అన్వేషించండి

Vinayaka Chavithi Pooja Vidhi in Telugu: వినాయకచవితి పూర్తి పూజా విధానం...ఇది ఫాలో అవండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు!

Ganesh Chaturthi 2024: ఏటా భాద్రపద మాసం ఆరంభంలో నాలుగో రోజైన చవితి వినాయకుడి జన్మతిథి. ఈ ఏడాది సెప్టెంబరు 07 న వినాయక చవితి వచ్చింది..పూజ ఇలా ఈజీగా చేసుకోండి..

Vinayaka Chavithi Pooja Vidhi in Telugu: ఏ పూజ ప్రారంభించినా ముందుగా పసుపు వినాయకుడిని పూజించాలి.. వినాయక చవితి పూజ చేసేటప్పుడు కూడా ముందుగా పసుపు గణపతిని పూజించాలి. ఆతర్వాతే మీరు తీసుకొచ్చిన విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేయాలి..
 
పూజా సామగ్రి
కుందులు, నెయ్యి, నూనె, వత్తులు, పసుపు, కుంకుమ, గంధం, అగరొత్తులు, కర్పూరం, తమలపాకులు, పూలు, పండ్లు, కొబ్బరికాయలు, బెల్లం, తోరం,  పత్రి, పాలవెల్లి, నైవేద్యాలు..

ముందుగా పసుపు గణపతి పూజ...
 
శ్లోకం:
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం 
ప్రసన్న వదనం ధ్యాయేత్సర్వ విఘ్నోపశాంతయే

ఆచమనీయం
ఓం కేశవాయస్వాహా ఓం నారాయణాయస్వాహా ఓం మాధవాయస్వాహా  ఓం గోవిందాయనమః ఓం విష్ణవేనమః  ఓం మధుసూదనాయనమః  ఓం త్రివిక్రమాయనమః ఓం వామనాయ నమః  ఓం శ్రీధరాయ నమః  ఓం హ్రిషీకేశాయ నమః ఓం పద్మనాభాయ నమః  ఓం దామోదరాయ నమః  ఓం సంకర్షణాయ నమః  ఓం వాసుదేవాయ నమః ఓం ప్రద్యుమ్నాయ నమః  ఓం అనిరుద్ధాయ నమః ఓం పురుషోత్తమాయ నమః ఓంఅధోక్షజాయ నమః ఓం నారసింహాయ నమః  ఓం అచ్యుతాయ నమః  ఓం జనార్ధనాయ నమః ఓం ఉపేంద్రాయ నమః ఓం హరయే నమః ఓం శ్రీకృష్ణాయ నమః...

గణపతికి నమస్కరించి
యశ్శివో నామరూపానభ్యాం యాదేవీ సర్వమంగళా తయోస్సంస్మరణాత్పుంసాంసర్వతో జయ మంగళం. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవ: యేషామిందీవరశ్శ్హ్యామో హృదయస్థోజనార్థన: ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయోనమామ్యహం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యయంబికే  దేవి నారాయణి నమోస్తుతే. ఓం శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః ఓం ఉమామహేశ్వరాభ్యాం నమః ఓం వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః ఓం శచీపురందరాభ్యాం నమః ఓం అరుంధతీ వశిష్ఠాభ్యాం నమః ఓం శ్రీ సితారామాభ్యాం నమః ||నమస్సర్వేభ్యోం మహాజనేభ్యః అయం ముహూర్త స్సుముహూర్తోస్తు||

శ్లోకం
ఉత్తిష్టంతు భూతపిశాచా: ఏతే భూమి భారకా: ఏతాషామవిరోధేనబ్రహ్మకర్మ సమారభే ((ఇది చదువుతూ అక్షతలు వాసన చూసి వెనుకవైపు వేయాలి)
ఓం భూః | ఓం భువః | ఓగ్ సువః | ఓం మహాః | ఓం జనః | ఓం తపః | ఓగ్ సత్యం |. ఓం తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్ ||
||ఓమా పోజ్యోతీరసోమృతం బ్రహ్మభూర్భువస్సువరోమ్||
అపవిత్రః పవిత్రోవా సర్వావస్థాంగతోపినా యః స్మరేద్వై విరూపాక్షంస బాహ్యాభ్యంతరశ్శుచిః || (అని నాలుగు దిక్కులు నీళ్ళు చల్లాలి)

సంకల్పం 
మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం శుభేశోభనే ముహూర్తే, శ్రీ మహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రాహ్మణ: ద్వితీయపరార్ధే, శ్వేతవరాహకల్పే, వైవస్వత మన్వంతరే, కలియుగే, ప్రథమపాదే, జంబూ ద్వీపే, భరతవర్షే, భరతఖండే, మేరోర్ధక్షిణదిగ్భాగే, ( మీరు దగ్గరగా ఉన్న నదిని చెప్పుకోండి) నదీ సమీపే. నివాసిత గృహే అస్మిన్ వర్తమాన వ్యావహారిక, చాంద్రమానేన శ్రీ శోభకృత్ నామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతౌ భాద్రపద మాసే, శుక్ల పక్షే చతుర్థ్యాం,  ఇందువాసరే ( సోమవారం), శుభ నక్షత్రే, శుభయోగే శుభకరణే, ఏవంగుణ విశేషేణ విశిష్టాయాం, శుభతిధౌ శ్రీమాన్ ( ఇక్కడ మీ గోత్రనామాలు చెప్పుకోవాలి) ధర్మపత్నీ సమేతస్య సకుటుంబస్య క్షేమస్ధైర్య  వీర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభి వృధ్హ్యర్ధం, ధర్మార్ధ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్ధ సిద్ద్యర్ధం, పుత్రపౌత్రాభివృద్ధ్యర్ధం సకలకార్యేషు సర్వదా దిగ్విజయసిద్ధ్యర్ధం, శ్రీ వరసిద్ధి వినాయక దేవతా ముద్ధిస్య శ్రీ వరసిద్ధి వినాయక దేవతాపూజాం కరిష్యే అదౌ నిర్విఘ్న పరిసమాప్త్యర్ధం శ్రీ మహాగణాధిపతి పూజాం కరిష్యే. (  నీరు ముట్టుకోవాలి)

ఆధౌ నిర్వఘ్నేన పరిసమాప్యర్థం గణాధిపతి పూజాం కరిష్యే...
తదంగ కలశారాధనం కరిష్యే అని చెప్పి కలశంలో ఉన్న నీటిలో పూలు, గంధం,అక్షతలు వేసి దానిపై చేయి ఉంచి ఇలా చెప్పాలి... 
కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్ర స్సమాశ్రితః |
మూలే తత్ర స్థితో బ్రహ్మా మధ్యే మాతృగణాః స్మృతాః | |
కుక్షౌతు సాగరా స్సర్వే సప్త ద్వీపా వసుంధరా |
ఋగ్వేదో థ యజుర్వేద స్సామవేదో హ్యధర్వణః | |
అంగైశ్చ సహితా స్సర్వే కలశాంబు సమాశ్రితాః |
ఆయాంతు దేవం పూజార్థం సకల దురితక్షయ కారకాః | |
గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతి
నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధింకురు`
( కలశలో నీటిని మీపై, పూజా ద్రవ్యాలపై చల్లాలి)

పసుపు గణపతిపై అక్షతలు వేస్తూ ఇది చదవాలి

ఓం గణానాంత్వా గణపతిగ్ం హావామహే కవిం కవీనాం ముమమశ్శ్రవస్తవం..  జ్యేష్టరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత అనశృణ్యన్నూతిభిస్సీద సాధనమ్. శ్రీ మహాగణాధిపతియే నమః: ధ్యాయామి ధ్యానం సమర్పయామి.  ఆవాహయామి ఆవాహనం సమర్పయామి. నవరత్న ఖచిత స్వర్ణ సింహసనం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమ: ధూపమాఘ్రాపయామి. దీపం దర్శయామి. ధూపదీపనంతరం శుద్దాచమనీయం సమర్పామి.

నైవేద్యం
ఓం భూర్భువస్సువ:ఓం తత్సవితుర్వేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియోయోన: ప్రచోదయాత్. నీళ్ళు పుష్పంతో చల్లి ఓం సత్యం త్వర్తేన పరిషించామి. పుష్పము నీటిలో ముంచి నైవేద్య పదార్ధమ్ చుట్టు తిప్పాలి. ఓం అమృతమస్తు | ఓమ్ అమృతోపస్తణమసి ఓం ప్రాణాయ స్వాహా, ఓం అపానాయ స్వాహా, ఓం ఓం వ్యానాయ స్వాహా, ఓం ఉదానాయ స్వాహా, ఓం సమానాయ స్వాహా (క్రిందివిధంగా చదివి కలశములోని నీటి వదలవలెను.) మధ్య మధ్య పానీయం సమర్పణమి.

శ్రీ మహాగణాధిపతియే నమః తాంబులం సమర్పయామి
శ్రీ మహాగణాధిపతియే నమః: ఆనందకర్పూర నీరాజనం సమర్పయామి
పూజ చేసిన అక్షింతలు, పూలు తలపై వేసుకుని

శ్లోకం
యస్యస్మృతాచ నామూక్త్యా తప: క్రిమాదిషు
న్యూనం సంపూర్ణతాం యాంతి సద్యో వందే గణాధిప 
మంత్రహీనం క్రియా హీనం భక్తిహీనం గణాధిప 
యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే
అనయా ధ్యాన అవాహనాది షోడశోపచార పూజయా భగవన్ సర్వాత్మక: శ్రీ మహాగణాధిపతి: వరదోభవతు అని చెప్పి...నీళ్లు , అక్షతలు చేతిలోకి తీసుకుని  గణపతి కాళ్ళ దగ్గర వదిలి వేయాలి.

ఉద్వాసన
యజ్ఞేన యజ్ఞ మయజంత దేవా: తాని ధర్మాణి ప్రధమాన్యాసన్ తేహనాకం మహిమానస్యచం తే యత్ర పూర్వే సాధ్యాస్సతి దేవా: శ్రీ మహాగణపతిం యధాస్థానం ప్రవేశయామి శోభనార్ధే పునరాగమనాయచ|| పసుపు గణపతిని తమలపాకుతో తీసి పూజా మందిరం ఈశాన్య భాగంలో ఉంచవలెను.

పసుపు గణపతి పూజ పూర్తైన తర్వాత   మీరు తీసుకొచ్చిన విగ్రహానికి ప్రాణప్రతిష్టాపన చేసి...గణపతికి షోడసోపచార పూజ చేయాలి...

మీరు తీసుకొచ్చిన  వినాయక  విగ్రహంపై పువ్వుతో పంచామృతాలు చల్లి... ఇలా చెప్పాలి..

ఓ ఐంహ్రీంక్రోం యంరంలంవ శంషంసంహం-ఇత్యాదేనా ప్రాణప్రతిష్టాపనం కృత్వా, నమస్కృత్వా శ్రీ వరశిద్ధి వినాయకాయ నమ:

స్వామిన్ సర్వ జగన్నాథ యావత్పూజావసానకం
తావత్వం ప్రీతిభావేన బింబేస్మిన్ సన్నిధిం కురు//

భవసంచిత పాపౌఘ విధ్వంసన విచక్షణమ్ 
విఘ్నాంధకార భాస్వంతం విఘ్నరాజ మహంభజే
ఏకదంతం శూర్పకర్ణం గజవక్త్రం చతుర్భుజం 
పాశాంకుశధరం దేవమ్ ధ్యాయేత్సిద్ధి వినాయకమ్
ఉత్తమం గణనాథస్య వ్రతం సంపత్కరం 
శుభం భక్తాభీష్టప్రదం తస్మాత్ ధ్యాయేత్తం విఘ్ననాయకం

షోడశోపచారపూజ

ధ్యాయేత్గజాననం దేవం తప్తకాంచనసన్నిభం, చతుర్భుజం మహాకాయం సర్వాభరణ భూషితం॥
శ్రీ మహా గణాధిపతయే నమః ధ్యాయామి ( ధ్యానం సమర్పయామి)

అత్రాగచ్చ జగద్వంద్య సురరాజార్చితేశ్వర అనాథనాథ సర్వజ్ఞ గౌరీగర్భ సముద్బవ
ఆవాహయామి (అవాహనార్థం పుష్పం/అక్షతాన్ సమర్పయామి)

మౌక్తికైః పుష్యరాగైశ్చ నానారత్నైర్విరాజితం రత్నసింహాసనంచారు ప్రీత్యర్థం ప్రతి గృహ్యాతాం॥
ఆసనం సమర్పయామి  (ఆసనార్థం పుష్పం/అక్షతాన్ సమర్పయామి)

గౌరీపుత్ర నమస్తేస్తు శంకర ప్రియనందన 
గృహాణార్ఘ్యం మయాదత్తం గంధ పుష్పాక్షతైర్యుతం ॥
ఆర్ఘ్యం సమర్పయామి నీళ్లు చల్లాలి)

గజవక్త్ర నమస్తేస్తు సర్వాభీష్ట ప్రదాయక 
భక్త్యాపాద్యం మయాదత్తం గృహాణ ద్విరదానన॥
పాద్యం సమర్పయామి (నీళ్లు చల్లాలి)

అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ వరపూజిత 
గృహాణాచమనం దేవ, తుభ్యం దత్తంమయా ప్రభో ॥
ఆచమనీయం సమర్పయామి  ( నీళ్లు చల్లాలి)

దధిక్షీర సమాయుక్తం థామద్వాజ్యేన సమన్వితం 
మధుపర్కం గృహాణేదం గజవక్త్రం నమోస్తుతే ॥
మధుపర్కం సమర్పయామి. 

స్నానం పంచామృతైర్దేవ గృహాణ గణనాయక 
అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ గణపూజిత ॥
పంచామృత స్నానం సమర్పయామి.  

గంగాదిసర్వతీర్థేభ్యః ఆహృతైరమలిర్ణలైః స్నానం 
కురుష్వభగవానుమాపుత్ర నమోస్తుతే॥
శుద్దోదక స్నానం సమర్పయామి.

రక్తవస్త్రద్వయం చారు దేవయోగ్యంచ 
మంగళం శుభప్రదం గృహాణత్వం లంబోదరహరాత్మజ ॥
వస్త్రయుగ్మం సమర్పయామి.

రాజితం బహ్మసూత్రం చ కాంచనం చో త్తరీయకం
 గృహాణ సర్వదేవజ్ఞ భక్తానామిష్టదాయక॥
ఉపవీతం సమర్పయామి.

చందనాగరు కర్పూర కస్తూరీ కుంకుమాన్వితం విలేపనం 
సురశ్రేష్ఠ ప్రీత్యర్థం ప్రతిగృహ్యాతాం॥
గంధాన్ సమర్పయామి.

అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలీయాంస్తండులాన్ శుభాన్
 గృహాణ పరమానంద ఈశపుత్ర నమోస్తుతే॥
అక్షతాన్ సమర్పయామి.

సుగంధాని సుపుష్పాణి జాజీకుంద ముఖానిచ 
ఏక వింశతి పత్రాణి సంగృహాణ నమోస్తుతే॥
పుష్పాణి పూజయామి.

వినాయక అష్టోత్తర శతనామావళి
ఓంగజాననాయ నమః  ఓంగణాధ్యక్షాయ నమః  ఓంవిఘ్నరాజాయ నమః  ఓం వినాయకాయ నమః ఓం ద్వైమాతురాయ నమః ఓం ద్విముఖాయ నమః  ఓం ప్రముఖాయ నమః  ఓం సుముఖాయ నమః ఓం కృతినే నమః  ఓంసుప్రదీప్తాయ నమః ఓం సుఖనిధయే నమః ఓంసురాధ్యక్షాయ నమః  ఓం సురారిఘ్నాయ నమః ఓం మహాగణపతయే నమః ఓం మాన్యాయ నమః  ఓం మహాకాలాయ నమః ఓంమహాబలాయ నమః ఓం హేరంబాయ నమః  ఓం లంబజఠరాయ నమః ఓంహయగ్రీవాయ నమః ఓం ప్రథమాయ నమః  ఓం ప్రాజ్ఞాయ నమః ఓం ప్రమోదాయ నమః ఓంమోదకప్రియాయ నమః  ఓంవిఘ్నకర్త్రే నమః ఓం విఘ్నహంత్రే నమః ఓంవిశ్వనేత్రే నమః  ఓంవిరాట్పతయే నమః ఓం శ్రీపతయే నమః ఓం వాక్పతయే నమః  ఓంశృంగారిణే నమః ఓంఆశ్రితవత్సలాయ నమః ఓంశివప్రియాయ నమః  ఓంశీఘ్రకారిణే నమః ఓంశాశ్వతాయ నమః ఓంబల్వాన్వితాయ నమః  ఓంబలోద్దతాయ నమః ఓంభక్తనిధయే నమః ఓంభావగమ్యాయ నమః  ఓంభావాత్మజాయ నమః ఓంఅగ్రగామినే నమః ఓం మంత్రకృతే నమః  ఓంచామీకర ప్రభాయ నమః  ఓం సర్వాయ నమః ఓం సర్వోపాస్యాయ నమః  ఓంసర్వకర్త్రే నమః ఓం సర్వ నేత్రే నమః ఓం నర్వసిద్దిప్రదాయ నమః  ఓం పంచహస్తాయ నమః ఓంపార్వతీనందనాయ నమః ఓం ప్రభవే నమః  ఓంకుమార గురవే నమః ఓంకుంజరాసురభంజనాయ నమః ఓం కాంతిమతే నమః  ఓం ధృతిమతే నమః ఓం కామినే నమః ఓంకపిత్థఫలప్రియాయ నమః ఓం బ్రహ్మచారిణే నమః ఓం బ్రహ్మరూపిణే నమః ఓం మహోదరాయ నమః  ఓం మదోత్కటాయ నమః ఓం మహావీరాయ నమః ఓం మంత్రిణే నమః  ఓం మంగళసుస్వరాయ నమః ఓం ప్రమదాయ నమః ఓం జ్యాయసే నమః  ఓంయక్షికిన్నరసేవితాయ నమః ఓం గంగాసుతాయ నమః ఓం గణాధీశాయ నమః  ఓం గంభీరనినదాయ నమః ఓం వటవే నమః ఓం జ్యోతిషే నమః  ఓం అక్రాంతపదచిత్ప్రభవే నమః ఓంఅభీష్టవరదాయ నమః ఓం మంగళప్రదాయ నమః  ఓం అవ్యక్త రూపాయ నమః ఓం పురాణపురుషాయ నమః ఓం పూష్ణే నమః  ఓం పుష్కరోత్ క్షిప్తహరణాయ నమః ఓంఅగ్రగణ్యాయ నమః ఓం అగ్రపూజ్యాయ నమః  ఓం అపాకృతపరాక్రమాయ నమః ఓం సత్యధర్మిణే నమః ఓం సఖ్యై నమః ఓం సారాయ నమః ఓం సరసాంబునిధయే నమః ఓంమహేశాయ నమః  ఓంవిశదాంగాయ నమః ఓం మణికింకిణీ మేఖలాయ నమః ఓం సమస్తదేవతామూర్తయే నమః ఓం సహిష్ణవే నమః ఓం బ్రహ్మవిద్యాది దానభువే నమః ఓం విష్ణువే నమః  ఓంవిష్ణుప్రియాయ నమః ఓం భక్తజీవితాయ నమః ఓం ఐశ్వర్యకారణాయ నమః  ఓంసతతోత్థితాయ నమః ఓం విష్వగ్దృశేనమః ఓం విశ్వరక్షావిధానకృతే నమః  ఓంకళ్యాణగురవే నమః ఓం ఉన్మత్తవేషాయ నమః ఓం పరజయినే నమః  ఓం సమస్త జగదాధారాయ నమః ఓం సర్వైశ్వర్యప్రదాయ నమః ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః   

అథాంగ పూజ  ( పూలతో పూజచేయండి)
గణేశాయ నమః - పాదౌ పూజయామి
ఏకదంతాయ నమః - గుల్ఫౌ పూజయామి
శూర్పకర్ణాయ నమః - జానునీ పూజయామి
విఘ్నరాజాయ నమః - జంఘే పూజయామి
అఖువాహనాయ నమః - ఊరూ పూజయామి
హేరంబాయ నమః - కటిం పూజయామి
లంబోదరాయ నమః - ఉదరం పూజయామి
గణనాథాయ నమః - నాభిం పూజయామి
గణేశాయ నమః - హృదయం పూజయామి
స్థూలకంఠాయ నమః - కంఠం పూజయామి
గజవక్త్రాయ నమః - వక్త్రం పూజయామి
విఘ్నహంత్రే నమః - నేత్రం పూజయామి
శూర్పకర్ణాయ నమః - కర్ణౌ పూజయామి
ఫాలచంద్రాయ నమః - లలాటం పూజయామి
సర్వేశ్వరాయ నమః - శిరః పూజయామి
విఘ్నరాజాయ నమః - సర్వాణ్యంగాని పూజయామి


ఏకవింశతి పత్రిపూజ (21 రకాల పత్రితో పూజించాలి)
సుముఖాయనమః - మాచీపత్రం పూజయామి।
గణాధిపాయ నమః - బృహతీపత్రం పూజయామి।
ఉమాపుత్రాయ నమః - బిల్వపత్రం పూజయామి।
గజాననాయ నమః - దుర్వాయుగ్మం పూజయామి
హరసూనవేనమః - దత్తూరపత్రం పూజయామి।
లంబోదరాయనమః - బదరీపత్రం పూజయామి।
గుహాగ్రజాయనమః - అపామార్గపత్రం పూజయామి।
గజకర్ణాయనమః - తులసీపత్రం పూజయామి,
ఏకదంతాయ నమః - చూతపత్రం పూజయామి,
వికటాయ నమః - కరవీరపత్రం పూజయామి।
భిన్నదంతాయ నమః - విష్ణుక్రాంతపత్రం పూజయామి,
వటవేనమః - దాడిమీపత్రం పూజయామి,
సర్వేశ్వరాయనమః - దేవదారుపత్రం పూజయామి,
ఫాలచంద్రాయ నమః - మరువకపత్రం పూజయామి,
హేరంబాయనమః - సింధువారపత్రం పూజయామి
శూర్పకర్ణాయనమః - జాజీపత్రం పూజయామి,
సురాగ్రజాయనమః - గండకీపత్రం పూజయామి,
ఇభవక్త్రాయనమః - శమీపత్రం పూజయామి,
వినాయకాయ నమః - అశ్వత్థపత్రం పూజయామి,
సురసేవితాయ నమః - అర్జునపత్రం పూజయామి।
కపిలాయ నమః - అర్కపత్రం పూజయామి।
శ్రీ గణేశ్వరాయనమః - ఏకవింశతి పత్రాణి పూజయామి.

అథ దూర్వాయుగ్మ పూజా
గణాధిపాయ నమః దూర్వాయుగ్మం పూజయామి।
ఉమాపుత్రాయ నమః దూర్వాయుగ్మం పూజయామి।
అఖువాహనాయ నమః దూర్వాయుగ్మం పూజయామి।
వినాయకాయ నమః దూర్వాయుగ్మం పూజయామి।
ఈశపుత్రాయ నమః దూర్వాయుగ్మం పూజయామి।
సర్వసిద్ది ప్రదాయకాయ నమః దూర్వాయుగ్మం పూజయామి।
ఏకదంతాయ నమః దూర్వాయుగ్మం పూజయామి।
ఇభవక్త్రాయ నమః దూర్వాయుగ్మం పూజయామి।
మూషిక వాహనాయ నమః దూర్వాయుగ్మం పూజయామి।
కుమారగురవే నమః దూర్వాయుగ్మం పూజయామి।
ఏకదంతైకవదన తథామూషిక వాహనాయ నమః దూర్వాయుగ్మం పూజయామి।
కుమారగురవే తుభ్యం అర్పయామి సుమాంజలిం మంత్రపుష్పం సమర్పయామి।

ధూపం
దశాంగం గుగ్గలోపేతం సుగంధం సుమనోహరం
ఉమాసుత నమస్తుభ్యం గృహాణ వరదోభవ॥  
మహాగణాధిపతయే నమః ధూపమాఘ్రాపయామి॥

దీపం
సాజ్యం త్రివర్తిసంయుక్తం వహ్నినాద్యోజితం మయా
గృహాణ మంగళం దీపం ఈశపుత్ర నమోస్తుతే
మహాగణాధిపతయే నమః దీపం దర్శయామి।

నైవేద్యం
సుగంధాసుకృతాంశ్చైవమోదకాన్ ఘృతపాచితాన్, నైవేద్యం గృహ్యతాంచణముద్దేః ప్రకల్పితాన్,
భక్ష్యంచ లేహ్యంచ చోష్యం పానీయమేవచ... ఇదం గృహాణ నైవేద్యం మయాదత్తం వినాయక,
మహాగణాధిపతయే నమః నైవేద్యం సమర్పయామి।

సచ్చిదానంద విఘ్నేశ పుష్కరాని ధనానిచ
భూమ్యాం స్థితాని భగవాన్ స్వీకురుష్వ వినాయక
సువర్ణపుష్పం సమర్పయామి.

తాంబూలం
పూగీఫల సమాయుక్తం నాగవల్లీ దళైర్యుతం 
కర్పూర చూర్ణసంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం 
మహాగణాధిపతయే నమః తాంబూలం సమర్పయామి।

ఘృతవర్తి సహస్రైశ్చ శకలైస్థితం నీరాజనం మయాదత్తం గృహాణవరదోభవ
మహాగణాధిపతయే నమః నీరాజనం సమర్పయామి।

నమస్కారం, ప్రార్థన
ప్రదక్షిణం కరిష్యామి సతతం మోదకప్రియ నమస్తే విఘ్ననాశన,
ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి,

గృహాణ హేరంబ సర్వ భద్ర ప్రదాయక 
గంధ పుష్పాక్షతైర్యుక్తం పాత్రస్థం పాపనాశన పునరర్ఘ్యం సమర్పయామి
 
నమస్తుభ్యం గణేశాయ నమస్తే విఘ్ననాశన,
ఈప్సితంమే వరం దేహి వరత్రచ పరాంగతిమ్
వినాయక నమస్తుభ్యం సంతతం మోదక ప్రియ
నిర్విఘ్నం కురుమే దేవ సర్వ కార్యేషు సర్వదా

పూజ మొత్తం పూర్తైన తర్వాత వినాయక కథలు చదువుకోవాలి.. కథలు చదువుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి.....

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Telangana DGP Issue: నాలుగు వారాల్లోగా తెలంగాణ డీజీపీని ఎంపిక చేయాలి - యూపీఎస్సీకి హైకోర్టు దిశానిర్దేశం - అసలేం జరిగిందంటే?
నాలుగు వారాల్లోగా తెలంగాణ డీజీపీని ఎంపిక చేయాలి - యూపీఎస్సీకి హైకోర్టు దిశానిర్దేశం - అసలేం జరిగిందంటే?
Andhra Pradesh TET Results 2025: ఆంధ్రప్రదేశ్‌ టెట్ అభ్యర్థుల నిరీక్షణకు తెర; అక్టోబర్‌ 2025 ఫలితాలు విడుదల... మీ మార్కుల మెమోను ఇలా పొందండి!
ఆంధ్రప్రదేశ్‌ టెట్ అభ్యర్థుల నిరీక్షణకు తెర; అక్టోబర్‌ 2025 ఫలితాలు విడుదల... మీ మార్కుల మెమోను ఇలా పొందండి!
Mamata Banerjee: 'నా దగ్గర అమిత్‌షా పెన్‌డ్రైవ్‌లు ఉన్నాయ్‌, ఏం చేయాలో బాగా తెలుసు
'నా దగ్గర అమిత్‌షా పెన్‌డ్రైవ్‌లు ఉన్నాయ్‌, ఏం చేయాలో బాగా తెలుసు" నిరసన మార్చ్‌లో మమత నిప్పులు!
Crime News: కూతురి మామగారితో తల్లి లవ్‌! అడ్డొచ్చిన కుమార్తె కాపురంలో నిప్పులు!సీరియల్స్‌కు మించిన ట్విస్ట్‌లు!
కూతురి మామగారితో తల్లి లవ్‌! అడ్డొచ్చిన కుమార్తె కాపురంలో నిప్పులు!సీరియల్స్‌కు మించిన ట్విస్ట్‌లు!

వీడియోలు

Asian Thalassemia Conclave | తలసేమియా గురించి తెలుసుకోకపోవటమే అసలు సమస్య | ABP Desam
Hardik Pandya in Vijay Hazare Trophy | సెంచరీ చేసిన హార్దిక్
Tilak Varma Injured | తిలక్ వర్మకు గాయం ?
Sarfaraz Khan vs Abhishek Sharma | 6 బంతుల్లో 6 బౌండరీలు బాదిన సర్ఫరాజ్
Sanjay Manjrekar Comments on Virat Kohli | విరాట్ పై సంజయ్ మంజ్రేకర్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana DGP Issue: నాలుగు వారాల్లోగా తెలంగాణ డీజీపీని ఎంపిక చేయాలి - యూపీఎస్సీకి హైకోర్టు దిశానిర్దేశం - అసలేం జరిగిందంటే?
నాలుగు వారాల్లోగా తెలంగాణ డీజీపీని ఎంపిక చేయాలి - యూపీఎస్సీకి హైకోర్టు దిశానిర్దేశం - అసలేం జరిగిందంటే?
Andhra Pradesh TET Results 2025: ఆంధ్రప్రదేశ్‌ టెట్ అభ్యర్థుల నిరీక్షణకు తెర; అక్టోబర్‌ 2025 ఫలితాలు విడుదల... మీ మార్కుల మెమోను ఇలా పొందండి!
ఆంధ్రప్రదేశ్‌ టెట్ అభ్యర్థుల నిరీక్షణకు తెర; అక్టోబర్‌ 2025 ఫలితాలు విడుదల... మీ మార్కుల మెమోను ఇలా పొందండి!
Mamata Banerjee: 'నా దగ్గర అమిత్‌షా పెన్‌డ్రైవ్‌లు ఉన్నాయ్‌, ఏం చేయాలో బాగా తెలుసు
'నా దగ్గర అమిత్‌షా పెన్‌డ్రైవ్‌లు ఉన్నాయ్‌, ఏం చేయాలో బాగా తెలుసు" నిరసన మార్చ్‌లో మమత నిప్పులు!
Crime News: కూతురి మామగారితో తల్లి లవ్‌! అడ్డొచ్చిన కుమార్తె కాపురంలో నిప్పులు!సీరియల్స్‌కు మించిన ట్విస్ట్‌లు!
కూతురి మామగారితో తల్లి లవ్‌! అడ్డొచ్చిన కుమార్తె కాపురంలో నిప్పులు!సీరియల్స్‌కు మించిన ట్విస్ట్‌లు!
US proposing 500 percent tax:500 శాతం సుంకాలంటూ అమెరికా బెదిరింపు - భారత్ రియాక్షన్ అదుర్స్
500 శాతం సుంకాలంటూ అమెరికా బెదిరింపు - భారత్ రియాక్షన్ అదుర్స్
Sabarimala gold theft case: శబరిమల ఆలయ ప్రధాన అర్చకుడు అరెస్ట్ - గోల్డ్ గోల్ మాల్ కేసులో సంచలనం !
శబరిమల ఆలయ ప్రధాన అర్చకుడు అరెస్ట్ - గోల్డ్ గోల్ మాల్ కేసులో సంచలనం !
Mahindra XUV 7XO ప్రోస్‌ అండ్‌ కాన్స్‌: ఈ SUV మీకు సరిపోతుందా? మీ డబ్బుకు తగిన విలువ ఇస్తుందా?
Mahindra XUV 7XO ప్లస్‌లు-మైనస్‌లు: కొనేముందు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
IPAC Case in High Court:'న్యాయమూర్తిని మార్చండి' IPAC కేసులో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తికి ED విజ్ఞప్తి!
'న్యాయమూర్తిని మార్చండి' IPAC కేసులో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తికి ED విజ్ఞప్తి!
Embed widget