Bhai Dooj 2025: ఉత్తరాదిన భాయ్ దూజ్ - దక్షిణాదిన యమద్వితీయ.. ఈ రోజు (అక్టోబర్ 23) విశిష్టత , పూజా విధానం తెలుసుకోండి
భాయ్ దూజ్ నాడు రాశి ప్రకారం బహుమతులు ఇవ్వడం వల్ల సోదర, సోదరీమణుల బంధం బలపడుతుంది, జీవితంలో సుఖసంతోషాలు వస్తాయి.

Bhai Dooj 2025: ప్రేమ, నమ్మకం, పవిత్రమైన బంధానికి చిహ్నంగా భావించే భాయ్ దూజ్ ఈ సంవత్సరం అక్టోబర్ 23 బుధవారం జరుపుకుంటారు. కార్తీక మాసం శుక్ల పక్ష ద్వితీయ తిథి అక్టోబర్ 22 రాత్రి 8:17 గంటలకు ప్రారంభమై అక్టోబర్ 23 రాత్రి 10:47 గంటల వరకు ఉంటుంది. ఉదయ తిథి అక్టోబర్ 23న ఉండటం వల్ల భాయ్ దూజ్ లేదా యమ ద్వితీయ ఈ రోజే జరుపుకుంటారు.
ఈ సంవత్సరం ఈ పండుగ రోజు ఆయుష్మాన్ యోగం, సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడిన శుభ సందర్భంలో వస్తుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ యోగంలో చేసే ధార్మిక కార్యాలు విశేష ఫలితాలను ఇస్తాయి. ఈ కలయిక సోదరుడి దీర్ఘాయువు, ఉత్తమ ఆరోగ్యం, శ్రేయస్సును సూచిస్తుంది.
ఉత్తరాదిన భాయ్ దూజ్..దక్షిణాదిన యమద్వితీయ అంటారు.
పురాణాల ప్రకారం సూర్యుని కుమార్తె యమున ఈ రోజున తన సోదరుడు యమధర్మరాజుకి భోజనం పెట్టి, తిలకం దిద్ది దీర్ఘాయువును ఆశీర్వదించింది. అప్పటి నుంచి ఈ పండుగ సోదర సోదరీమణుల ప్రేమకు చిహ్నంగా మారింది. ఈ రోజున సోదరీమణులు ఉపవాసం ఉండి పూజలు చేస్తారు. సోదరుల దీర్ఘాయువు కోసం ప్రార్థిస్తారు. సోదరులు కూడా రక్షణ ఇస్తానని వాగ్దానం చేసి సోదరీమణులకు బహుమతులు ఇస్తారు. ధనత్రయోదశి రోజు ఎవరైనా యమదీపం వెలిగించడం మర్చిపోతే, వారు ఈ రోజున యమధర్మరాజు పేరు మీద దీపం వెలిగించవచ్చు. సాయంత్రం సమయంలో తొమ్మిది దీపాలు వెలిగించి తొమ్మిది గ్రహాల అనుగ్రహం కోసం ప్రార్థించడం శుభప్రదంగా భావిస్తారు.
శుభ ముహూర్తం - పూజా విధానం
భాయ్ దూజ్ పూజ కోసం అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:15 నుంచి 1:30 వరకు ఉంటుంది. దీనితో పాటు, సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు శుభ చౌఘడియా సమయం కూడా ఉత్తమంగా ఉంటుంది. ఈ సమయంలో తిలకం దిద్ది పూజలు చేయడం ఉత్తమం. సోదరీమణులు ఈ రోజున తమ సోదరుల దీర్ఘాయువు , సుఖమయ జీవితం కోసం ఆకుపచ్చ రంగు రుమాలు లేదా వస్త్రంలో మూడు గుప్పెళ్ళ నిండా పెసలు, ఒక యాలకులు, ఒక లవంగం, ఐదు గోమతి చక్రాలు మరియు కొద్దిగా దూర్వాలను కట్టి మూడు ముడులు వేయాలి. దానిని సోదరుడిపై ఏడుసార్లు తిప్పి ఇంటి ఈశాన్య దిశలో ఉంచి ఈ క్రింది మంత్రాన్ని 11 లేదా 21 సార్లు జపించాలి
“గంగా పూజే యమునా కో
యమీ పూజే యమరాజ్ కో
సుభద్ర పూజే కృష్ణ కో
జ్యోం-జ్యోం గంగా యమునా నీర్ బహే
మేరే భాయీ కీ ఆయు బఢే, ఫలే-ఫూలే
అనంతరం ఆ మూటను రావి చెట్టు దగ్గర వేయాలి.
సూర్యాస్తమ సమయంలో యమధర్మరాజు పేరుమీద చతుర్ముఖ దీపాన్ని ఇంటి గుమ్మానికి వెలిగించడం శుభప్రదంగా భావిస్తారు. దీనివల్ల సోదరుడి జీవితంలో స్థిరత్వం ,అడ్డంకులు లేని పురోగతి లభిస్తుందని నమ్ముతారు.
ధనం, శ్రేయస్సు కోసం చర్యలు
ఈ రోజున సోదర, సోదరీమణులు కలిసి ఆర్థికాభివృద్ధి కోసం 5 గోమతి చక్రాలపై కుంకుమ , చందనంతో ‘శ్రీం హ్రీం శ్రీ’ అని రాసి పూజించాలి. పూజ తర్వాత వాటిని బీరువాలో లేదా ధనం ఉంచే స్థలంలో ఉంచండి. నకారాత్మకతను తొలగించడానికి, సోదరుడి తల నుంచి పాదాల వరకు ఏడుసార్లు వ్యతిరేక దిశలో తిప్పి, కూడలిలో వేయండి. ఇది చెడు శక్తులను దూరం చేస్తుంది.. ఇంట్లో సానుకూల శక్తిని పెంచుతుంది.
రాశి ప్రకారం భాయ్ దూజ్ బహుమతి సూచనలు
భాయ్ దూజ్ రోజు మీ రాశి ప్రకారం సోదరుడుకి ఈ బహుమతి ఇవ్వండి
మేష రాశి
ఎరుపు రంగు వస్తువును ఇవ్వడం వల్ల సోదర, సోదరీమణుల బంధంలో ఉత్సాహం పెరుగుతుంది.
వృషభ రాశి
తెలుపు రంగు వస్తువు లేదా మిఠాయిలను బహుమతిగా ఇవ్వడం వల్ల ప్రేమ కొనసాగుతుంది
మిథున రాశి
ఆకుపచ్చ మొక్కను బహుమతిగా ఇవ్వడం వల్ల సంబంధంలో కొత్త శక్తి వస్తుంది.
కర్కాటక రాశి
స్టడీ మెటీరియల్ ఇవ్వడం వల్ల సోదరుడి జ్ఞానం , విజయం పెరుగుతుంది.
సింహ రాశి
ఎరుపు రంగు దుస్తులు బహుమతిగా ఇవ్వడం వల్ల ఆత్మవిశ్వాసం, ప్రేమ రెండూ బలపడతాయి.
కన్యా రాశి
బంగారం, వెండి లేదా వజ్రాలతో చేసిన బహుమతి శ్రేయస్సు అదృష్టానికి చిహ్నం.
వృశ్చిక రాశి
మెరూన్ రంగు దుస్తులు లేదా షోపీస్ ఇవ్వడం వల్ల సంబంధంలో స్థిరత్వం , అనుబంధం పెరుగుతుంది.
ధనుస్సు రాశి
బంగారం, వెండి వస్తువులు లేదా చాక్లెట్లు ఇవ్వడం వల్ల ఆనందం , ఆప్యాయత పెరుగుతాయి.
మకర రాశి
ఉన్ని దుస్తులు బహుమతిగా ఇవ్వడం వల్ల భద్రత పెరుగుతుంది
కుంభ రాశి
పసుపు రంగు దుస్తులు ఇవ్వడం వల్ల జీవితంలో ఉత్సాహం , సానుకూలత వస్తాయి.
మీన రాశి
నీలం రంగు దుస్తులు ఇవ్వడం వల్ల బంధంలో నమ్మకం పెరుగుతుంది
ఏ బహుమతి అయినా ఇవ్వొచ్చు.. మీ రాశి ప్రకారం ఇస్తే మరింత శుభప్రదం అని అంటారు జ్యోతిష్య శాస్త్ర పండితులు
గమనిక: జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పినవి, పుస్తకాల నుంచి సేకరించి రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకంలో ఉండే గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు మార్పులుంటాయి.






















