హోలీ పండుగకు ఈ దాన ధర్మాలు చేస్తే లక్ష్మీ దేవి మీ ఇంటే!
హోలీ రోజున ఇవి దానం చేస్తే లక్ష్మీ దేవి ఆశీస్సులతో ధనధాన్య వర్షం కురుస్తుంది.
హోలీ ఆనందాల పండుగ. వసంతానికి రంగులతో పలికే ఆహ్వానం. ఒకరి మీద ఒకరు రంగులు చల్లుకుంటూ ఉల్లాసంగా గడిపే రోజు. ఈ రోజున అందరూ ఆనందంగానే ఉంటారు. అయితే, అది కొందరికి మాత్రమే. ఆర్థికంగా ఇబ్బందిపడే కుటుంబాల్లో ఆ సంతోషమే ఉండదు. అందరూ ఆనందంగా ఉండటమే పండుగ అని సనాతన ధర్మం చెబుతోంది. అందులో భాగంగానే శక్తి కలిగిన వారు కొంత దాన ధర్మాలు చెయ్యాలని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఈ రోజున కొన్ని రకాల దానాలు ప్రత్యకంగా చెయ్యడం వల్ల ఇంట్లో సుఖసంతోషాలు సమృద్ధిగా ఉంటాయని పండితులు చెబుతున్నారు.
హోలీ రోజున ఇవి దానం చేస్తే లక్ష్మీ దేవి ఆశీస్సులతో ధనధాన్య వర్షం కురుస్తుంది.
ఫల్గుణ పౌర్ణమి రోజున హోలికా దహనం జరుగుతుంది. ఈ సంవత్సరం మార్చి 7న ఈ సంబురం జరుగుతుంది. మరుసటి రోజు మార్చి 8న వచ్చే చైత్ర ప్రతిపద రోజున రంగులతో హోలీ ఆడతారు. ఈ సారీ హోలికా దహనం రోజున నాలుగు ప్రత్యేక యోగాలు జరుగుతున్నాయి. ఈ యోగ కాలంలో పూజలు, దానాలు చేస్తే లక్ష్మీ దేవి శాశ్వతంగా ఉండిపోతుంది.
జ్యోతిష్యం ప్రకారం ఈసారి హోలికా దహనం రోజున వాశియోగం, సన్ఫయోగం, శంఖ యోగం, సుకర్మ యోగం వంటి శుభయోగాలు ఏర్పడుతున్నాయి. ఈ సమయంలో చేసే దానాలు చాలా మంచి ఫలితాలను ఇస్తాయి. లక్ష్మీ కటాక్షం కోసం ఈ మూడు వస్తువులను దానం చెయ్యడం వల్ల ఎలాంటి శుభయోగాలు కలుగుతాయో తెలుసుకుందాం.
హోలికా దహన మూహూర్తం మార్చి 7 రోజున సాయంత్రం 6.24 నిమిషాల నుంచి రాత్రి 8.51 నిమిషాల వరకు దాదాపు రెండు గంటల 27 నిమిషాలు ఉంటుంది. రంగుల వసంతం ఆడేది మార్చి 8న.
విరాళంగా కొంత సొమ్ము
జోతిష్యం ప్రకారం హోలీ రోజున దేవాలయానికి వెళ్లి బ్రాహ్మణుడికి తేదా పేదవారికి డబ్బును విరాళంగా ఇవ్వడం వల్ల ఇంట్లో ధనం నిలుస్తుంది. శుభ పలాలలను అందుకుంటారు. అందుకే శక్త్యానుసారం ఈ రోజున కొంత డబ్బు దానం చెయ్యడం చాలా మంచిది.
వస్త్రదానం
హోలీ రోజున అవసరంలో ఉన్న వారికి వస్త్రాలు దానం చెయ్యడం చాలా శుభప్రదంగా భావిస్తారు. హోలీ రోజు వస్త్రాలు దానం చెయ్యడం చాలా పుణ్య కార్యం. లక్ష్మీ దేవి ప్రసన్నురాలై ఆమె కరుణాకటాక్షం లభిస్తుంది.
అన్నదానం
దానాల్లోకెల్లా ఉత్తమ దానం అన్న దానం. హోలీ పర్వదినానా ఆహారం దానం చెయ్యడం ఆకలితో ఉన్న వారి ఆకలి తీర్చడం వల్ల పుణ్యం వస్తుంది. హోలీ పండుగ నాడు పేదలకు భోజనం పెట్టడం చాలా మంచిది. ఇంట్లో వండిన వంటలో కొంత భాగం పేదలకు దానం చేస్తే ఎంతో పుణ్యం. అంతేకాదు శక్తి కలిగిన వారు ఆకలిగా ఉన్న వారి కోసం ఒక అన్నదాన శిభిరం ఆరోజు నడిపితే ఎంతో మంచిది. ఇలా చెయ్యడం వల్ల ఇల్లు సమృద్ధిగా ఉంటుంది. ధనధాన్యాలకు లోటు ఎన్నటికీ ఏర్పడదు.
గమనిక: శాస్త్రాలు, పండితులు, పురాణాల్లో చెప్పిన విషయాలను ఇక్కడ యథావిధిగా అందించాం. ఇందులోని అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించదని గమనించగలరు.