Ganesh Chaturthi Wishes 2024: వినాయక చవితి శుభాకాంక్షలు మీ బంధుమిత్రులకు ఈ శ్లోకాలతో తెలియజేయండి!
Happy Ganesh Chaturthi 2024: సెప్టెంబరు 07 శనివారం వినాయక చవితి..ఈ సందర్భంగా ఈ శ్లోకాలు, మెసేజెస్ తో మీ బంధుమిత్రులకు శుభాకాంక్షలు తెలియజేయండి...
Vinayaka chavithi wishes In Telugu 2024: హిందువుల పండుగల్లో వినాయక చవితికి ఉన్న ప్రత్యేకతే వేరు. అంతా కలసి ఊరూ వాడా సంబరంగా జరుపుకునే పండుగ ఇది. భారీ విగ్రహాల నుంచి చిన్న బొమ్మల వరకూ అందరకీ అందుబాటులో ఉండే భగవంతుడు వినాయకుడు. ఇక్కడ ఉండాల్సింది భారీతనం కాదు భక్తి అంటూ చాటిచెప్పే వినాయకచవితి శుభాకాంక్షలు మీ బంధుమిత్రులకు ఇలా చెప్పేయండి.
Also Read: వినాయక నవరాత్రులు ఎప్పటి నుంచి ఎప్పటివరకు - చవితి రోజు పూజ ఏ సమయంలో చేసుకోవాలి!
మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు
ఓం వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ
నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా
గణేష్ చతుర్థి శుభాకాంక్షలు
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్న వదనం ధ్యాయేత్సర్వ విఘ్నోప శాంతయే
వినాయకచవితి శుభాకాంక్షలు
ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి
తన్నో దంతిః ప్రచోదయాత్
వినాయక చవితి శుభాకాంక్షలు
ఓ బొజ్జ గణపయ్య… నీ బంటు నేనయ్య
ఉండ్రాళ్ళమీదికి దండు పంపు
కమ్మని నేయితో కడు ముద్దపప్పును
బొజ్జ విరుగగ దినుచు పొరలుకొనుచు
వినాయకచవితి శుభాకాంక్షలు
ఏకదంతం మహాకాయం తప్తకాంచనసన్నిభమ్
లంబోదరం విశాలాక్షం వందేహం గణనాయకమ్
వినాయక చవితి శుభాకాంక్షలు
Also Read: ఈ ఏడాది వినాయకచవితికి మీరు సందర్శించుకోవాల్సిన ప్రముఖ ఆలయాలివే!
తలచెదనే గణనాథునితలచెదనే విఘ్నపతిని
దలచినపనిగా దలచెదనే హేరంబునిదలచెద నా
విఘ్నములను తొలగుట కొరకున్
గణేష్ చతుర్థి శుభాకాంక్షలు
తొండము నేకదంతమును తోరపు బొజ్జయు వామహస్తమున్
మెండుగ మ్రోయు గజ్జెలును మెల్లని చూపుల మందహాసమున్
కొండొక గుజ్జురూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జయైయుండెడి
పార్వతీ తనయ ఓయి గణాధిపా నీకు మ్రొక్కెదన్
వినాయకచవితి శుభాకాంక్షలు
అటుకులు కొబ్బరి పలుకులుచిటిబెల్లము
నానుబ్రాలు చెరకురసంబున్ నిటలాక్షు
నగ్రసుతునకుబటుతరముగ విందుచేసి ప్రార్థింతు మదిన్
గణేష్ చతుర్థి శుభాకాంక్షలు
ఆదిపూజ్యుడికి అభివందనం..
పార్వతీనందనుడికి ప్రియవందనం..
ముల్లోకాలను ఏలే మూషికా వాహనుడికి మనసే మందిరం
మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు
విఘ్నాలను తొలగించే వినాయకుడికి
అఖండ భక్తకోటి అందించే అపూర్వ నీరాజనం
ఓ విఘ్నేశ్వరాయ నమ:
గణేష్ చతుర్థి శుభాకాంక్షలు
Also Read: గణపతిని 21 ఆకులతోనే ఎందుకు పూజించాలి..ఆ పత్రి ఏంటో తెలుసా!
గజాననం భూతగణాదిసేవితం కపిత్త జంబూఫల సారభక్షితం|
ఉమాసుతం శోకవినాశ కారణం నమామి విఘ్నేశ్వర పాద పంకజం||
వినాయక చవితి శుభాకాంక్షలు
ఓం గణ గణపతయే నమో నమ:!
గణేష్ చతుర్థి శుభాకాంక్షలు
శ్రీ సిద్ధి వినాయక నమో నమ:
వినాయకచవితి శుభాకాంక్షలు
గణపతి బప్పా మోరియా
మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు
మట్టి గణపతిని పూజిద్దాం..పర్యావరణాన్ని పరిరక్షిద్దాం
మీ అందరకీ వినాయక చవితి శుభాకాంక్షలు
బొజ్జ గణపతి మీ కోర్కెలు నెరవేర్చి సకల విజయాలను అందించాలని ప్రార్థిస్తూ..
మీకు మీ కుటుంబసభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు
గణేషుడు మీ జీవితంలో ఇంద్రధనస్సు విరిసేలా చేయాలని కోరుకుంటూ..
వినాయక చవితి శుభాకాంక్షలు
సకల విఘ్నాలు తొలగించే ఆ వినాయకుడి ఆశీస్సులు మీపై ఉండాలని కోరుకుంటూ
వినాయక చవితి శుభాకాంక్షలు
పార్వతీతనయుడు మీకు ఆయుష్షు, ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందం ప్రసాదించాలని కోరుతూ
వినాయక చవితి శుభాకాంక్షలు
తలపెట్టిన పనులు విజయవంతం కావాలి
మీ ఇంట సుఖశాంతులు వెల్లివిరియాలి
హ్యాపీ గణేష్ చతుర్థి
ఇదే నూతన ఆరంభంలా భావించి రోజును ప్రారంభించండి
ఈ రోజు నుంచి మీకు అన్నీ శుభాలే కలగాలని ప్రార్థిస్తూ
వినాయకచవితి శుభాకాంక్షలు
చిన్నా పెద్దా అందరకీ బంధువైన గణనాథుడు
మీ ఆనందాన్ని రెట్టింపు చేయాలని కోరుకుంటూ
గణేష్ చతుర్థి శుభాకాంక్షలు
Also Read: సింగపూర్ లో సంపెగ, నేపాల్ లో తంత్ర, శ్రీలంకలో పిళ్లయార్..విదేశాల్లో మన గణపయ్య!