అన్వేషించండి

Ganesh Chaturthi 2024: వినాయకచవితి పూజకి ఎలాంటి విగ్రహం కొని తెచ్చుకోవాలి!

Vinayaka Chavithi 2024 : సెప్టెంబరు 07 శనివారం వినాయక చవితి సందర్భంగా పూజచేసేవారంతా ముందుగా విగ్రహాన్ని కొని తెచ్చుకుంటారు.. మరి ఎలాంటి విగ్రహాన్ని తెచ్చుకుంటే ఏ ఫలితమో తెలుసా...

Ganesh Chaturthi 2024: వినాయక చవితి పండుగ రోజు భక్తులు తమ కంటికి నచ్చినది, స్తోమతకు తగ్గట్టు గణేషుడి విగ్రహాన్ని తీసుకొచ్చి పూజిస్తారు. అయితే భగవంతుడు ఒక్కడే కానీ ఎన్నో ఆకృతులు. ప్రతి ఆకృతి వెనుకా ఓ ఆంతర్యం ఉంటుందంటారు పండితులు..

Also Read: Vinayaka Chavithi Pooja Vidhi in Telugu: వినాయకచవితి పూర్తి పూజా విధానం...ఇది ఫాలో అవండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు!
 
తొండం ఎడమ వైపు ఉంటే

గణేషుడి విగ్రహానికి తొండం ఎడమ వైపుకు తిరిగి ఉండే విగ్రహం  తీసుకొచ్చి పూజిస్తే ఈ ఇంట్లో వాస్తు దోషాలు తొలగిపోతాయి. ఏ పని ప్రారంభించినా విజయం వరిస్తుంది.

తొండం కుడివైపు ఉంటే

గణనాథుడి తొండం కుడి వైపు తిరిగి ఉండే విగ్రహాన్ని తీసుకొచ్చి ఇంట్లో పూజిస్తే.. కోరిన న్యాయబద్ధమైన కోర్కెలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం అయితే ఇలాంటి విగ్రహాన్ని తీసుకొచ్చి పూజించినప్పుడు సరైన నియమ నిబంధనలు పాటించాలి..లేదంటే కొత్త ఇబ్బందులు తప్పవు..

తొండం మధ్యలో కనిపిస్తే
 
పార్వతీతనయుడి తొండం మధ్యలో ఉండే విగ్రహాలను పూజిస్తే ఇంట్లో ఉండే నెగెటివ్ ఎనర్జీ పారిపోతుంది. ఇంట్లో దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు కొంత ఉపశమనం పొందుతారు.

తెల్లటి వినాయకుడు

తెలుపు రంగు గణేషుడి విగ్రహాన్ని పూజించే ఇంట్లో ప్రశాంతత ఉంటుంది ఉంటుంది. సాధారణంగా కుటుంబంలో కలహాలు ఉంటే తెలుపు రంగు వినాయకుడిని పూజిస్తే తగాదాలు సమసిపోతాయంటారు. 

Also Read: గణేష్ చతుర్థి రోజు చంద్రుడిని చూస్తే ఏమవుతుంది!
 
రావి ఆకు వినాయకుడు

రావి ఆకు రూపంలో ఉన్న గణనాథుడిని పూజిస్తే ఇంట్లో ఉండే దుష్టశక్తులు తొలగిపోయి..అంతా మంచే జరుగుతుందని చెబుతారు..

ఇంకా ఈ విగ్రహాలు తెచ్చుకుంటే

వెండితో తయారు చేసిన వినాయకుడిని పూజిస్తే పేరు ప్రఖ్యాతులు సొంతం అవుతాయి
చెక్కరూపంలో ఉన్న వినాయకుడిని పూజిస్తే ఆరోగ్యం
కంచు వినాయకుడిని పూజిస్తే ఇంట్లో సంతోషం
మట్టి గణపతికి పూజలు చేస్తే కెరీర్లో విజయం
 
పూజలు తీసుకొచ్చే విగ్రహం ఎంత ఉండాలి...

ఇంట్లో నిత్యం చేసుకునే పూజలకు వినియోగించే విగ్రహాలు  బొటనవేలు కన్నా పెద్దగా ఉండకూడదు. అయితే వినాయక చవితి లాంటి వ్రతాలు ఆచరించినప్పుడు అరచేతి కన్నా పెద్ద విగ్రహం ఉండకూడదు. పూజకు వినియోగించే విగ్రహాలు ఎంత పెద్ద పరిమాణంలో ఉంటే అంత పెద్ద స్థాయిలో ధూప, దీప నైవేద్యాలు సాగాలి.. అందుకే పూజలకు చిన్న విగ్రహాలు వినియోగించాలని చెబుతారు. పూజలో మట్టివిగ్రహం వినియోగించడం అత్యుత్తమం... లేదంటే పంచలోహాలతో తయారుచేసిన వినాయకుడిని పూజలు చేయొచ్చు..

Also Read: వినాయక చవితి శుభాకాంక్షలు మీ బంధుమిత్రులకు ఈ శ్లోకాలతో తెలియజేయండి!
 
గణేషుడి రూపాలు

లంబోదరుడికి 32 రూపాలు ఉన్నాయి. వీటిలో 16 రూపాలు అత్యంత ప్రాధాన్యమైనవని చెబుతారు. 
1. బాలగణపతి 2. తరుణ గణపతి 3. భక్త గణపతి 4. వీర గణపతి 
5. శక్తిగణపతి 6. ద్విజ గణపతి 7. సిద్ధి గణపతి 8. ఉచ్ఛిష్ట గణపతి
 9. విష్ణు గణపతి 10.క్షిప్త గణపతి, 11. హేరంభ గణపతి 12. లక్ష్మీగణపతి
13. మహాగణపతి 14. విజయ గణపతి 15. రుత్య గణపతి 16. ఊర్ధ్వ గణపతి

Also Read: వినాయక నవరాత్రులు ఎప్పటి నుంచి ఎప్పటివరకు - చవితి రోజు పూజ ఏ సమయంలో చేసుకోవాలి!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vijayawada News: అమరావతి మీదుగా కొత్త రైల్వే లైన్ - నాలుగేళ్లలో పూర్తి చేస్తామన్న విజయవాడ డీఆర్ఎం
అమరావతి మీదుగా కొత్త రైల్వే లైన్ - నాలుగేళ్లలో పూర్తి చేస్తామన్న విజయవాడ డీఆర్ఎం
Manchu Fight: కలెక్టర్ ముందు ఘర్షణ పడ్డ మోహన్ బాబు, మనోజ్ - ఆస్తులపై తేలని పంచాయతీ !
కలెక్టర్ ముందు ఘర్షణ పడ్డ మోహన్ బాబు, మనోజ్ - ఆస్తులపై తేలని పంచాయతీ !
Jagan disqualification: అసెంబ్లీకి హాజరు కాకపోతే జగన్‌పై అనర్హతా వేటు - పులివెందులకు ఉపఎన్నికలు !
అసెంబ్లీకి హాజరు కాకపోతే జగన్‌పై అనర్హతా వేటు - పులివెందులకు ఉపఎన్నికలు !
Battula Prabhakar: రూ.3 కోట్లు, 100 మంది అమ్మాయిలను ట్రాప్ చేయడమే టార్గెట్ - టాటూ ఆధారంగా ట్రేస్, వాంటెడ్ క్రిమినల్ ప్రభాకర్ కేసులో సంచలన విషయాలు
రూ.3 కోట్లు, 100 మంది అమ్మాయిలను ట్రాప్ చేయడమే టార్గెట్ - టాటూ ఆధారంగా ట్రేస్, వాంటెడ్ క్రిమినల్ ప్రభాకర్ కేసులో సంచలన విషయాలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

TDP Won Hindupur Municipality | టీడీపీ కైవసమైన హిందూపూర్ మున్సిపాలిటీ | ABP DesamJC Prabhakar reddy vs Kethireddy peddareddy | తాడిపత్రిలో హై టెన్షన్ వాతావరణం | ABP DesamTirupati Deputy Mayor Election | తిరుపతి పీఠం కోసం కూటమి, వైసీపీ బాహా బాహీ | ABP DesamPrabhas Look From Kannappa | కన్నప్ప సినిమా నుంచి రెబల్ స్టార్ ప్రభాస్ ఫస్ట్ లుక్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijayawada News: అమరావతి మీదుగా కొత్త రైల్వే లైన్ - నాలుగేళ్లలో పూర్తి చేస్తామన్న విజయవాడ డీఆర్ఎం
అమరావతి మీదుగా కొత్త రైల్వే లైన్ - నాలుగేళ్లలో పూర్తి చేస్తామన్న విజయవాడ డీఆర్ఎం
Manchu Fight: కలెక్టర్ ముందు ఘర్షణ పడ్డ మోహన్ బాబు, మనోజ్ - ఆస్తులపై తేలని పంచాయతీ !
కలెక్టర్ ముందు ఘర్షణ పడ్డ మోహన్ బాబు, మనోజ్ - ఆస్తులపై తేలని పంచాయతీ !
Jagan disqualification: అసెంబ్లీకి హాజరు కాకపోతే జగన్‌పై అనర్హతా వేటు - పులివెందులకు ఉపఎన్నికలు !
అసెంబ్లీకి హాజరు కాకపోతే జగన్‌పై అనర్హతా వేటు - పులివెందులకు ఉపఎన్నికలు !
Battula Prabhakar: రూ.3 కోట్లు, 100 మంది అమ్మాయిలను ట్రాప్ చేయడమే టార్గెట్ - టాటూ ఆధారంగా ట్రేస్, వాంటెడ్ క్రిమినల్ ప్రభాకర్ కేసులో సంచలన విషయాలు
రూ.3 కోట్లు, 100 మంది అమ్మాయిలను ట్రాప్ చేయడమే టార్గెట్ - టాటూ ఆధారంగా ట్రేస్, వాంటెడ్ క్రిమినల్ ప్రభాకర్ కేసులో సంచలన విషయాలు
Next on Netflix: కీర్తి సురేష్ అక్క, ఆర్యన్ ఖాన్ డైరక్షన్, రానా నాయుడు ఎంట్రీ... కొత్త సిరీస్‌లతో దుమ్ము రేపనున్న నెట్‌ఫ్లిక్స్
కీర్తి సురేష్ అక్క, ఆర్యన్ ఖాన్ డైరక్షన్, రానా నాయుడు ఎంట్రీ... కొత్త సిరీస్‌లతో దుమ్ము రేపనున్న నెట్‌ఫ్లిక్స్
AP News: ఏపీ ప్రభుత్వానికిి అంబులెన్సులు అందించిన నటుడు సోనూసూద్ - అభినందించిన సీఎం చంద్రబాబు
ఏపీ ప్రభుత్వానికిి అంబులెన్సులు అందించిన నటుడు సోనూసూద్ - అభినందించిన సీఎం చంద్రబాబు
Hero Nikhil private videos: హీరో నిఖిల్‌కు షాక్ - ప్రైవేటు వీడియోలతో మస్తాన్ సాయి బ్లాక్‌మెయిల్‌ - పోలీసులకు పట్టించిన లావణ్య !
హీరో నిఖిల్‌కు షాక్ - ప్రైవేటు వీడియోలతో మస్తాన్ సాయి బ్లాక్‌మెయిల్‌ - పోలీసులకు పట్టించిన లావణ్య !
BPL Crisis: బీపీఎల్ లో సంక్షోభం.. జీతం ఇవ్వకపోవడంతో ప్లేయర్ల కిట్లను లాక్కున్న బస్ డ్రైవర్.. ఆటగాళ్ల బాయ్ కాట్..
బీపీఎల్ లో సంక్షోభం.. జీతం ఇవ్వకపోవడంతో ప్లేయర్ల కిట్లను లాక్కున్న బస్ డ్రైవర్.. ఆటగాళ్ల బాయ్ కాట్..
Embed widget