Bakrid 2023: ముస్లిం సోదరులు బక్రీద్ పండుగను ఎందుకు జరుపుకుంటారు
Bakrid 2023: బక్రీద్ లేదా ఈద్-ఉల్-అదా ముస్లింలు జరుపుకునే ముఖ్యమైన పండుగలలో ఒకటి. ఈ ఏడాది జూన్ 29న బక్రీద్ జరుపుకొంటారు. ముస్లింలు బక్రీద్ పండుగను ఎందుకు జరుపుకొంటారు? బక్రీద్ పండుగ ప్రాముఖ్యత ఏమిటి?
Bakrid 2023: ఈ ఏడాది జూన్ నెలాఖరున ముస్లిం సోదరులు బక్రీద్ పండుగను జరుపుకొంటున్నారు. ఇస్లాం మతాన్ని విశ్వసించే ప్రజల పండుగలలో బక్రీద్ ముఖ్యమైనది. త్యాగానికి ప్రతీకగా ఈ పండుగను జరుపుకొంటారు. ఇస్లాం సంప్రదాయం జిల్హిజ్ మాసంలో చంద్ర దర్శనం అనంతరం బక్రీద్ పండుగ జరుపుకుంటారు. ఈ సంవత్సరం మన దేశంలో ఈద్ ఉల్-అదా అంటే బక్రీద్ జూన్ 29వ తేదీ గురువారం నిర్వహిస్తుండగా.. సౌదీ అరేబియాలో జూన్ 28న ఈద్ ఉల్-అధా జరుపుకొంటున్నారు. ఇస్లాంలో, ఈ రోజున త్యాగానికి ప్రత్యేక ప్రాముఖ్యం ఇచ్చారు. బక్రీద్ పండుగ ప్రాముఖ్యం, ఈ పండుగ విశిష్టత గురించి తెలుసుకోండి.
Also Read: జూన్ 28 రాశిఫలాలు , ఈ రోజు ఈ రాశివారికి గ్రహస్థితి కలిసొస్తుంది!
ఈద్-ఉల్-అదా రోజు గొర్రెను ఎందుకు బలి ఇస్తారు?
ఇస్లాం మత పెద్దల అభిప్రాయం ప్రకారం, ప్రవక్త హజ్రత్ ఇబ్రహీం మొహమ్మద్ తనను తాను దేవుని ఆరాధనకు అంకితం చేసుకున్నాడు. అతని ఆరాధన పట్ల అల్లా ఎంతగానో సంతోషించాడు. ఒకరోజు అల్లా ప్రవక్త హజ్రత్ ఇబ్రహీంను పరీక్షించాలని నిర్ణయించుకున్నాడు. ఇబ్రహీం వద్దకు వచ్చి, నీకు అత్యంత ప్రియమైన లేదా అత్యంత విలువైన వస్తువును త్యాగం చేయమని అడిగాడు, అప్పుడు ఇబ్రహీం తన సొంత కుమారుడిని బలి ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. అప్పుడు అల్లా ఇతను నీ కుమారుడు కదా అని అడిగాడు.
అప్పుడు ప్రవక్త హజ్రత్ ఇబ్రహీం మొహమ్మద్ తన కుమారుని కంటే తనకు ప్రియమైనది కానీ, విలువైనది కానీ ఏదీ లేదని చెప్పాడు. అతన్ని త్యాగం చేయడానికి ముందుకొచ్చాడు. అతను తన కొడుకును బలి ఇవ్వాలనుకున్న వెంటనే, అల్లా ఇబ్రహీం కొడుకు స్థానంలో ఒక గొర్రెను ఉంచాడు, అతని కుమారుడిని మళ్లీ అతనికి అప్పగించాడు. బలి ఇచ్చే స్థలంలో గొర్రెను చూసి ఆశ్చర్యపోయిన ఇబ్రహీం తన కొడుకు గురించి అల్లాను ఆరా తీస్తాడు. అప్పుడు, అల్లా నాపై నీ కళంకమైన భక్తిని చూసి, నేను ఓడిపోయాను. నీ భక్తికి నేను సంతోషిస్తున్నాను అని ఇబ్రహీం కుమారుడిని అతని వద్దకు తిరిగి ఇస్తాడు. అప్పటి నుంచి బక్రీద్ పండుగను జరుపుకోవడం మొదలైంది. బక్రీద్ పండుగలో గొర్రెలను బలి ఇచ్చే సంప్రదాయం పుట్టింది.
Also Read: చాతుర్మాస్య దీక్ష చేస్తే పొలిమేర దాటకూడదా - ఈ దీక్ష వెనుకున్న ఆంతర్యం ఏంటి!
బక్రీద్ ప్రాముఖ్యం
ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం, జిల్హిజ్ నెలను సంవత్సరంలో చివరి నెలగా భావిస్తారు. ఈ నెలలో మొదటి రోజు ముస్లిం సోదరులకు చాలా ముఖ్యమైనది. ఈ రోజు చంద్రుని దర్శనంతో, బక్రీద్ లేదా ఈద్ ఉల్-అదాను ప్రకటిస్తారు. చంద్రుడు దర్శనమిచ్చిన పదవ రోజున బక్రీద్ పండుగ జరుపుకొంటారు. ఇస్లామిక్ విశ్వాసాల ప్రకారం, ఈద్-ఉల్-అదా ఇస్లామిక్ క్యాలెండర్ చివరి నెలలో జరుపుకొంటారు. ఈద్ తర్వాత రెండు నెలల తర్వాత బక్రీద్ జరుపుకుంటారు. బక్రీద్ ఇస్లాంలో త్యాగానికి చిహ్నంగా పరిగణిస్తారు. బక్రీద్ నాడు, ఈద్-ఉల్-ఫితర్ నాడు అంటే, ఈద్ పండుగ రోజున గొర్రెలను బలి ఇచ్చి, ఖీర్ తయారు చేసి, పొరుగువారికి పంపిణీ చేస్తారు.
ముస్లింలు బక్రీద్ ఎలా జరుపుకొంటారు
ముస్లిం సోదరులు ఈ రోజు ఈద్గాలు, మసీదుల్లో ప్రార్థనలు చేస్తారు. బక్రీద్ రోజు ఉదయం నమాజ్ చేయడంతో ఈ పండుగ ప్రారంభమవుతుంది. ఈ సంతోషకరమైన సందర్భాలలో పేదలకు సహాయం చేయాలని ఇస్లాంలో పేర్కొన్నారు. బక్రీద్ బక్రీద్ పండుగ రోజున ఏ జంతువును బలి ఇచ్చినా దాని మాంసాన్ని మూడు భాగాలుగా కోయాలి. ఈ 3 భాగాలలో కొంత భాగాన్ని పేదలకు పంచాలి. రెండవ భాగాన్ని బంధువులకు పంచి, మూడవ భాగాన్ని ఇంటివారు ఉపయోగించాలనే సంప్రదాయం ఉంది. బక్రీద్ ముస్లిం సమాజానికి పవిత్రమైన పండుగ, ఇబ్రహీం త్యాగం, అల్లాకు విశ్వాసుల భక్తిని గుర్తుచేసే రోజు.