News
News
X

Karthika Masam 2022: కార్తీకమాసంలో నెల రోజులూ వ్రతం చేయనివారు ఈ ఐదు రోజులు పాటిస్తే చాలు

కార్తీక శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక పూర్ణిమ వరకు గల ఐదురోజులు మిక్కిలి విశేషమైనవి. వీటిని పంచ పర్వాలుగా పేర్కొంటారు. నెల రోజులు కార్తీక వ్రతం చేయనివారు కనీసం ఈ ఐదు రోజులైనా వ్రతాన్ని నిర్వహిస్తే చాలు.

FOLLOW US: 

నకు ఉత్తరాయణం, దక్షిణాయనం అనే రెండు ఆయనాలున్నాయి. ఉత్తరాయణ పుణ్యకాలానికి మాఘమాసం ఎంత పవిత్రమైనదో దక్షిణాయన పుణ్యకాలానికి కార్తీకమాసం అంత పవిత్రమైనదని పురాణాలలో చెప్పబడింది. కార్తీకమాసంలో ఆచరించాల్సిన విధివిధానాలన్ని కార్తీక పురాణంలో పేర్కొన్నారు. కానీ మనలో చాలామందికి కొన్ని కారణాలవల్ల కార్తీకమాస వ్రతాన్ని చేయడానికి వీలు కుదరదు. అలాంటి వారు కార్తీక మాసంలో వచ్చే ఈ ఐదురోజులలో తప్పనిసరిగా వ్రతాన్ని ఆచరిస్తే కార్తీక మాసం మొత్తం వ్రతం చేసిన పుణ్యఫలం లభిస్తుందట.

కార్తీక శుద్ద ఏకాదశి నుంచి కార్తీక పూర్ణమి వరకు గల ఈ ఐదు రోజులను పంచ పర్వాలు అంటారు. కార్తీకమాసంలో ఉన్న అన్నీ రోజులు విశేషమైనవే అయినా ప్రత్యేకించి ఈ ఐదు రోజులు కార్తీక మాసంలో ఎక్కువ విశేషమైనవి. కార్తీక శుక్ల ఏకాదశిని ఉత్థాన ఏకాదశి అంటారు. అంటే ఆషాడ శుద్ధ ఏకాదశి మొదలు కార్తీక శుద్ధ ద్వాదశి వరకు గల నాలుగు నెలలను చాతుర్మాస్య వ్రతంగా చెప్తారు. శ్రీ మహా విష్ణువు ఆషాడ శుద్ధ ఏకాదశి మొదలు.. కార్తీక శుద్ధ ఏకాదశి వరకు యోగనిద్రలో ఉండి, తిరిగి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్ర నుంచి మేల్కొంటాడు. కాబట్టి ఈ ఏకాదశిని ”ఉత్థాన ఏకాదశి” అని పిలుస్తారు

ఇక ఏకాదశి మర్నాడు ద్వాదశి తిథిని ఉత్థాన ద్వాదశి గా పిలుస్తారు. దీన్నే చిలుకు ద్వాదశి అని కూడా అంటాం. కృతాయుగంలో దేవతలు, రాక్షసులు అమృతం కోసం క్షీరసాగరాన్ని ఈరోజునే మధించారు. కనుక దీన్ని చిలుకు ద్వాదశి లేదా, క్షీరాబ్ది ద్వాదశి అని కూడా అంటారు. ఉసిరిక కొమ్మ విష్ణువు అవతారంగా, తులసీదేవిని లక్ష్మీదేవిగా భావిస్తాం కనుక ఈరోజున ఉసిరిక కొమ్మను, తులసి మొక్కను  కలిపి తప్పకుండా పూజించాలి. కార్తీక ద్వాదశి నుంచి పూర్ణిమ లోపల నిర్వహించే తులసీ కళ్యాణం కూడా ఈరోజే జరిపిస్తారు. యతీశ్వరులు, సాధువుల చాతుర్మాస్య వ్రత దీక్ష కూడా ఈరోజుతో ముగుస్తుంది.

కార్తీక శుద్ద త్రయోదశి రోజున కార్తీక విధులను అనుసరిస్తూ, వీలయితే సాలగ్రామం దానం చేయాలి. ఈరోజున కూడా ఉపవాసం ఉండాలి రాత్రి పూట భోజనం చేయరాదు. త్రయోదశి తిథికి శనిదేవుడు అధిపతి కాబట్టి ఈరోజున చేసే పుణ్య కార్యక్రమాల వల్ల శనీశ్వరుడి అనుగ్రహం కలుగుతుంది.

News Reels

కార్తీక శుద్ద చతుర్ధశిని వైకుంఠ చతుర్ధశిగా పిలుస్తారు. శివకేశవులకు బేధం లేదని తెలియజేయడానికి సాక్షాత్తూ శ్రీమహావిష్ణువు ఈరోజున కాశీ క్షేత్రానికి వచ్చి, శివుడిని అర్చిస్తాడట. ఈరోజున లింగ వ్రతాన్ని ఆచరించి జాగరణ చేయాలి. ఈరోజు శివకేశవులని ఆరాధించి దీపదానాన్ని చేయాలి.

ఇక కార్తీక పూర్ణమి చాలా విశేషమైన తిథి. దీన్నే దేవదీపావళి అని, కైశిక పౌర్ణమి అని, తెలంగాణ పరిభాషలో జీటికంటి పున్నమి అని కుమార దర్శనమనే పేర్లతో కూడా పిలుస్తారు. ఈరోజున జ్వాలాతోరణం, దీపాలను వెలిగించడం, దీపదానాలు, నదీస్నానాలు, తులసీ, ఉసిరి చెట్లను పూజించడంలాంటి పనులను తప్పకుండా నిర్వహించాలి. 

Also Read: సర్పదోషాలు తొలగాలంటే నాగుల చవితి రోజున ఇలా చేయండి

Published at : 25 Oct 2022 06:40 PM (IST) Tags: Lord Shiva karhika masam lord vihnu karthika purnami karthika ekadashi

సంబంధిత కథనాలు

Kaal Bhairav Astami 2022: ఎలాంటి దోషాలనైనా తొలగించే కాలభైరవాష్టకం,  కాలభైరవాష్టమి రోజు పఠిస్తే మరింత మంచిది!

Kaal Bhairav Astami 2022: ఎలాంటి దోషాలనైనా తొలగించే కాలభైరవాష్టకం, కాలభైరవాష్టమి రోజు పఠిస్తే మరింత మంచిది!

Horoscope for December 2022 :ఈ రాశివారు దుష్టుల సహవాసానికి దూరంగా ఉండాలి, డిసెంబరు నెల రాశిఫలాలు

Horoscope for December 2022 :ఈ రాశివారు దుష్టుల సహవాసానికి దూరంగా ఉండాలి, డిసెంబరు నెల రాశిఫలాలు

Love Horoscope Today 29th November 2022: ఈ రాశి దంపతుల మధ్య మంచి సమన్వయం ఉంటుంది

Love Horoscope Today 29th November 2022:  ఈ రాశి దంపతుల మధ్య మంచి సమన్వయం ఉంటుంది

Daily Horoscope Today 29th November 2022: ఈ రాశి ఉద్యోగులకు ఇంకొన్నాళ్లు ఇబ్బందులు తప్పవు, నవంబరు 29 రాశిఫలాలు

Daily Horoscope Today 29th November 2022: ఈ రాశి ఉద్యోగులకు ఇంకొన్నాళ్లు ఇబ్బందులు తప్పవు, నవంబరు 29 రాశిఫలాలు

Christmas Tree: క్రిస్మస్‌ పండుగలో క్రిస్మస్‌ చెట్టును ఎందుకు ఉంచుతారో తెలుసా ?

Christmas Tree: క్రిస్మస్‌ పండుగలో క్రిస్మస్‌ చెట్టును ఎందుకు ఉంచుతారో తెలుసా ?

టాప్ స్టోరీస్

Chandrababu On Viveka Case : సొంత బాబాయ్ హత్య కేసు వేరే రాష్ట్రానికి బదిలీ, తలెక్కడ పెట్టుకుంటావ్ - చంద్రబాబు

Chandrababu On Viveka Case : సొంత బాబాయ్ హత్య కేసు వేరే రాష్ట్రానికి బదిలీ, తలెక్కడ పెట్టుకుంటావ్ - చంద్రబాబు

Sajjala On Viveka Case : వివేకా హత్య కేసులో నిజాలు తెలియాలి, తెలంగాణలో విచారణ జరిగితే మంచిదే- సజ్జల

Sajjala On Viveka Case : వివేకా హత్య కేసులో నిజాలు తెలియాలి, తెలంగాణలో విచారణ జరిగితే మంచిదే- సజ్జల

Hayathnagar Molested Case: హయత్ నగర్ రేప్‌ కేసులో విస్మయం కలిగించే నిజాలు, బాలుర తీరుతో దిగ్భ్రాంతి!

Hayathnagar Molested Case: హయత్ నగర్ రేప్‌ కేసులో విస్మయం కలిగించే నిజాలు, బాలుర తీరుతో దిగ్భ్రాంతి!

Kashmir Files: ‘కశ్మీరీ ఫైల్స్’ ప్రచారం కోసం తీసుకున్న అసభ్యకర చిత్రం - మంటలు రేపుతున్న ఇఫీ అధ్యక్షుడి కామెంట్స్

Kashmir Files: ‘కశ్మీరీ ఫైల్స్’ ప్రచారం కోసం తీసుకున్న అసభ్యకర చిత్రం - మంటలు రేపుతున్న ఇఫీ అధ్యక్షుడి కామెంట్స్