస్త్రం ప్రకారం అంగారకుడు మేషం, వృశ్చిక రాశులకు అధిపతి. సూర్యుడు, చంద్రుడు, బృహస్పతి స్నేహ గ్రహాలుగా, బుధుడిని విరోధి గ్రహంగా భావిస్తారు. శుక్రుడు, శని సాధారణంగా ఉంటారు. పవర్ ఫుల్ గ్రహంగా చెప్పే అంగారకుడు రాశిమారినప్పుడు ఆ ఫ్రభావం అన్ని రాశులపైనా ఉంటుంది. ఆగస్టు 10న వృషభ రాశిలో ప్రవేశించిన కుజుడు అక్టోబరు 16 వరకూ..అంటే..68 రోజుల పాటూ వృషభ రాశిలోనే సంచరిస్తాడు.  అంగారకుడి సంచారం కొన్ని రాశులవారికి మంచి చేస్తే మరికొన్ని రాశులవారు అశుభ ఫలితాలనిస్తుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కుజుడు మంచి స్థానంలో ఉంటే ధైర్యం, విజయం  ఉంటుంది. కుజుడి సంచారం ఏ రాశులవారికి కలిసొస్తుందో ఇక్కడ తెలుసుకోండి

Also Read: నిద్రలేవగానే చాలామంది అరచేతులు చూసుకుని లేస్తారు, ఇది మంచిదా కాదా!

వృషభ రాశి
వృషభరాశిలో కుజుడు సంచారం ఈ రాశివారి అదృష్టాన్నిస్తుంది.  ఆదాయం పెరుగుతుంది. ఈ రాశివారు  శత్రువులపై విజయం సాధిస్తారు. వ్యాపారులకు కలిసొస్తుంది.

కర్కాటక రాశి
అంగారకుడి సంచారం కర్కాటకరాశి వారికి మేలు చేస్తుంది. ఈ రాశి ఉద్యోగులు కెరీర్ లో పురోగతి సాధిస్తారు. సంపద వృద్ధి చెందుతుంది. అప్పుల బారి నుంచి బయటపడతారు. 

సింహ రాశి
కుజుడి సంచారం సింహరాశి వారి లైఫ్ ని మార్చేస్తుంది. ఆర్థిక పురోగతి సాధిస్తారు.ఉద్యోగులు, వ్యాపారులకు కలిసొస్తుంది. నూత పెట్టుబడులకు ఇదే మంచి సమయం.

Also Read: ఈ 5 రాశుల అబ్బాయిలను పెళ్లిచేసుకున్న అమ్మాయిలు అదృష్టవంతులు

ధనుస్సు రాశి 
అంగారక సంచారం ధనస్సు రాశివారికి శుభప్రదంగా ఉంటుంది. మీ ఆదాయం పెరుగుతుంది. మీరు ప్రతి రంగంలోనూ విజయం సాధిస్తారు. 

కుంభ రాశి 
కుంభ రాశి వారికి కుజుడి సంచారం ప్రయోజనకరంగా ఉంటుంది.  వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. కొత్త ఇల్లు లేదా కొత్త వాహనం కొనుగోలు చేస్తారు

Also Read:  వృషభ రాశిలో కుజుడి సంచారం, ఈ 5 రాశులవారికి అన్నీ సవాళ్లే!

కుజుడి అనుగ్రహం కోసం పఠించాల్సిన మంత్రం
‘ధరణీ గర్భ సంభూతం  విద్యుత్కాంతి సమప్రభం
కుమారం శక్తిహస్తం – తం మంగళం ప్రణమామ్యహం’ 

‘లోహితో లోహితాక్షశ్చ సామగానం కృపాకరః ధరాత్మజః కుజో భౌమే
భూమదో భూమి నందనః’ 

కుజుడికి అధిపతి సుబ్రమణ్యస్వామి. అందుకే షష్టిరోజు సుబ్రమణ్యాష్టకం ఏడుసార్లు పారాయణ చేయాలి. ఏడు మంగళ వారాలు ఉపవాసం ఉండి కుజ గాయత్రి మంత్రాన్ని పారాయణం చేసి  చివరి వారం కందులు దానం చేస్తే చాలామంచిదంటారు పండితులు. 

నోట్: ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. పూర్తి వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు. వీటిని ఎంతవరకూ విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం....

Published at : 13 Aug 2022 05:19 PM (IST) Tags: Mars Transit 2022 Transit of Mars in Taurus zodiac signs get problems benifits 2022 Mangal Gochar

సంబంధిత కథనాలు

Tirumala : తిరుమలలో అనూహ్యంగా పెరిగిన భక్తుల రద్దీ, యాత్ర వాయిదా వేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి

Tirumala : తిరుమలలో అనూహ్యంగా పెరిగిన భక్తుల రద్దీ, యాత్ర వాయిదా వేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి

Bheeshma Neeti: ఉన్నత పదవుల్లో ఎవరిని నియమించాలి, ధర్మరాజుకి భీష్ముడు ఏం చెప్పాడంటే!

Bheeshma Neeti: ఉన్నత పదవుల్లో ఎవరిని నియమించాలి, ధర్మరాజుకి భీష్ముడు ఏం చెప్పాడంటే!

Tirumala News: ప్రతి శుక్రవారం శ్రీవారి ఆలయానికి ఆకాశగంగ నుండి పవిత్ర జలాలు, కారణం ఇదే

Tirumala News: ప్రతి శుక్రవారం శ్రీవారి ఆలయానికి ఆకాశగంగ నుండి పవిత్ర జలాలు, కారణం ఇదే

Karwa Chauth Atla Taddi 2022: 'అట్ల తదియ' ఆంతర్యం ఏంటి, మొదటగా ఈ నోము నోచిందెవరు, తప్పనిసరిగా పాటించాల్సిన నియమాలేంటి!

Karwa Chauth Atla Taddi 2022:   'అట్ల తదియ' ఆంతర్యం ఏంటి, మొదటగా ఈ నోము నోచిందెవరు, తప్పనిసరిగా పాటించాల్సిన నియమాలేంటి!

Horoscope Today 7th October 2022: ఈ రాశివారు ఎవరికైనా అప్పిస్తే ఆ డబ్బులు తిరిగి రావు, అక్టోబరు 7 రాశిఫలాలు

Horoscope Today 7th  October 2022:  ఈ రాశివారు ఎవరికైనా అప్పిస్తే ఆ డబ్బులు తిరిగి రావు, అక్టోబరు 7 రాశిఫలాలు

టాప్ స్టోరీస్

Minister Karumuri On BRS : కేసీఆర్ కాదు కదా కేసీఆర్ తాత వచ్చినా మాకేం నష్టం లేదు, మంత్రి కారుమూరి సంచలన వ్యాఖ్యలు

Minister Karumuri On BRS : కేసీఆర్ కాదు కదా కేసీఆర్ తాత వచ్చినా మాకేం నష్టం లేదు, మంత్రి కారుమూరి సంచలన వ్యాఖ్యలు

Hyderabad Metro Rail : మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్, రాత్రి 11 గంటల వరకు సేవలు పొడిగింపు

Hyderabad Metro Rail : మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్, రాత్రి 11 గంటల వరకు సేవలు పొడిగింపు

కార్లకు ఐరన్ బంపర్ గార్డ్స్ పెట్టుకోవడం తప్పు అని మీకు తెలుసా? ఇన్సూరెన్స్ కూడా రాదు!

కార్లకు ఐరన్ బంపర్ గార్డ్స్ పెట్టుకోవడం తప్పు అని మీకు తెలుసా? ఇన్సూరెన్స్ కూడా రాదు!

RBI to Launch Digital Rupee: మరో చరిత్రకు సిద్ధం! అతి త్వరలో డిజిటల్‌ రూపాయి పైలట్‌ ప్రాజెక్ట్‌ ఆరంభం!

RBI to Launch Digital Rupee: మరో చరిత్రకు సిద్ధం! అతి త్వరలో డిజిటల్‌ రూపాయి పైలట్‌ ప్రాజెక్ట్‌ ఆరంభం!