చంద్రగ్రహణం పరిహారాలు మీ రాశి ప్రకారం! మేష రాశి వారికి చంద్ర గ్రహణం సమయంలో అనారోగ్య సూచనలున్నాయి. హనుమాన్ చాలీసా పారాయణం చేయాలి. వృషభ రాశి వారు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు మరింత కష్టపడాలి. గ్రహణం రోజు మీరు అన్నదానం చేయండి. చంద్ర గ్రహణం మిథున రాశివారికి అనుకూల ఫలితాలను ఇస్తోంది. పశువులకు మేత తినిపించండి. చంద్ర గ్రహణం కర్కాటక రాశివారి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. చంద్రుడి శ్లోకం జపించండి. చంద్రగ్రహణం సింహ రాశివారికి శుభప్రదమైన ఫలితాలనిస్తుంది. ఆరోగ్యం జాగ్రత్త. సూర్యుడి బీజ మంత్రాన్ని జపించండి. కన్యా రాశివారికి చంద్ర గ్రహణం కాలంలో అశుభ ఫలితాలొచ్చే అవకాశం ఉంది. గోమాతకు సేవ చేస్తే శుభ ఫలితాలుంటాయి. తులారాశివారి వైవాహిక జీవితంలో సమస్యలొస్తాయి. ఆరోగ్యం జాగ్రత్త. పేదలకు అన్నదానం చేయండి. వృశ్చిక రాశివారికి చంద్రగ్రహణం మిశ్రమ ఫలితాలనిస్తుంది. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. ధనస్సు రాశివారి ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది చంద్రగ్రహణం. గోమాతకు సేవ చేయండి చంద్రగ్రహణం మకర రాశివారిని సమస్యల్లో నెట్టేస్తుంది. సూర్య బీజ మంత్రం జపించాలి. ఈ రాశి వారు తొలి చంద్ర గ్రహణం వేళ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. చెప్పులు దానం చేయండి. మీన రాశివారికి చంద్రగ్రహణం మంచి ఫలితాలనివ్వదు. బృహస్పతి బీజ మంత్రాన్ని జపించండి. మూగజీవాలకు ఆహారం అందించండి.