Pournami and Amavasya: అమావాస్య-పౌర్ణమికి పిచ్చి ముదురుతుందా , వ్యాయామం చేసేవారిపైనా ప్రభావం ఉంటుందా!
ఎవరైనా చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తే చాలు..అమావాస్యకి, పున్నమి వస్తోంది పిచ్చి ముదిరిందా ఏంటి అంటుంటారు. అమావాస్య , పౌర్ణమి కి పిచ్చికి ఏంటి సంబంధం...ఎందుకలా అంటారు!
Pournami and Amavasya: అమావాస్య, పౌర్ణమి వచ్చేసరికి కొందరి ప్రవర్తన భిన్నంగా ఉంటుంది. కొందరిలో మూడ్ స్వింగ్స్ ఉంటాయి. పౌర్ణమి, అమావాస్య వస్తోంది కదా అంతేలే అనేస్తుంటారు. ఇందులో నిజమెంత అని ఆలోచిస్తే..నిజంగా నిజమే. ఎందుకంటే...చంద్రుడి ప్రభావం మనిషి ఆరోగ్యంపై, ముఖ్యంగా ఆలోచనలపై ఉంటుందని పలు అధ్యనాల్లో స్పష్టమైంది. అందుకే చంద్రుడుని మనఃకారకుడు ( మనస్సుపై ప్రభావం చూపేవాడు) అంటారు. అసలు చంద్రుడి ప్రభావం మనసుపై ఎలా ఉంటుంది? తిథులకు ఆరోగ్యానికి ఏంటి సంబంధం? జ్యోతిష్య శాస్త్ర పండితులు ఏం చెబుతున్నారు?
Also Read: ఫాల్గుణ పూర్ణిమ ఈ 3 రాశువారికి అదృష్టం, ఆర్థికలాభం!
పౌర్ణమి-అమావాస్యకి పిచ్చి ముదురుతుందా!
పౌర్ణమి రోజు సూర్యడు - చంద్రుడు ఇద్దరూ భూమికి రెండు వైపులా ఒకేస్థాయిలో ఆకర్షణ కలిగి ఉంటారు. చంద్రుడు జలకారకుడు..మనిషి శరీరంలో నీరుటుంది..అందుకే విపరీతంగా ఆకర్షిస్తాడు. అందుకే వ్యాధిగ్రస్తులకు ఉన్న రోగం ఈ సమయంలో పెరుగుతుంది. మానసిక సమస్యలు ఉన్నవారు మరింత వేదనకు గురవుతారు. మనిషి మెదడులో ఆటుపోట్లకు చంద్రుడు కారణం. మెదడులో నీటి శాతం ఎక్కువ ఉన్నందున, చంద్రుని గురుత్వాకర్షణ శక్తి మెదడుపై ప్రభావం చూపుతుందని డచ్ శాస్త్రవేత్త పరిశోధనలో వెల్లడైంది. ఈ సమయంలో మూడ్ స్వింగ్స్ ఎక్కువ ఉంటాయనేది డచ్ పరిశోధకుల అధ్యయన సారాశం. ఇదంతా తెలియకపోయినా...అమావాస్య, పౌర్ణమికి పిచ్చి ముదురుతుందని పెద్దలు అనడం వెనుకున్న ఆంతర్యం ఇదే.
Also Read: శవాల బూడిదతో హోలీ సంబరాలు - ఇక్కడ వారం ముందు నుంచే సందడి మొదలు!
పిచ్చి పెరుగుతుంది - మూర్ఛవ్యాధి తగ్గుతుంది
డచ్ శాస్త్రవేత్తల పరిశోధనలో మూడ్ స్వింగ్స్ ఎక్కువ ఉంటాయని తేలితే...బ్రిటీష్ శాస్త్రవేత్తల అధ్యయనంలో మాత్రం నిండు పౌర్ణమి మూర్ఛ వ్యాధిని తగ్గిస్తుందని వెల్లడైంది. ఎందుకంటే...చంద్రుడు ప్రకాశవంతంగా ఉన్నప్పుడు మూర్చ రోగుల్లో ఎపిలెప్టిక్ మూర్ఛలు తక్కువ ఉన్నట్లు వారు గమనించారు. సూర్యుడు అస్తమించినప్పుడు మీ మెదడులో సహజంగా స్రవించే మెలటోనిన్ అనే హార్మోన్ దీనికి కారణం అవుతుందట. పౌర్ణమి రోజు చంద్రుడి కిరణాలు సోకిన రోజు ఈ హార్మోన్ ప్రభావం ఎక్కువగా ఉంటుందని అధ్యనంలో వెల్లడైంది.
కిడ్నీ సమస్యలు పెరుగుతాయి
యూరాలజీ జర్నల్‌లో ప్రచురించిన ఒక అధ్యయనంలో...కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడేవారికి ప్రతి పౌర్ణమికి సమస్య పెరుగుతుందని తేలింది. ఈ సమయంలో నొప్పి ఎక్కువగా ఉంటుందని, ఎక్కువ మంది హాస్పిటల్లో చేరుతున్నారని గుర్తించారు.
Also Read: శ్రీ క్రోధి నామ సంవత్సరం ఈ రాశివారికి యోగకాలం - ఆ ఒక్క విషయంలో చిన్న చిన్న ఇబ్బందులు తప్పవ్!
ఋతుచక్రంపై చంద్రుడి ప్రభావం
స్త్రీలలో ఋతు చక్రం వచ్చే సగటు సమయం 28 రోజులు..అంటే చంద్రుడితో సమానంగా ఉంటుంది. స్త్రీలలో పౌర్ణమి దగ్గరలో అండోత్పత్తి, అమావాస్య సమయంలో ఋతుస్రావం అవుతుందని గుర్తించారు చైనా పరిశోధకులు...సంతానోత్పత్తిపై చంద్రుడి ప్రభావం ఉందని చెప్పేందుకు ఇదే నిదర్శనం అంటారు.
వ్యాయామం చేసేవారు ఇది గమనించారా!
చంద్రుడి నుంచి వెలువడే కాంతి కిరణాలు ఓ వ్యక్తి హృదయ స్పందనలపై ప్రభావం చూపుతుందని అధ్యయనాల్లో స్పష్టమైంది. డైలీ వ్యాయామం చేసేవారు సరిగ్గా గమనిస్తే ఈ విషయం అర్థమవుతుంది. ఎందుకంటే రోజూ వ్యాయామం చేసేవారి హృదయ స్పందన ...మిగిలిన రోజుల కన్నా పౌర్ణమి, అమావాస్య రోజు పెరుగుతుంది. అందుకే ఆ రెండురోజుల్లో వ్యాయామం చేసేవారు అతిగా కష్టపడకూడదు అంటారు ఆరోగ్య నిపుణులు.
శాస్త్రీయ కారణాలు ఏమైనా కానీ..పౌర్ణమి,అమావాస్య రోజు చంద్రుడి ప్రభావం ఆరోగ్యంపై కచ్చితంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పారు, ఎన్నో అధ్యయనాల్లో వెల్లడైంది. అందుకే మానసిక సమస్యలు ఉన్నవారు, కిడ్నీ సంబంధిత సమస్యలు ఉన్నవారు ఆ రెండు రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి.