Horoscope 10 August 2022 Rashifal : ఈ రాశులవారు జీవిత భాగస్వామి సహాయంతో స్తిరాస్థిని కొనుగోలు చేస్తారు, ఆగస్టు 10 మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి
Horoscope 10 August : ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. పూర్తి వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు
ఆగస్టు 10 రాశిఫలాలు (Horoscope 10th August 2022)
మేషం
ఈ రోజు మీకు చాలా ఫలవంతంగా ఉంటుంది. మీ బాధ్యతలు మీరు సక్రమంగా నిర్వర్తిస్తారు.తలపెట్టిన పనులు విజయవంతంగా పూర్తిచేస్తారు. ఉద్యోగులు ప్రమోషన్ కి సంబంధించిన సమాచారం వింటారు. మీ సహోద్యోగుల నుంచి కొన్ని అవమానాలు ఎదుర్కోకతప్పదు. వ్యాపారంలో కొత్త భాగస్వాములను చేర్చుకోవచ్చు. విదేశాల్లో చదువుతున్న విద్యార్థుల ఆలోచనంతా ఫ్యామిలీ పైనే ఉంటుంది.
వృషభం
ఈ రోజంతా ఉత్సాహంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో మంచి సమయాన్ని గడుపుతారు. ఏదైనా శుభకార్యం గురించి కుటుంబ సభ్యులతో చర్చిస్తారు.మీ పాత బాధ్యతలలో కొన్నింటిని క్లియర్ చేయడం ద్వారా ఉపశమనం పొందుతారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. మీ నైపుణ్యం , అవగాహనతో మీ పనులన్నింటినీ పూర్తి చేయగలుగుతారు. వ్యాపారం చేసే వ్యక్తులు అకస్మాత్తుగా మంచి సమాచారాన్ని పొందవచ్చు.
మిథునం
ఈ రోజు మీ కోసం కొత్త పురోభివృద్ధి దారులు తెరుచుకుంటాయి.ప్రేమలో ఉన్నవారు వివాహం చేసుకునేందుకు ఇదే మంచిసమయం.మీ పనితీరుతో ఉన్నతాధికారులను మెప్పిస్తారు.వివాహ బంధంలో ఉండే సమస్యను సులభంగా పరిష్కరించుకోండి. లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నిరుద్యోగులు కెరీర్ గురించి ఆలోచించేందుకు ఇదే మంచి సమయం. మీ మనస్సులో ఉన్న కోరిక నెరవేరుతుంది.
Also Read: రక్షా బంధన్ శుభముహూర్తం ఎప్పుడు, రాఖీ ఏ టైమ్ లో కట్టాలి!
కర్కాటకం
ఈ రోజు మీకు ముఖ్యమైన రోజు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పెట్టుబడులు పెట్టడం మంచిది. వివాదాలు సమసిపోతాయి. బాధ్యతాయుతమైన పనిని మీరు అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు. కొత్త వాహనం కొనుగోలుకి మంచి సమయం. తల్లిదండ్రుల దీవెనలు మీపై ఉంటాయి. మీ మాట ఇంట్లోవారికి భరోనానిస్తుంది.
సింహం
కొత్త ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వ్యక్తులకు ఈ రోజు మంచిది. మీ ఆర్థిక స్థితి గతం కంటే బలంగా ఉంటుంది. మీరు మీ తల్లి వైపు నుంచి ద్రవ్య ప్రయోజనాలు పొందుతారు. ఎవరి మాటలను మనసుకి తీసుకోకండి..లేదంటే ఇందులోనే మునిగిపోతారు. అనుకున్న ప్రకారం మీపనిని పూర్తిచేస్తారు. ఈ రోజు విద్యార్థులు తమ విద్యలో ఎదురయ్యే ఏ సమస్యనైనా ఉపాధ్యాయులకు చెప్పి పరిష్కారం చేసుకుంటారు.
కన్య
ఈ రోజు మీ ఆదాయం తక్కువగా ఉండడంతో మీ ఖర్చుల గురించి ఆందోళన చెందుతారు. మీ జీవిత భాగస్వామి సహాయంతో స్తిరాస్థిని కొనుగోలు చేస్తారు. మీ సమయాన్ని తెలివిగా ఉపయోగించకపోతే కొన్ని అవకాశాలు చేజారిపోతాయి. ఎప్పటి నుంచో వెంటాడుతున్న ఆర్థిక సమస్యలు తీరుతాయి.
Also Read: యుగ యుగాలను దాటుకుని వచ్చిన రాఖీ పౌర్ణమి , మొదటి రాఖీ ఎవరు ఎవరికి కట్టారంటే!
తుల
వ్యాపారం చేసే వ్యక్తులకు ఈ రోజు బాగానే ఉంటుంది. ప్రయోజనాలు మనస్సుకు అనుగుణంగా వస్తున్నట్టు అనిపిస్తుంది. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది.కొన్ని ప్రభుత్వ నియమాలను పాటించడం వల్ల వ్యాపారులు సమస్యలు ఎదుర్కొంటారు. మీ జీవిత భాగస్వామి సలహాను పాటించడం ద్వారా మీరు ఏ పని చేసినా తప్పకుండా విజయం సాధిస్తారు. సోషల్ మీడియా ద్వారా కొంతమంది కొత్త స్నేహితులను సంపాదించుకోగలుగుతారు. ఎవ్వరికీ అప్పు ఇవ్వొద్దు.
వృశ్చికం
ఈ రోజు మీకు ధనలాభం ఉంటుంది. కార్యాలయంలో కొత్త ప్రాజెక్ట్‌లో పని చేయడంలో చాలా సంతోషంగా ఉంటారు. పెళ్లికానివారికి మంచి సంబంధాలు వస్తాయి. స్నేహితులను కలుస్తారు. తల్లిదండ్రులతో సంతోషంగా ఉంటారు.వ్యాపారం బాగానే సాగుతుంది., మీ మనస్సులో వచ్చిన కొత్త ఆలోచనలను అమలుచేయడం మంచిది.
ధనస్సు
ఈ రోజు కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. కొన్ని రోజులుగా వెంటాడుతున్న మానసిక గందరగోళం తొలగిపోతుంది. పూర్తిస్థాయిలో పనులపై దృష్టిసారిస్తారు. బ్యాంకింగ్ రంగంలో పనిచేసే వ్యక్తులు పెద్ద పదవిని పొందుతారు. మీ మనస్సులో సానుకూల ఆలోచనలను ఉంచడం ద్వారా ప్రయోజనం పొందుతారు. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ పెరుగుతుంది. పెండింగ్ పనులు పూర్తిచేసేందుకు ఇదే మంచిసమయం.
Also Read: రక్షా బంధన్ కుడిచేతికి కట్టడం వెనుకున్న ఆధ్యాత్మిక, శాస్త్రీయ కారణాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు
మకరం
మీ ధైర్యం, శక్తి పెరుగుతుంది. మీరు మీ పనిలో బిజీగా ఉన్నప్పటికీ కుటుంబ సభ్యుల కోసం కొంత సమయం కేటాయించగలరు. మీరు గతంలో చేసిన తప్పులకు పశ్చాత్తాపపడతారు. ఉద్యోగులు తమ మాటలతో సహోద్యోగులను ఆకట్టుకుంటారు.
కుంభం
ఈ రోజు మీకు మంచి రోజు. ఆన్‌లైన్‌లో వ్యాపారం చేసే వ్యక్తులు లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఆదాయాన్ని పెంచుకోవడానికి కొన్ని ఇతర మార్గాలను కూడా వెతుక్కుంటారు. కెరీర్‌లో ఎదురవుతున్న సమస్యల గురించి పిల్లలు తల్లిదండ్రులతో మాట్లాడడం మంచిది. ఆనందంగా ఉంటారు
మీనం
వ్యాపారం చేసే వారికి ఈరోజు ప్రత్యేకంగా ఉంటుంది. వ్యాపారంలో సోదరులు, సోదరీమణుల సహకారం ఉంటుంది. స్నేహితుల సహాయంతో కష్టమైన పనిని సులభంగా పూర్తిచేయగలుగుతారు. కుటుంబ సంతోషం పెరుగుతుంది. కానీ ఎక్కువ లాభం పొందాలనే తపనతో మీరు తప్పుడు మార్గం వైపు అడుగువేయవద్దు. విద్యార్థులు కష్టానికి తగిన ఫలితం పొందుతారు.