స్త్రీలు శివలింగాన్ని ముట్టుకోవడం అశుభమా?
చాలామంది స్త్రీలకు ఈ సందేహం ఉంటుంది
ఈ ప్రశ్నకు సమధానం స్పష్టంగా చెబుతున్నారు వేదపండితులు..
ఇవన్నీ తెలిసీ తెలియక చెప్పే మాటలు..కొత్తగా పుట్టించినవే కానీ వాస్తవం కాదు
అక్కమహాదేవి శివార్చన చేశారు
పార్వతీదేవి నేరుగా శివార్చన చేసింది
నిస్సందేహంగా స్త్రీలు శివార్చన చేసుకోవచ్చు
శివలింగానికి పూజ చేసేటప్పుడు లింగభేదం కన్నా భక్తి ముఖ్యం అంటారు ఆధ్యాత్మిక గురువులు
శివరాత్రి, కార్తీకమాసంలో స్త్రీలు భక్తిపూర్వకంగా శివార్చన చేసుకోవచ్చు