Karthika Masam 2025: కార్తీకమాసం మొదటిరోజు సాయంత్రం ఈ పూజ చేయండి.. శ్రీ కృష్ణుడు మీ వెంట ఉండి నడిపిస్తాడు!
Govardhan Puja 2025: ఏటా ఆశ్వయుజమాసం అమావాస్య రోజు దీపావళి జరుపుకున్నాక..మరుసటి రోజు కార్తిక శుక్ల పాడ్యమి రోజు గోవర్థన పూజ చేస్తారు. ఈ పూజ ప్రాముఖ్యత, పూజా విధానం ఏంటో తెలుసుకోండి

Karthika Masam 2025: ఏటా దీపావళి పండుగ జరుపుకున్న మర్నాడు గోవర్థన పూజ చేస్తారు. కానీ ఈ ఏడాది అమావాస్య తిథి తగులు మిగులు వచ్చింది. రాత్రికి అమావాస్య ఉన్నరోజున దీపావళి జరుపుకున్నాం. మర్నాడు అక్టోబరు 21 మంగళవారం సూర్యోదయానికి అమావాస్య తిథి ఉండడంతో ఈ రోజు కూడ అమావాస్య గానే పరిగణిస్తారు. పైగా కార్తీకమాసం పాడ్యమి తిథి సూర్యోదయ సయమానికి ఉండడం ప్రధానం. అందుకే అక్టోబర్ 20 సోమవారం దీపావళి జరుపుకున్నా...అక్టోబరు 22 బుధవారం కార్తీకమాసం ప్రారంభమైంది. కార్తీకమాసం మొదటిరోజు గోవర్థన పూజ చేస్తారు. ఈరోజు వేకువజామున చేయడం కుదరకపోతే..సాయంత్రం అయినా గోవర్థన పూజ ఆచరించొచ్చు. గోవర్థన్ పూజను కొన్ని ప్రాంతాల్లో అన్నకూట్ అని కూడా పిలుస్తారు. ఈ రోజు 56 రకాల నైవేద్యాలు సమర్పిస్తారు.
గోవర్థన పూజ వెనుకున్న సందర్భం?
శ్రీ కృష్ణుడి పట్ల రేపల్లె ప్రజలకు ఉన్న భక్తిని చూసి సహించలేకపోయిన దేవేంద్రుడు...రేపల్లె ప్రజలపై రాళ్లవర్షం కురిపిస్తాడు. ఆ సమయంలో గోవులను, రేపల్లె ప్రజలను రక్షించేందుకు శ్రీ కృష్ణుడు తన చిటికెన వేలుపై గోవర్థన గిరిని పైకెత్తి పట్టుకున్నాడు. ఆ రోజే కార్తీక శుక్ల పాడ్యమి. అందుకే ఈ రోజు శ్రీ కృష్ణుడికి, గోవర్థనగిరికి, గోవులకు పూజ చేస్తారు. ఈ పూజ బంధం, ఆత్మీయత, భక్తి, ప్రకృతి ఆరాధనకు చిహ్నంగా చెబుతారు
గోవర్థన పూజా విధానం?
గోవర్ధన పూజ చేయాలని మీరు అనుకుంటే... ముందుగా ఆవుపేడను పర్వతంలా తయారుచేయండి. ఆ పక్కనే శ్రీ కృష్ణుడి ఫొటో, ఆవు బొమ్మను ఉంచండి. నువ్వుల నూనె లేదా నేతితో దీపం వెలిగించండి. పసుపు, చందనం, కుంకుమ సమర్పించి పూజచేయండి. శ్రీ కృష్ణుడికి తియ్యటి పదార్థాలు నివేదించండి. ఈ రోజు శ్రీ కృష్ణాష్టకం, శ్రీ కృష్ణ అష్టోత్తర శతనామావళి చదువుకోవాలి. అనంతరం నైవేద్యం సమర్పించి.. గోవర్థనగిరి కథ చదువుకోవాలి
గోవర్ధన పూజ ఎందుకు?
ఏ ఇంట్లో గోవర్ధన పూజ చేస్తారో ఆ ఇంట సంతోషం వెల్లివిరుస్తుంది. శ్రీ కృష్ణుడు ఆరాధ్యుడు మాత్రమే కాదు..గురువు. అందుకే కృష్ణం వందే జగద్గురుం ఉంటారు. భగవంతుడిగా కాదు..గురువుగా మీ వెంట ఉండి నడిపిస్తాడు శ్రీ కృష్ణుడు. గోవర్థన పూజ చేయడం వల్ల మీ జీవితంలో ఎదురయ్యే కష్టాలు, బాధల నుంచి ఉపశమనం లభిస్తుందని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతారు
కృష్ణాష్టకం
వసుదేవ సుతం దేవం కంస చాణూర మర్దనమ్ ।
దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుమ్ ॥
అతసీ పుష్ప సంకాశం హార నూపుర శోభితమ్ ।
రత్న కంకణ కేయూరం కృష్ణం వందే జగద్గురుమ్ ॥
కుటిలాలక సంయుక్తం పూర్ణచంద్ర నిభాననమ్ ।
విలసత్ కుండలధరం కృష్ణం వందే జగద్గురమ్ ॥
మందార గంధ సంయుక్తం చారుహాసం చతుర్భుజమ్ ।
బర్హి పింఛావ చూడాంగం కృష్ణం వందే జగద్గురుమ్ ॥
ఉత్ఫుల్ల పద్మపత్రాక్షం నీల జీమూత సన్నిభమ్ ।
యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుమ్ ॥
రుక్మిణీ కేళి సంయుక్తం పీతాంబర సుశోభితమ్ ।
అవాప్త తులసీ గంధం కృష్ణం వందే జగద్గురుమ్ ॥
గోపికానాం కుచద్వంద కుంకుమాంకిత వక్షసమ్ ।
శ్రీనికేతం మహేష్వాసం కృష్ణం వందే జగద్గురుమ్ ॥
శ్రీవత్సాంకం మహోరస్కం వనమాలా విరాజితమ్ ।
శంఖచక్ర ధరం దేవం కృష్ణం వందే జగద్గురుమ్ ॥
కృష్ణాష్టక మిదం పుణ్యం ప్రాతరుత్థాయ యః పఠేత్ ।
కోటిజన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి ॥
గమనిక: జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పినవి, పుస్తకాల నుంచి సేకరించి రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.
కార్తీకమాసం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు, కార్తీక పౌర్ణమి సహా ముఖ్యమైన రోజులివే!
అరుణాచలంలో కార్తీక శోభ - గిరిప్రదక్షిణ అంటే అలా తిరిగేసి వచ్చేయడం కాదు ఈ 44 ఎనర్జీ పాయింట్స్ చూడాల్సిందే!
ఆలయం నుంచి వరుసగా 17వ ఎనర్జీ పాయింట్ వరకూ వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
18వ ఎనర్జీ పాయింట్ నుంచి 44వ ఎనర్జీ పాయింట్ వరకూ వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి






















