News
News
X

Horoscope Today 18th June 2022:శని సంచారం ఈ రోజు ఈ రాశుల వారికి బాగా కలిసొస్తుంది, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

Horoscope 18th June 2022:ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా మార్పులుంటాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్యులను సంప్రదించాలి

FOLLOW US: 
Share:

2022 జూన్ 18 శనివారం రాశిఫలాలు

ఈరోజు చంద్రుడు మకరరాశిలో ఉన్నాడు, సాయంత్రం 06:45 గంటల తర్వాత కుంభరాశికి వస్తాడు. సూర్యోదయం సమయంలో శ్రవణం నక్షత్రం ఉంటుంది. సూర్యుడు మిథునరాశిలో, బృహస్పతి మీనరాశిలో ఉన్నారు. శని కుంభరాశిలో ఉన్నాడు.మిగిలిన గ్రహాల స్థానాలు అలాగే ఉంటాయి. ఈ రోజు మిథునం మరియు మకర రాశి వారు వ్యాపారంలో విజయం సాధిస్తారు. ఈ రోజు కర్కాటక రాశి మరియు మిధున రాశి వారికి ఉద్యోగంలో కొత్త అవకాశాలు లభిస్తాయి. ఈరోజు కన్యా, కుంభ రాశి వారికి చంద్రుడు, శని సంచారం వల్ల వ్యాపార, ఉద్యోగాల పట్ల శ్రద్ధ పెరుగుతుంది. ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉందో చూద్దా. 

మేషం
ఈ రోజు దశమంలో ఉన్న చంద్రుడు..ఉద్యోగం మారాలి అనుకున్నవారికి మంచి చేస్తాడు. ఆరోగ్యం బావుంటుంది. రోజంతా ఆహ్లాదకరంగా ఉంటారు. వ్యాపారులు లాభాలు పొందుతారు. పోటీపరీక్షలు రాసే విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు. రెండ్, ఆరెంజ్ మీకు కలిసొచ్చే రంగులు.

వృషభం
ఐటీ, బ్యాంకింగ్ రంగాలకు చెందిన ఉద్యోగులకు ఈ రోజు శుభప్రదం. నిన్నటి వరకూ నష్టపోయిన వ్యాపారులు ఈ రోజు పుంజుకుంటారు.విద్యార్థులకు చదువుపై శ్రద్ధ పెరుగుతుంది. కుటుంబంతో సంతోషంగా ఉంటారు. గ్రీన్, బ్లూ మీకు కలిసొచ్చే రంగులు. 

మిథునం
ఈ రోజు మీనరాశిలో బృహస్పతి సంచారం మీకు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగం మారాలి అనుకుంటే ఏ నిర్ణయమైనా జాగ్రత్తగా తీసుకోండి. వ్యాపారం బాగా సాగుతుంది..కొత్త వ్యాపారం ప్రారంభించాలి అనుకునేవారికి మంచి సమయం. బ్లూ, గ్రీన్ మీకు ఈ రోజు కలిసొచ్చే రంగులు.

Also Read:  నిత్యం కలలో పాములు కనిపిస్తున్నాయా, అయితే ఈ ఆలయానికి వెళ్లండి

కర్కాటకం
సూర్యుడు పన్నెండో స్థానంలో, బృహస్పతి తొమ్మిదవ స్థానంలో ఉన్నారు.ఈ రోజు మీకు ఉదయం కన్నా సాయంత్రం సమయం అనుకూల ఫలితాలుంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో బిజీగా ఉంటారు. రెడ్, గ్రీన్ మీకు కలిసొచ్చే రంగులు. అవకాశం ఉంటే అన్నదానం చేయండి.

సింహం
ఈ రాశి నుంచి ఏడో స్థానంలో ఉన్న చంద్రుడు శుభప్రదుడు. పదకొండో స్థానానికి చెందిన సూర్యుడు ఉద్యోగులకు మంచి ఫలితాలనిస్తాడు. కార్యాలయంలో మీ బాధ్యతలు పెరుగుతాయి. దూరప్రాంత ప్రయాణం చేయాలి అనుకునేవారు ప్రయాణం వాయిదా వేసుకోవడం మంచిది. ఎల్లో, ఆరెంజ్ మీకు  కలిసొచ్చే రంగులు.

కన్యా
పదో స్థానంలో ఉన్న సూర్యుడు శుభప్రదుడు. ఏడో స్థానంలో ఉన్న గురుడు కూడా మీకు కలిసొస్తాడు. ఈ ఫలితంగా ఇంటా బయటా అన్నీ విజయాలే. ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులు అందరికీ శుభసమయమే. ఎప్పటి నుంచో చేతికి అందాల్సిన మొత్తం అందుతుంది. ఆంజనేయుడికి ఈ రోజు ఎర్రటి పూలతో పూజచేస్తే మీకున్న ఇతర గ్రహదోషాలు తొలగిపోతాయి.మీకు కలిసొచ్చే రంగులు వయొలెట్, బ్లూ

తుల 
సూర్య, చంద్రుల సంచార స్థానాలు మీకు కలిసొత్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. పోటీ పరీక్షల్లో విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు. ఉద్యోగంలో ప్రోమోషన్ వచ్చే అవకాశం ఉంది. అనవసరంగా మాట్లాడొద్దు..ఎవ్వరి మాటల్లోనూ ఇన్వాల్వ్ కావొద్దు. తల్లిదండ్రుల ఆశీర్వాదం, సహకారం రెండూ మీకుంటాయి. తెలుపు,ఊదా రంగులు మంచివి.

వృశ్చికం
ఎనిమిద ఇంట ఉన్న సూర్యుడి వల్ల మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. బృహస్పతి శుభస్థానంలో ఉండటం వల్ల రాజకీయ నాయకులకు విజయవంతమైన రోజు. స్నేహితుల నుంచి మీకు సహకారం అందుతుంది. వ్యాపారం బాగా సాగుతుంది.ఆర్థిక పరిస్థితి బావుంటుంది. రెడ్, ఎల్లో మీకు కలిసొచ్చే రంగులు.

ధనుస్సు 
మిథున రాశిలో సంచరిస్తున్న సూర్యుడి వల్ల మీకు మంచి ఫలితాలే ఉన్నాయి. కుటుంబంతో సంతోష సమయం గడుపుతారు. ఓ శుభవార్త వింటారు. వ్యాపారంలో పురోగతి ఉంటుంది, కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవచ్చు. భోజనాన్ని నిర్లక్ష్యం చేయకండి. సాంకేతిక రంగంలో ఉన్నవారు మరింత అభివృద్ధి చెందుతారు. విద్యార్థులు చదువుపై మరింత శ్రద్ధ పెట్టాలి. గ్రీన్, బ్లూ మీకు కలిసొచ్చే రంగులు.

మకరం
శని రెండో స్థానంలో సంచరిస్తున్నందున ఈ రాశివారు ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. రాజకీయాల్లో ఉన్నవారికి పురోగతి ఉంటుంది. ఉద్యోగం మార్పు విషయంపై గందరగోళానికి గురవుతారు. ఏదైనా నిర్ణయం తీసుకోవాలి అంటే మీ మనసు చెప్పింది వినండి. ఇంట్లో వాతావరణంలో కూడా చిన్న చిన్న చికాకులుంటాయి. గ్రీన్,వయొలెట్ మీకు కలిసొచ్చే రంగులు. 

Also Read: కృష్ణుడు 36 ఏళ్లలో చనిపోవాలనే గాంధారీ శాపం నెరవేరిందా? కురుక్షేత్రంలో ఏం జరిగింది?

కుంభం
ఈ రాశివారికి గ్రహ సంచారం బావుంది. ఉద్యోగులు పనిని ఎంజాయ్ చేస్తారు. కార్యాలయంలో అంతా మీకు అనుకూల వాతావరణమే ఉంటుంది. వ్యాపారంలో కొత్త పనులు ప్రారంభమవుతాయి. ఈ రాశి నుంచి బృహస్పతి రెండవ స్థానంలో ఉండడం వల్ల మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈ రోజు హనుమంతుడిని పూజిస్తే మంచిది. గ్రీన్, స్కై బ్లూ మీకు శుభప్రదమైన రంగులు.

మీనం
మీన రాశివారికి కూడా గ్రహస్థితి బావుండడంతో వ్యాపారంలో పురోగతి ఉంటుంది.  ధార్మిక కార్యాలపై శ్రద్ధ పెరుగుతుంది. అనుకోకుండా ప్రయాణం చేయాల్సి రావొచ్చు. కుటుంబ వ్యవహారాల్లో ఒత్తిడి ఉంటుంది. విద్యార్థులు చదువుపై దృష్టి సారించాలి. ఉద్యోగులకు శుభసమయం. ఎల్లో, రెడ్ మీకు కలిసొచ్చే రంగులు.

Published at : 18 Jun 2022 05:23 AM (IST) Tags: Horoscope Today 2022 Aaj Ka Rashifal Rasi Phalalu Today 18th June 2022

సంబంధిత కథనాలు

Weekly Horoscope (03-09 April): ఈ రాశులవారు ఈ వారం ఏ విషయంలోనూ తొందరపడొద్దు, ప్రత్యర్థుల విషయంలో జాగ్రత్త!

Weekly Horoscope (03-09 April): ఈ రాశులవారు ఈ వారం ఏ విషయంలోనూ తొందరపడొద్దు, ప్రత్యర్థుల విషయంలో జాగ్రత్త!

వారఫలాలు ( ఏప్రిల్ 03 నుంచి 09 ): ఈ వారం ఈ రాశులవారికి అదృష్టం కలిసొస్తుంది, ఆశించిన పురోగతి సాధిస్తారు

వారఫలాలు ( ఏప్రిల్ 03 నుంచి 09 ): ఈ వారం ఈ రాశులవారికి అదృష్టం కలిసొస్తుంది, ఆశించిన పురోగతి సాధిస్తారు

ఏప్రిల్ 2 రాశిఫలాలు, ఈ రాశివారు ఈ రోజు తీసుకునే నిర్ణయం భవిష్యత్ లో ప్రయోజనకరంగా ఉంటుంది

ఏప్రిల్ 2 రాశిఫలాలు, ఈ రాశివారు ఈ రోజు తీసుకునే నిర్ణయం భవిష్యత్ లో ప్రయోజనకరంగా ఉంటుంది

Tirumala Vasanthotsavam : ఏప్రిల్ 3 నుంచి తిరుమలలో శ్రీవారి వసంతోత్సవాలు, పలు సేవల రద్దు!

Tirumala Vasanthotsavam : ఏప్రిల్ 3 నుంచి తిరుమలలో శ్రీవారి వసంతోత్సవాలు, పలు సేవల రద్దు!

Astrology: మీది ఈ రాశుల్లో ఒకటా- ఇక మీ కష్టాలు తీరినట్టే

Astrology: మీది ఈ రాశుల్లో ఒకటా- ఇక మీ కష్టాలు తీరినట్టే

టాప్ స్టోరీస్

Nara Lokesh: చెప్పేవి నీతులు దోచేవి గుట్టలు, గుడ్‌మార్నింగ్ ధర్మవరం అబద్ధం - ఎమ్మెల్యే కేతిరెడ్డిపై లోకేష్

Nara Lokesh: చెప్పేవి నీతులు దోచేవి గుట్టలు, గుడ్‌మార్నింగ్ ధర్మవరం అబద్ధం - ఎమ్మెల్యే కేతిరెడ్డిపై లోకేష్

MLA Durgam Chinnaiah: ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు వార్నింగ్! మావోయిస్టుల లేఖ కలకలం

MLA Durgam Chinnaiah: ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు వార్నింగ్! మావోయిస్టుల లేఖ కలకలం

IPL Match Hyderabad: హైదరాబాద్‌లో IPL సందడి - టీఎస్ఆర్టీసీ, హైదరాబాద్ మెట్రో కీలక ప్రకటనలు

IPL Match Hyderabad: హైదరాబాద్‌లో IPL సందడి - టీఎస్ఆర్టీసీ, హైదరాబాద్ మెట్రో కీలక ప్రకటనలు

NBK108 OTT Details : రికార్డు రేటుకు బాలకృష్ణ సినిమా ఓటీటీ రైట్స్

NBK108 OTT Details : రికార్డు రేటుకు బాలకృష్ణ సినిమా ఓటీటీ రైట్స్