Ghosts Temple: ఒక్కరాత్రిలో దెయ్యాలు కట్టిన ఆలయం, అసలు విషయం తెలిస్తే అవాక్కవుతారు

దెయ్యాలు వేదాలు వల్లించినట్టు అనే సామెత వాడుతుంటారు. అంటే అది సాధ్యంకాని పని అని అర్థం. మరి ఆ దెయ్యాలే ఏకంగా గుడిని కడితే.. అయినా దేవుడున్న దగ్గర దెయ్యాలు ఉండవంటారు కదా మరి గుడి ఎలా కట్టాయి.

FOLLOW US: 

ఈ వార్తని నమ్మాలి అంటే ముందు దెయ్యాలు ఉన్నాయని నమ్మాలి. ఎందుకంటే దేవుడున్నాడని విశ్వశించారంటే దెయ్యాలు కూడా ఉన్నాయని అంగీకరించాల్సిందే అంటారు కదా. దెయ్యాలే లేవని ఫిక్సైన వారు మాత్రం ఇది అస్సలు చదవకపోవడమే మంచిది.ఇంతకీ దెయ్యాలు ఎందుకు గుడి కట్టాయి, ఎక్కడ కట్టాయి.

కర్ణాటక రాజధాని బెంగళూరుకు సమీపంలో బొమ్మవర అనే గ్రామంలో ఓ గుడి ఉంది. ఆ గుడిపేరు సుందరేశ్వరాలయం. సుందరేశ్వరుడు అంటే శివుడు.ఇక్కడ శివలింగం ఎంతో అందంగా ఉంటుంది అందుకే సుందరేశ్వరుడు అని పేరు. 

Also Read: అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకోకుంటే ఏమవుతుంది

ఈ గ్రామంలో వందల ఏళ్ల క్రితం దెయ్యాలు తెగ భయపెట్టేవట. బయటకు రావాలంటనే జనాలు భయపడిపోయేవారు. దీంతో ఆ ఊరు ప్రజలకు ఏం చేయాలో అర్థంకాక మాంత్రికుడిని ఆశ్రయించారు. వాటిని తరిమికొట్టేందుకు మంత్ర విద్యలు నేర్చుకున్నప్పటికీ ఆయనకు సాధ్యం కాలేదు. దీంతో అక్కడ ఓ శివాలయాన్ని నిర్మిస్తే దెయ్యాలు పారిపోతాయని తెలుసుకుని ఊరి ప్రజలందరి సహకారంతో గుడి నిర్మించారు.దెయ్యాలు ఆ గుడిని నాశనం చేసేయడంతో కోపంతో ఊగిపోయిన మాంత్రికుడు మంత్రశక్తితో తను వశం చేసుకున్నాడు. వాటి జుట్టు కత్తిరించి బంధించాడు తమను విడిపించాలని దయ్యాలు వేడుకోవడంతో...పడగొట్టిన గుడిని మళ్లీ నిర్మించి ఊరి వాళ్లను ఇబ్బంది పెట్టకుండా వెళ్లిపోవాలని మాంత్రికుడు ఆంక్షలు పెట్టాడు. తప్పనిపరిస్థితుల్లో రాత్రికి రాత్రే గుడి నిర్మించిన దెయ్యాలు అక్కడి నుంచి మాయమైపోయాయి. 

Also Read: పగలు కనిపించి రాత్రి పూట మాయమయ్యే శివలింగం , అక్కడ క్షణం క్షణం అద్భుతమే

గుడి మీద ఉండే బొమ్మలను చూసినా ఆ గుడిని దెయ్యాలే నిర్మించాయని తెలుస్తుందని స్థానికులు అంటారు. ఎందుకంటే ఏ ఆలయంపైన అయినా దేవుడి బొమ్మలు, నృత్య భంగిమలు ఉంటే ఈ గుడిపై మాత్రం దెయ్యాలుంటాయి. అయితే గుడిని మళ్లీ నిర్మించిన దెయ్యాలు శివలింగాన్ని ప్రతిష్టించకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయాయట. అప్పటి నుంచి ఆ గుడిలో శివలింగం లేకుండా అలాగే ఉండేదట. కొన్నేళ్ల తర్వాత ఆ ప్రాంతంలో  మంచినీళ్ల బావిని తవ్వుతుంటే పెద్ద శివలింగం బయట పడింది. ఆ శివలింగాన్ని తీసుకెళ్లి ఆ గుడిలో ప్రతిష్టించి అప్పటి నుంచి ఆ గుడిలో పూజలు నిర్వహిస్తున్నారు స్థానికులు. భూతనాథుడిని అక్కడ ప్రతిష్టించి పూజలు చేయడం మొదలు పెట్టినప్పటి నుంచి కూడా అక్కడి వారికి అంతా మంచే జరిగిందట. అందుకే దెయ్యాలు నిర్మించిన దేవాలయం అని పేరుపెట్టేసుకుని సుందరేశ్వరుడిని పూజిస్తున్నారు. 

Also Read: పంచ మహాపాతకాలు చుట్టుకుంటాయ్ అంటారు కదా, ఆ పాతకాలు ఏంటో తెలుసా

Published at : 16 Mar 2022 06:59 AM (IST) Tags: Lord Shiva lord shiva temple mysterious lord shiva temple built by ghosts mysterious shiva temple lord shiva temple built by ghosts mysterious shiva temple built by ghosts explained

సంబంధిత కథనాలు

Heavy Rush at Tirumala: తిరుమలకు వెళ్తున్న భక్తులకు టీటీడీ కీలక సూచనలు, కిలోమీటర్లు మేర క్యూలైన్లలో గోవిందా గోవిందా !

Heavy Rush at Tirumala: తిరుమలకు వెళ్తున్న భక్తులకు టీటీడీ కీలక సూచనలు, కిలోమీటర్లు మేర క్యూలైన్లలో గోవిందా గోవిందా !

Horoscope Today 29th May 2022: ఈ రోజు ఈ రాశివారు మాజీ ప్రియురాలు/ ప్రియుడిని కలుస్తారు, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

Horoscope Today 29th May 2022:  ఈ రోజు ఈ రాశివారు మాజీ ప్రియురాలు/ ప్రియుడిని కలుస్తారు, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

Today Panchang 29 May 2022: తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, దుఃఖం, శ్రీ సూర్య స్త్రోత్రం

Today Panchang 29 May 2022:  తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, దుఃఖం, శ్రీ సూర్య స్త్రోత్రం

Tirumala News : తిరుమలకు పోటెత్తిన భక్తులు, శ్రీవారి దర్శనానికి 48 గంటలు పట్టే అవకాశం!

Tirumala News : తిరుమలకు పోటెత్తిన  భక్తులు, శ్రీవారి దర్శనానికి 48 గంటలు పట్టే అవకాశం!

Horoscope Today 28th May 2022: ఈ రాశులవారు తమ పనిని పక్కవారికి అప్పగించేందుకు ప్లాన్ చేస్తారు, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

Horoscope Today 28th May 2022:  ఈ రాశులవారు తమ పనిని  పక్కవారికి అప్పగించేందుకు ప్లాన్ చేస్తారు, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

టాప్ స్టోరీస్

Southwest Monsoon : కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు, మరో వారంలో తెలుగు రాష్ట్రాలకు

Southwest Monsoon : కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు, మరో వారంలో తెలుగు రాష్ట్రాలకు

Infinix Note 12 Flipkart Sale: ఇన్‌ఫీనిక్స్ నోట్ 12 సేల్ ప్రారంభం - అదిరిపోయే ఫీచర్లు - ఎలా ఉందో చూశారా?

Infinix Note 12 Flipkart Sale: ఇన్‌ఫీనిక్స్ నోట్ 12 సేల్ ప్రారంభం - అదిరిపోయే ఫీచర్లు - ఎలా ఉందో చూశారా?

The Conjuring House: ‘ది కంజూరింగ్’ హౌస్, ఆ దెయ్యాల కొంపను రూ.11 కోట్లకు అమ్మేశారు, చరిత్ర తెలిస్తే షాకవుతారు!

The Conjuring House: ‘ది కంజూరింగ్’ హౌస్, ఆ దెయ్యాల కొంపను రూ.11 కోట్లకు అమ్మేశారు, చరిత్ర తెలిస్తే షాకవుతారు!

F3 Movie OTT Release: 'ఎఫ్3' ఓటీటీ రిలీజ్ అప్డేట్ - స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడ?

F3 Movie OTT Release: 'ఎఫ్3' ఓటీటీ రిలీజ్ అప్డేట్ - స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడ?