Horoscope 10th July 2022: ఈ రాశులవారు తెలివితేటల్ని సరిగ్గా ఉపయోగించుకోవాలి, జులై 10 ఆదివారం రాశిఫలాలు
Horoscope 10-07-2022 : ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. పూర్తి వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు…
జులై 10 ఆదివారం రాశిఫలాలు (Horoscope 10-07-2022)
మేషం
మీరు ఈరోజు ప్రయాణం చేయవలసి ఉంటుంది కానీ దాని వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఇంట్లో వృద్ధుల ఆరోగ్యం బలహీనంగా ఉంటుంది. మీ శత్రువుల పట్ల జాగ్రత్త వహించండి. భూమి, ఆస్తికి సంబంధించిన పత్రాలను సురక్షితంగా ఉంచండి. వెంటనే ఎవరినీ నమ్మవద్దు.
వృషభం
మీరు ఉద్యోగాలు మారేందుకు ప్రయత్నించవచ్చు. పెట్టుబడులు పెట్టేందుకు ఇదే సరైన సమయం. అవసరమైన పనులన్నీ సులభంగా పూర్తవుతాయి. నిర్మాణ పనులు వేగవంతమవుతాయి.మీరు మీ కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల గురించి చర్చిస్తారు. ఈ రోజు సాధారణంగా ఉంటుంది.
మిథునం
కొత్త బాధ్యతను స్వీకరించడం వల్ల ఆ ప్రభావం ఇతర పనులపై పడుతుంది. కార్యాలయంలో ఆకస్మికంగా పని ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. యోగా, ధ్యానం చేయడం మంచిది. పెద్దల సలహాలు మేలు చేస్తాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. పిల్లల ప్రవర్తన వల్ల మనసు కలత చెందుతుంది. తెలివైన వ్యక్తుల పట్ల జాగ్రత్త వహించండి. ఆహారం విషయంలో శ్రద్ధ వహించాలి
Also Read: తొలిఏకాదశి శుభాకాంక్షలు చెప్పేయండి ఇలా!
కర్కాటకం
అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. ప్రభుత్వ పనుల్లో ఆటంకాలు ఏర్పడవచ్చు. ఆత్మపరిశీలన చేసుకుంటారు. మీ కృషిని, శక్తిని, తెలివితేటల్ని సరైన మార్గంలో ఉపయోగించండి. ఇతరుల అభిప్రాయాల ఆధారంగా పనిచేయడం సరికాదు. దిగుమతి-ఎగుమతులతో సంబంధం ఉన్న వ్యక్తులు భారీ ద్రవ్య లాభాలను పొందుతారు. విహారయాత్రకు వెళ్లవలసి రావచ్చు. ధనలాభం కలిగే అవకాశం ఉంది.
సింహం
ఈ రోజంతా గందరగోళంగా ఉంటుంది. ఒక పనిని పూర్తి చేయడంలో ఆలస్యం కావచ్చు. బంధువులను కలుస్తారు. ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులు తమ చదువు గురించి భయపడుతూనే ఉంటారు. సీనియర్ అధికారులతో అనుచితంగా ప్రవర్తించవద్దు. ఆయిల్ , స్పైస్ ఫుడ్ తినకూడదు.
కన్య
ముందుగా నిర్ణయించిన పనులు పూర్తి చేస్తారు. వస్తు వనరులు పెరుగుతాయి. ఉద్యోగస్తులు లాంగ్ టూర్ వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. ఇంటి అలంకరణపై దృష్టి సారిస్తారు. ఎవ్వరికీ అప్పులు ఇవ్వొద్దు. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు.
Also Read: జులై 10 తొలి ఏకాదశి, ఈ రోజు ఉపవాసం ఉంటే మంచిదని ఎందుకంటారు!
తులా
ఈరోజు సంతోషకరమైన రోజు అవుతుంది. పిల్లలతో సరదాగా గడుపుతారు. మీ స్ఫూర్తితో మిత్రుని పని పూర్తి అవుతుంది. కుటుంబంలో ఉత్సాహ వాతావరణం ఉంటుంది. కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు పెట్టుబడి నుంచి లాభం పొందుతారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. వివాహ జీవితంలో ప్రేమ, ఉత్సాహం ఉంటాయి.
వృశ్చికం
మీ సంపద పెరుగుతుంది. కార్యాలయంలో అనుకూలత ఉంటుంది. విద్యార్థులు పరీక్షల్లో విజయం సాధించే అవకాశాలున్నాయి. మీరు గతంలో చేసిన కృషికి మంచి ఫలితాలు వస్తాయి. ప్రభుత్వ ఉద్యోగాలు చేసే వారికి ప్రమోషన్ లభిస్తుంది. మీరు మీ పనితీరులో మార్పులు తీసుకురావడానికి ప్రయత్నించవచ్చు. స్త్రీ ద్వేషానికి దూరంగా ఉండండి.
ధనుస్సు
ఈ రోజు ఎవరైనా మిమ్మల్ని గందరగోళానికి గురి చేయవచ్చు. ముఖ్యమైన పని ప్రభావితం అవుతుంది. ఆరోగ్యం క్షీణించవచ్చు. కుటుంబ సభ్యులతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. మీరు పిల్లల గురించి ఆందోళన చెందుతారు. బాధ్యతల ఒత్తిడి ఉంటుంది. ప్రేమ సంబంధాలలో సామరస్యం ఉంటుంది. రిస్క్ తీసుకోవద్దు.
Also Read: గోరింట ఆషాడమాసంలోనే ఎందుకంత ప్రత్యేకం, దీని పుట్టుక వెనుక ఇంత కథ ఉందా!
మకరం
ఈ రోజు మీకు అద్భుతంగా ఉంటుంది. కెరీర్ రంగంలో మంచి సమాచారం పొందుతారు. జీతంలో పెరుగుదల ఉంటుంది. విదేశాల్లో ఉన్న మిత్రులతో చర్చలు ఉంటాయి. మీరు ఉత్సాహంగా ఉంటారు. సమాజంలో మీ ఇమేజ్ అద్భుతంగా ఉంటుంది. తండ్రి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటారు.
కుంభం
వ్యాపారంలో అధిక లాభాలు పొందుతారు. యువకులు పోటీ పరీక్షల్లో అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు. మీరు మీ ఆలోచనలను కుటుంబ సభ్యులతో పంచుకోవచ్చు. కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఏకాంతంలో ఎక్కువ సమయం గడుపుతారు. ఇంట్లో ఆనందం , శాంతి వాతావరణం ఉంటుంది. మీకు ఇష్టమైన వంటకాలను ఆస్వాదిస్తారు.
మీనం
వ్యాపారంలో మార్పులు చేర్పులు చేస్తారు. కొత్త వ్యక్తులను కలుస్తారు. ఇంటా బయటా గౌరవాన్ని పొందుతారు. అవివాహితులకు సంబంధాలు కుదురుతాయి. సబార్డినేట్ ఉద్యోగులతో సత్సంబంధాలు కొనసాగించండి. కఠినంగా మాట్లాడొద్దు. శత్రువుల పట్ల జాగ్రత్త వహించండి. ఎవరైనా మీకు వ్యతిరేకంగా కుట్ర చేయవచ్చు.
Also Read: మీ నక్షత్రం ప్రకారం ఇంటి ఆవరణలో పెంచాల్సినవి .. ఆవరణలో ఉండకూడని చెట్లు ఇవే..