అన్వేషించండి

Ganesh Chaturthi 2024: గణేష్ చతుర్థి రోజు చంద్రుడిని చూస్తే ఏమవుతుంది! 

Vinayaka Chavithi Vratha Kadha 2024: వినాయక చవితి రోజు చంద్రుడిని చూడకూడదని చెబుతారు...పొరపాటున చూస్తే చేయని తప్పులకు నిందలు మోయాల్సి వస్తుందంటారు..ఎందుకు? చవితి చంద్రుడు ఎందుకంత పవర్ ఫుల్?

Ganesh Chaturthi Vratha Kadha 2024: వినాయక చవితి రోజు ముందుగా పసుపు వినాయకుడిని పూజించి ఆ తర్వాత నూతన విగ్రహానికి ప్రాణప్రతిష్ట చేసి షోడసోపచార పూజ పూర్తిచేస్తారు. పూజంతా అయిన తర్వాత కథ చదువుకుని అక్షతలు భగవంతుడిపై వేసి అవే అక్షతలు తీసుకుని తలపై వేసుకుంటారు. ఇలా చేస్తే నిందలు పడాల్సిన అవసరం లేదని..చవితి చంద్రుడిని చూసినా పర్వాలేదని చెబుతారు. ఇంతకీ చవితి చంద్రుడుని ఎందుకు చూడకూడదు? వినాయకచవితి రోజు పూజ చివర్లో చదువుకోవాల్సిన కథలేంటి?
 
సాధారణంగా పుస్తకాల్లో ఇచ్చే ఆధ్యాత్మిక కథలు చాలావరకూ సంస్కృత పదాలతో ఉంటాయి. వాటిని చదివేందుకు ఇబ్బందిపడతారు. వినాయకుడి పూజ పిల్లలు కూడా శ్రద్ధగా చేసుకుంటారు..అందుకే మీకు అందుబాటులో వాడుక భాషలో కథను మార్చి అందిస్తోంది ఏబీపీ దేశం..

Also Read: అయోధ్య మందిరంలో బాలాపూర్ వినాయకుడు - ఈ సారి వేలంలో లడ్డూ ధర ఎంత పలుకుతుందో!
 
గజాసుర సంహారం

సూతమహర్షి శౌనకాది మహర్షులతో ఇలా చెప్పాడు. గజముఖుడైన రాక్షసుడు తపస్సు చేసి శంకరుడిని మెప్పించి ఎవ్వరూ కోరుకోని వరం కోరాడు. తనను ఎవరూ చంపలేని శక్తిని ఇవ్వాలని, తన పొట్టలోనే శివుడు కొలువైఉండాలని అడిగాడు. మాటిచ్చిన శివుడు తథాస్తు అని మాయమయ్యాడు. అప్పటి నుంచి గజాసురుడి ఉదరంలోనే ఉండిపోయాడు. భర్త పరిస్థితి తెలిసుకున్న పార్వతీదేవి..ఎలాగైనా గజాసురుడి ఉదరం నుంచి బయటకు తీసుకురావని భావించి శ్రీ మహావిష్ణువు సహాయం అడింది. అప్పుడు విష్ణువు గంగిరెద్దులను ఆడిచే వ్యక్తిగా, నంది గంగిరెద్దుగా మారి వెళ్లి.. గజాసురుడి దగ్గర ఆడి మెప్పించారు. ఆ ఆనందంలో వరమిస్తానన్నాడు గజాసురుడు. ఆ అవకాశం కోసమే ఎదురుచూస్తున్న విష్ణువు... నీ ఉదరంలో ఉన్న శివుడిని ఇవ్వాలని కోరాడు. అప్పటికి అసలు విషయం అర్థమైన గజాసురుడు తనకు మరణం తప్పదని భావించి.. నా జీవితం ముగిసిపోతోంది..నా ప్రాణం పోయిన తర్వాత నన్ను మూడు లోకాలు పూజించేలా చేయమని వేడుకున్నాడు. సరేనని మాట తీసుకుని.. నందీశ్వరుడికి తన శరీరాన్ని అప్పగించాడు. నందీశ్వరుడు తన కొమ్ములతో ఉదరాన్ని చీల్చి పరమేశ్వరుడికి విముక్తి కలిగించాడు. అప్పుడు గజాసురుడి చర్మం, శిరస్సు తీసుకుని కైలాశానికి బయలుదేరాడు శివుడు..

Also Read: వినాయక చవితి శుభాకాంక్షలు మీ బంధుమిత్రులకు ఈ శ్లోకాలతో తెలియజేయండి!

 వినాయక జననం

కైలాసంలో పార్వతీదేవి... భర్త రాక గురించి విని స్వాగతం పలికేందుకు సిద్ధమవుతోంది. ముందుగా స్నానం, అలంకరణలో భాగంగా నలుగుపిండితో పరధ్యానంలో ఓ ప్రతిమ చేసింది. ఆ ప్రతిమ బాలుడి రూపంలో కనిపించడంతో ప్రాణంపోసింది. తండ్రి అయిన పర్వతరాజునుంచి ఓ మంత్ర పొందుతుంది పార్వతి...ఆ మంత్ర ప్రభావంతోనే పిండి బొమ్మకి ప్రాణం పోసింది. ఆ బాలుడిని వాకిట్లో కాపలా ఉంచి స్నానానికి వెళ్లింది. ఇంతలో శివుడు రానేవచ్చాడు. లోపలకు వెళుతున్న పరమేశ్వరుడిని అడ్డగించడంతో..ఆగ్రహం చెందిన శివుడు ఆ బాలుడి శిరస్సు ఖండించాడు. ఇంతలో బయటకు వచ్చిన పార్వతి.. జరిగినది తెలుసుకుని చింతిస్తుండగా...పరమేశ్వరుడు తనవెంట తీసుకొచ్చిన గజాసురుడి తలని బాలుడి మొండేనికి అతికించి..ముల్లోకాల్లో పూజలు అందుకుంటాడని దీవించాడు.  

ఆధిపత్యం

వినాయకుడే పెద్ద కొడుకు..కానీ ఆధిపత్యం విషయంలో పోటీ పడ్డాడు కుమారస్వామి. అప్పుడు శివుడు.. మీలో ఎవరైతే ముల్లోకాల్లో పవిత్ర నదుల్లో స్నానమాచరించి ముందుగా వస్తారో వారికే విఘ్నాధిపత్యం ఇస్తానన్నాడు. నెమలివాహనంపై జోరుగా బయలుదేరాడు కుమారస్వామి. కానీ తన పరిస్థితి తనకు తెలుసుకదా..అందుకే తల్లిదండ్రులకు నమస్కరించి ఇప్పుడేం చేయాలని కోరాడు వినాయకుడు. అప్పుడు పరమేశ్వరుడు నారాయణమంత్ర ఉపదేశిస్తాడు. సకల జగత్తును పాలించే ఆదిదంపతులలోనే సమస్త తీర్థాలు ఉన్నాయని భావించి నారాయణ మంత్రం పఠిస్తూ తమచుట్టూ ప్రదక్షిణ చేయమన్నాడు. అలా వినాయకుడు మూడు ప్రదక్షిణలు చేశాడు. మరోవైపు ఏ తీర్థంలో స్నానమాచరించేందుకు వెళ్లినా అక్కడ తనకన్నా ముందుగా గణపయ్య కనిపించాడు. దీంతో వెనక్కు తిరిగి వచ్చిన కుమారస్వామి...ఆధిపత్యం అన్నయ్యకే ఇచ్చేందుకు అంగీకరించాడు.

Also Read: వినాయక నవరాత్రులు ఎప్పటి నుంచి ఎప్పటివరకు - చవితి రోజు పూజ ఏ సమయంలో చేసుకోవాలి!

చంద్రుని పరిహాసం

వినాయకుడు జ్ఞానస్వరూపం, అగ్రపూజ్యనీయుడు...ఈ విషయం మరిచిపోయిన చంద్రుడు..గణనాథుడి వింతరూపాన్ని చూసి, కిందకు వంగి తల్లిదండ్రులకు నమస్కరించలేకపోవడం చూసి నవ్వుతాడు. అది చూసి పార్వతీదేవికి ఆగ్రహం వస్తుంది. ఇకపై చంద్రుడిని చూసినవారికి నీలాపనిందలు తప్పవనే శాపం ఇచ్చింది. దిగివచ్చిన మహర్షులు..ఇదేం శాపం తల్లీ..చంద్రుడిని చూడకుంటే ఎలా అని వేడుకున్నారు.. కేవలం చవితి రోజు చంద్రుడిని చూసినవారే ఈ శాపం అని తనిచ్చిన శాపాన్ని కొంతవరకూ ఉపసంహరించుకుంది. అయితే వినాయక చవితి రోజు కథ చెప్పి అక్షతలు తలపై వేసుకునేవారు చంద్రుడిని చూసినా కానీ ఎలాంటి దోషం అంటదని అనుగ్రహించింది.

 శ్రీ కృష్ణుడికే తప్పలేదు..
 
శాపం గురించి ముల్లోకాలకు తెలుసు..అందుకే వినాయక చవితి రోజు చంద్రుడిని చూడకూడదు అనుకున్నాడు శ్రీ కృష్ణుడు. కానీ ఓ గోవువద్ద పాలు పితుకుతుండగా...ఆ పాలలో చంద్రబింబం కనిపించింది.  సత్రాజిత్తు అనే మహారాజు సూర్యుడిని పూడించి శ్యమంతకమణి పొందాడు. ఆ మణి రోజుకి 8 బారువుల బంగారం అందిస్తుంది. ఆ మణిని ఇమ్మని ఓసారి శ్రీ కృష్ణుడు అడిగుతాడు. ఆ మాటను తిరస్కరిస్తాడు సత్రాజిత్తు. ఆ తర్వాత కొన్నాళ్లకు సత్రాజిత్తు తమ్ముడు  వినాయక చవితి రోజున పాలలో చంద్రబింబం చూసిన శ్రీకృష్ణుడు నిలాపనింద పాలయ్యాడు. సత్రాజిత్తు అనే మాహారాజు సూర్యోపాసనతో శ్యమంతకమను మణిని సంపాదించాడు. రోజుకి ఎనిమిది బారువుల బంగారం ఇస్తుందా మణి. అంతటి శక్తివంతమైన మణిని ఇమ్మని శ్రీకృష్ణుడు కోరతాడు. ఆ కోరికను తిరస్కరిస్తాడు సత్రాచిత్తు. ఆ తర్వాత కొన్ని రోజులకు సత్రాజిత్తు తమ్ముడు ప్రేసనుడు ఆ మణిని వేసుకుని వేటకు వెళ్లాడు. అది మాంసపు ముక్క అని భావించి ఓ సింహం ఆ ప్రసేనుడిని చంపి ఆ మణిని ఎత్తుకెళ్లిపోయింది. ఆ విషయం తెలియని సత్రాజిత్తు నిందను కృష్ణుడిపై వేశాడు. ఇక నిరూపించుకునేందుకు రంగంలోకి దిగిన కృష్ణుడు... అడవిలో వెతుకుతూ ప్రసేనుడి కళేబరం, సింహం అడుగు జాడలు, ఆ తర్వాత భల్లూకం అడుగుజాడలు గమనించి గుహకు చేరుకున్నాడు. జాంబవంతుడితో 28 రోజుల పాటూ భీకరంగా పోరాడి మణిని, జాంబవతిని పొందాడు. రామాయణకాలానికి చెందిన జాంబవంతుడు స్వామీ మీతో ద్వంద్వ యుద్ధం చేయాలని ఉందన్నాడు. ఆ కోరిక మరు జన్మలో తీరుతుందని వరమిచ్చాడు రామచంద్రుడు. అలా జాంబవంతుడి కోరిక కృష్ణావతారంలో నెరవేరింది. ఆ తర్వాత మణిని తీసుకెళ్లి సత్రాజిత్తుకి ఇవ్వడంతో..సత్యభామని ఇచ్చి వివాహం జరిపించాడు. ఆ మణిని నిరాకరించిన శ్రీ కృష్ణుడు సత్యభామను స్వీకరించాడు.

వినాయక వ్రతం చేయకపోవడం, చంద్రుడిని చూడడం వల్ల ఈ నిందలు మోయాల్సి వచ్చిందని చెప్పాడు శ్రీ కృష్ణుడు. అప్పటి నుంచి భాద్రపద శుద్ధ చవితి రోజు వినాయకుడిని పూజించి శమంతకమణి కథను విని అక్షతలు తలపై వేసుకుంటున్నారు...
 
ఓం గం గణపతయే నమః

పూజంతా పూర్తైన తర్వాత... అక్షతలు చేతిలోకి తీసుకుని 
 
మంత్రహీనం... క్రియాహీనం.. భక్తిహీనం.. గణాధిపా.. 
యత్పూజితం.. మయాదేవ పరిపూర్ణం తదస్తుతే...
  
నేను చేసిన పూజావిధానంలో లోపం ఉన్నా..నా భక్తిలో ఎలాంటి లోపం లేదని ఈ శ్లోకానికి అర్థం..
 
అనంతరం 11 గుంజీలు తీస్తే..సకల విఘ్నాలు తొలగి శుభాలు జరుగుతాయని చెబుతారు..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Special Trains: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
APSRTC: ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ - ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ - ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్ళపై ABP గ్రౌండ్ రిపోర్ట్సైబర్ క్రైమ్‌కి స్కామర్, వీడియో కాల్ పిచ్చ కామెడీ!గుడిలోకి చొరబడ్డ ఎలుగుబంట్లు, బెదిరిపోయిన భక్తులుDaaku Maharaaj Teaser | Nandamuri Balakrishna తో బాబీ ఏం ప్లాన్ చేశాడో | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Special Trains: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
APSRTC: ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ - ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ - ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
The Rana Daggubati Show: రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
Flat Screen Vs Curved Screen: ఫ్లాట్ స్క్రీన్ వర్సెస్ కర్వ్‌డ్ స్క్రీన్ - ఈ రెండిట్లో ఏది ఉన్న స్మార్ట్ ఫోన్ తీసుకోవడం బెస్ట్!
ఫ్లాట్ స్క్రీన్ వర్సెస్ కర్వ్‌డ్ స్క్రీన్ - ఈ రెండిట్లో ఏది ఉన్న స్మార్ట్ ఫోన్ తీసుకోవడం బెస్ట్!
Ranji Trophy 2024: రంజీ ట్రోఫీ చరిత్రలో మరో అద్భుతం, ప్రత్యర్థి టీమ్ మొత్తాన్ని ఆలౌట్ చేసిన ఒకే ఒక్కడు
రంజీ చరిత్రలో మరో అద్భుతం, ప్రత్యర్థి టీమ్ మొత్తాన్ని ఆలౌట్ చేసిన ఒకే ఒక్కడు
PM Modi: ప్రధాని మోదీ ఎయిర్ క్రాఫ్ట్‌లో సాంకేతిక సమస్య
ప్రధాని మోదీ ఎయిర్ క్రాఫ్ట్‌లో సాంకేతిక సమస్య
Embed widget