అన్వేషించండి

సైన్స్ vs ఆధ్యాత్మికత : మంచోళ్లు త్వరగా చనిపోవడం వెనుక అసలు రహస్యం!

Science vs Spirituality: మంచోళ్లే తొందరగా చనిపోతారు ఎందుకో అనే మాట చాలాకాలంగా వినే భావోద్వేగపూరితమైన నమ్మకం. ఇంతకీ ఇది నిజమేనా? మంచోళ్లే త్వరగా చనిపోతారా? అందుకు కారణం ఏంటి?

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • మంచివారు తమ కర్మలు పూర్తిచేసి లోకాన్ని త్వరగా వీడుతారు.
  • భగవంతుడు ప్రేమతో తన ప్రియమైన వారిని త్వరగా తీసుకుంటాడు.
  • మరణం జన్యువులు, ఆరోగ్య అలవాట్లు, అనారోగ్య కారణాలపై ఆధారపడుతుంది.
  • మంచివారు లేకున్నా, వారి పనులు, ప్రేమ ఎప్పటికీ నిలిచిపోతాయి.

Karma Scientific Reality: ఎవరైనా మంచి వ్యక్తి చిన్న వయసులో లేదా అకస్మాత్తుగా మరణిస్తే ఆ బాధ నుంచి పుట్టిన మాటే.. మంచోళ్లే ఎందుకు త్వరగా చనిపోతారో అని. ఇంతకీ ఈ మాట నిజమేనా?
 
నిత్యం ఎంతోమంది చనిపోతుంటారు. ఓ సాధారణ వ్యక్తి లేదా చెడ్డ వ్యక్తి చనిపోయినప్పుడు ఎవ్వరూ అంతగా పట్టించుకోరు. కానీ సమాజంలో పేరు ప్రతిష్టలు ఉన్నవారో, సేవ చేసేవారో, అందరితో ప్రేమగా ఉండేవారో మరణిస్తే ఆ లోటు స్పష్టంగా తెలుస్తుంది. ఆ బాధ మనసులో బలంగా ముద్ర పడిపోతుంది. మంచివ్యక్తి కదా..ఇంకొంత కాలం బతికి ఉంటే బావుండును అనిపిస్తుంది. ఆ బాధ నుంచి వచ్చిన మాటే మంచోళ్లే ఎందుకు త్వరగా చనిపోతారో అని. పైగా మంచివారు..తమ స్వార్థం తాము చూసుకోరు, ఎదుటివారి బాగుకోసం తాపత్రయపడతారు, తనచుట్టూ ఉండేవారు బావుండాలని ఆలోచిస్తారు. ఈ తీవ్రమైన ఒత్తిడి వారి ఆరోగ్యంపై, గుండెపై ప్రభావం చూపించే అవకాశం ఉంది.  

ఏ రోజు తలస్నానం చేయకూడదు? జుట్టుకు సంబంధించిన ముఖ్యమైన జ్యోతిష్య నియమాలు, నమ్మకాలు తెలుసుకోండి !

ఆధ్యాత్మిక కోణంలో పరిశీలిస్తే.. వివిధ మతాలు, పురాణాల ప్రకారం దీనికి కొన్ని వివరణలున్నాయి. ముఖ్యంగా కర్మ సిద్ధాంతం గురించి చెబుతారు. హిందూ శాస్త్రాల ప్రకారం ప్రతి జీవికి ఓ మిషన్ ఉంటుంది. మంచి వ్యక్తి తన కర్మలను ముగించి ఈ జన్మలో ఎక్కువ పుణ్యం సమకూర్చుకుంటే ఆత్మ ఉన్నత స్థాయికి చేరుకుంటుంది. ఈ భూమిపై తాము చేయాల్సిన మంచి పనులు ఎంత త్వరగా పూర్తైతే అంత త్వరగా మంచివారు లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోతారట. ఇంకా ఆచరించాల్సిన కర్మలు మిగిలిపోతే ...అవి తీరేవరకూ భూమ్మీద ఉండాల్సిందే. మంచి కర్మలు పూర్తిచేసేస్తే వారు ఈ లోకాన్ని వీడి ఉత్తమ లోకాలకు చేరుకుంటారని నమ్ముతారు. పాపాత్ములు కర్మలు ముగియకపోవడం వల్ల ఇక్కడే ఉండిపోతారు..ఇది శిక్ష కూడా కావొచ్చు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్టు శరీరం కేవలం దుస్తులు లాంటిది..ఆత్మ అమరమైనది.  

బాధలో, కష్టంలో ఉన్నప్పుడు 'భగవద్గీత' ఎందుకు చదవమంటారు!

రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, సాధ్వి శారదా మాత లాంటి వారు చెప్పిన ప్రకారం.. భగవంతుడు తనకు అత్యంత ప్రీతిపాత్రులైన వారిని త్వరగా తనవద్దకు తీసుకుంటాడు. ఇది శిక్ష కాదు..ఆ ఆత్మపై ఉన్న అపారమైన ప్రేమ. మంచి వ్యక్తి ఈ లోకంలో కల్మషం, బాధలు ఎక్కువకాలం చూడకుండా రక్షణ పొందుతాడు. కొందరు మహానుభావులు తమ జీవితంలో ఓ సందేశం ఇచ్చి వెళతారు. వారి మరణం కూడా లోకాన్ని ఆలోచింపజేస్తుంది. స్వామి వివేకానంద 39ఏళ్లకే మరణించారు. రామకృష్ణ పరమహంస 49 ఏళ్లు, జ్ఞానేశ్వర్ మహారాజ్ 21 ఏళ్లు..ఇలా చిన్న వయసులోనే వెళ్లిపోయినా శాశ్వత ప్రభావం చూపించారు. వారి జీవితాలు పరిణానం కాదు నాణ్యతను చూపిస్తాయ్.  

ఇందులో సైంటిఫిక్ రియాల్టీ ఏంటంటే.. మరణం అనేది ఓ వ్యక్తి మంచి, చెడుమీద ఆధారపడి ఉండదు. అది పూర్తిగా జన్యుపరమైన కారణాలు, ఆరోగ్య అలవాట్లు, ప్రమాదాలు, అనారోగ్య సమస్యలపై ఆధారపడి ఉంటుంది. చెడ్డవారు కూడా తొందరగా మరణించిన వారున్నారు కానీ.. వారి మరణాన్ని గుర్తించం..ఎందుకంటే వారు చేసే కర్మలే అందుకు కారణం. వారి లేని లోటు తెలియకపోవడం మరో కారణం కావొచ్చు.  మంచివారు మనమధ్య లేకపోయినా వారు చేసిన మంచి పనులు, పంచిన ప్రేమ ఎప్పటికీ మిగిలే ఉంటుంది. అందుకే మంచి కర్మలే ఆచరించాలని భగవద్గీతలో శ్రీ కృష్ణుడు బోధించాడు.

గమనిక: ఆధ్యాత్మికవేత్తలు సూచించిన వివరాలు, ఆధ్యాత్మిక గ్రంధాల్లో పొందుపరిచిన సమాచారం ఆధారంగా అందించిన కథనం ఇది. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.  దీనిని అనుసరించేముందు మీరు విశ్వశించే పండితుల సలహాలు స్వీకరించగలరు. 

Frequently Asked Questions

మంచోళ్లు ఎందుకు త్వరగా చనిపోతారని అంటారు?

సమాజంలో పేరు ప్రఖ్యాతులున్నవారు లేదా సేవ చేసేవారు చనిపోతే వారి లోటు స్పష్టంగా కనిపిస్తుంది. ఎదుటివారి బాగుకోసం తాపత్రయపడటం వల్ల ఒత్తిడి పెరిగి ఆరోగ్యంపై ప్రభావం చూపవచ్చు.

కర్మ సిద్ధాంతం ప్రకారం మంచివారు త్వరగా మరణించడానికి కారణం ఏమిటి?

హిందూ శాస్త్రాల ప్రకారం, మంచివారు తమ కర్మలను త్వరగా ముగించి, ఎక్కువ పుణ్యం సంపాదించుకుంటే, ఆత్మ ఉన్నత స్థాయికి చేరుకుంటుంది. అందుకే వారు లోకాన్ని వీడి వెళ్లిపోతారని నమ్ముతారు.

ఆధ్యాత్మిక కోణంలో, దేవుడు మంచివారిని ఎందుకు త్వరగా తనవద్దకు తీసుకుంటాడు?

భగవంతుడు తనకు అత్యంత ప్రీతిపాత్రులైన వారిని త్వరగా తనవద్దకు తీసుకుంటారని ఆధ్యాత్మికవేత్తలు చెబుతారు. ఇది ఆ ఆత్మపై ఉన్న అపారమైన ప్రేమగా, లోకంలోని బాధలు, కల్మషం చూడకుండా రక్షణ కల్పించడంగా భావిస్తారు.

మంచివారు త్వరగా చనిపోవడానికి శాస్త్రీయ కారణాలు ఏమైనా ఉన్నాయా?

మరణం ఒక వ్యక్తి మంచి, చెడు మీద ఆధారపడి ఉండదు. ఇది పూర్తిగా జన్యుపరమైన కారణాలు, ఆరోగ్య అలవాట్లు, ప్రమాదాలు, అనారోగ్య సమస్యలపై ఆధారపడి ఉంటుంది.

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

మంగళ గౌరీ వ్రత కథ: శ్రావణ మంగళవారం గౌరీ దేవి పూజ సమయంలో ఈ కథ తప్పనిసరిగా చదువుకోవాలి!
మంగళ గౌరీ వ్రత కథ: శ్రావణ మంగళవారం గౌరీ దేవి పూజ సమయంలో ఈ కథ తప్పనిసరిగా చదువుకోవాలి!
శ్రావణ మంగళగౌరీ పూజ 2026: పూజా సామగ్రి, సులువైన పూజావిధానం తెలుసుకోండి!
శ్రావణ మంగళగౌరీ పూజ 2026: పూజా సామగ్రి, సులువైన పూజావిధానం తెలుసుకోండి!
13-08-2026 గురువారం మీ రాశిఫలాలు!
13-08-2026 గురువారం మీ రాశిఫలాలు!
Solar Eclipse 2026: మొబైల్, టీవీలో ప్రత్యక్ష సూర్యగ్రహణాన్ని చూసినా నియమాలు పాటించాలా? తర్వాత స్నానం చేయలా?
మొబైల్, టీవీలో ప్రత్యక్ష సూర్యగ్రహణాన్ని చూసినా నియమాలు పాటించాలా? తర్వాత స్నానం చేయలా?
Advertisement

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
Adilabad Latest News: సీసీఐ పరిశ్రమపై జెన్ జీల పోరాటం- ముందే మేల్కోవాలని ముఖ్యమంత్రికి ప్రొఫెసర్ కాశీం సూచన 
సీసీఐ పరిశ్రమపై జెన్ జీల పోరాటం- ముందే మేల్కోవాలని ముఖ్యమంత్రికి ప్రొఫెసర్ కాశీం సూచన 
Telangana High Court: కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై తెలంగాణ హైకోర్టు స్టే.. కారణం ఏంటంటే..
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై తెలంగాణ హైకోర్టు స్టే.. కారణం ఏంటంటే..
మంగళ గౌరీ వ్రత కథ: శ్రావణ మంగళవారం గౌరీ దేవి పూజ సమయంలో ఈ కథ తప్పనిసరిగా చదువుకోవాలి!
మంగళ గౌరీ వ్రత కథ: శ్రావణ మంగళవారం గౌరీ దేవి పూజ సమయంలో ఈ కథ తప్పనిసరిగా చదువుకోవాలి!
Agri Gold Victims: అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేసే దిశగా ప్రభుత్వం - ఆస్తులు వేలం వేసి చెల్లింపులు - ఆటంకాలు లేకుండా పూర్తి చేయగలరా?
అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేసే దిశగా ప్రభుత్వం - ఆస్తులు వేలం వేసి చెల్లింపులు - ఆటంకాలు లేకుండా పూర్తి చేయగలరా?
Karthika Deepam 2 Serial Today August 13th: కార్తీకదీపం 2 సీరియల్: రెస్టారెంట్ ఎవరిది? మాలిని 5 లక్షలు ఆఫర్! జ్యోత్స్న నిర్ణయమేంటి?
కార్తీకదీపం 2 సీరియల్: రెస్టారెంట్ కోసం బిగ్ ఫైట్? మాలిని 5 లక్షలు ఆఫర్! జ్యోత్స్న నిర్ణయమేంటి?
Embed widget