అన్వేషించండి

Ganesh Chaturthi 2024: వినాయక చవితి జీవిత పాఠాలు నేర్పే వెబినార్‌- గణేషుడు నేర్పే లెసెన్స్‌ ఇవే!

Ganesh Chaturthi 2024: మన పండుగలు కేవలం ఉత్పవాలు మాత్రమే అనుకుంటే పొరపాటే. పండుగ, దాని పద్ధతుల వెనుక ఒక జీవిత పాఠం తప్పక ఉంటుంది. మరి వినాయక చవితి ఏలాంటి పాఠాలు నేర్పుతుందో తెలుసా మీకు?

Ganesh Chaturthi 2024: విజ్ఞనాయకుడు గణేషుడు. కేవలం విజ్ఞాలు తొలగించే వాడు మాత్రమే కాదు గురుతుల్యుడు కూడా. ఏకదంతుడి కథలు పురాణాల్లో కూడా ప్రత్యేకం. ఈ కథల నుంచి జీవితపాఠాలు నేర్చుకోవచ్చు.

కర్తవ్య పాలనే ముందు

శివుడు లేని సమయంలో స్నానానికి వాడే నలుగు పిండితో పార్వతి చేసిన పిండి బొమ్మ గణపతి. స్నానానికి వెళ్తు కాపలాగా ఉండాల్సిందిగా ఆదేశించింది. ఆమె స్నానం చేసి వచ్చే వరకు రక్షణ బాధ్యత ఆ బాలుడిదన్న మాట. తిరిగొచ్చిన శివుడిని సైతం లోపలికి రానివ్వకుండా అడ్డుకున్నాడు. శివుడు కోపగించుకుని ఇద్దరి మధ్య గొడవకు దారి తీసి ఆబాలుడి తల నరకడంతో ఈ గొడవ పూర్తవుతుంది. తర్వాత ఆబాలుడెవరో తెలుసుకుని ఏనుగు తల అతికిండంతో ఆ ఘట్టం పూర్తవుతంది. ప్రాణం పోయినా సరే విధినిర్వహణలో వెనుకకు తగ్గకూడదనే సందేశం ఈ కథ ద్వారా మనకు అందించాడు వినాయకుడు. కర్తవ్యపాలనను మించిన జీవిత లక్ష్యం లేదని మనం తెలుసుకోవాలి.

Also Read: ఏక సాలగ్రామ శిలపై చెక్కిన గణనాథుడు.. త్రిమూర్తులు ప్రతిష్టించిన విగ్రహం ఇది!

తల్లిదండ్రులను మించిన ముఖ్యమైన వారేవరూ లేరు

ఒకసారి శివపార్వతులు తమ కుమారులైన కార్తికేయుడు, గణేశుడి కి ఒక ఫలాన్ని అందించాలని అనుకున్నారు. అది తీసుకునే అర్హత మాత్రం ఎవరో ఒకరికే వస్తుంది. మూడు సార్లు ప్రపంచాన్ని ముందుగా ప్రదక్షిణ చేసి రావడాన్ని అర్హతగా నిర్ణయించారు. ఈ పోటిలో తానే గెలవాలనే ఆతృతతో కార్తికేయుడు నెమలిపై వేగంగా బయలుదేరాడు. కానీ గణేషుడి వాహనం ఎలుకను ఉపయోగించి ఈ పోటిలో ఎలా పాల్గొంటాడు విజయం తనదే అని కూడా అనుకున్నాడు. కానీ తాను వెళ్లిన ప్రతిచోట తనకంటే ముందు గణేషుడిని ఆయన చూశాడు. ప్రదక్షిణ పూర్తి చేసుకుని వచ్చిన కార్తికేయుడికి తనకంటే ముందే కైలాసం చేరుకుని తల్లిదండ్రులకు ప్రదక్షిణ చేస్తూ కనిపించిన వినాయకుడిని చూసి ఆశ్చర్యపోయాడు. గణపతి కేవలం తల్లిదండ్రులనే ప్రపంచంగా భావించి వారి చుట్టూ చేసిన మూడు ప్రదక్షిణలు అతడికి భూప్రదక్షిణ చేసిన ఫలితాన్ని ఇచ్చింది. ఈ కథతో దేవుడికైనా తల్లిదండ్రులను మించిన లోకం లేదనే సందేశాన్ని అందిస్తున్నాడు గణేషుడు.

Also Read: పరిపూర్ణమైన జగత్తుకి సంకేతంగా చెప్పే వినాయకుడి రూపం వెనుకున్న పరమార్థం ఇదే!

క్షమాపణను మించిన ధర్మం లేదు

ఒకసారి కుబేరుడి విందుకు వెళ్లి కడుపునిండా తృప్తిగా తిని భుక్తాయాసంగా వస్తున్న గణపతి పొరపాటున తడబడి పడిపోయాడు. అది చూసిన చంద్రుడు ఎగతాళిగా నవ్వాడు. అవమానించిన చంద్రుని కోపగించుకుని ఆకాశం నుంచి శాశ్వతంగా మాయం కావల్సిందిగా శపించాడు. కానీ చంద్రుడు తప్పు తెలసుకుని తనని క్షమించాల్సిందిగా వేడుకున్నాడు. పెద్దమనసు కలిగిన గణపతి చంద్రుడిని క్షమించాడు కానీ గణపతి శాపం తప్పక ఫలించి తీరుతుందని దాన్ని పూర్తిగా ఉపసంహరించడం తనకు కూడా వీలు కాదు కనుక నెలలో ఒక రోజు పూర్తిగా అదృశ్యం కాక తప్పదని చెప్పాడు. కోపం కంటే క్షమ గొప్పదని, అవమాన పరిచిన వారిని సైతం క్షమించాలని ఈ కథ ద్వారా గణపతి మనకో జీవిత పాఠాన్ని చెబుతున్నాడు.

పని పూర్తిచేసే పట్టుదల ముఖ్యం

భారతం రాసేందుకు తనకు వ్రాయస కారుడిగా వ్యవహరించాల్సిందిగా గణేశుడిని అభ్యర్థించాడు. అందుకు ఒకటే షరతు విరామం లేకుండా   వ్యాసుడు శ్లోకాలు పఠించాలి. గణేశుడు విరామం లేకుండా రాయాలి. ఇలా ఒకబృహత్కార్యం మొదలైంది. వ్యాసుడు ఆపకుండా చెబుతూనే ఉన్నాడు, గణపతి రాస్తున్నాడు. కానీ మధ్యలో ఫాళీ విరిగిపోతుంది. అప్పుడు  పాళీగా వాడేందుకు తన దంతాలలో ఒకదాన్ని విరిచి ఉపయోగించాడట. అప్పటి నుంచి గణనాథుడు ఏకదంతుడయ్యాడు. తనకు తాను విధించుకున్న షరతును ఎట్టి పరిస్థితుల్లోనూ అధిగమించకూడదనే జీవిత పాఠాన్ని ఈ గణపతి కథ మనకు తెలియజేస్తుంది.

Also Read: వినాయక చవితి స్పెషల్ నైవేద్యాలు.. గారెలు, పెరుగువడలను ఇలా టేస్టీగా చేసి పెట్టేయండి


Ganesh Chaturthi 2024: వినాయక చవితి జీవిత పాఠాలు నేర్పే వెబినార్‌- గణేషుడు నేర్పే లెసెన్స్‌ ఇవే!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Andhra Flood Relief: ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
Harish Rao: 'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
Kashmir Elections : కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

హైదరాబాద్ దాటిన హైడ్రా బుల్‌డోజర్లు, ఇకపై రాష్ట్రవ్యాప్తంగా కూల్చివేతలులెబనాన్‌లో పేజర్ పేలుళ్ల కలవరం, ఇజ్రాయేల్‌పై ఆరోపణలుభారత్, బంగ్లాదేశ్‌ల మధ్య తొలి టెస్టు నేడే‘కూలీ’లో నాగార్జున సైమన్ లుక్ లీక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Andhra Flood Relief: ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
Harish Rao: 'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
Kashmir Elections : కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
Naga Babu-Jani Master: నాగబాబు వరుస ట్వీట్స్‌ - జానీ మాస్టర్‌ను ఉద్దేశించేనా?
నాగబాబు వరుస ట్వీట్స్‌ - జానీ మాస్టర్‌ను ఉద్దేశించేనా?
Kadambari Jethwani 'కేసు విత్ డ్రా చేసి న్యాయం చేయండి' - హోంమంత్రి అనితను కలిసి ముంబయి నటి కాదంబరి జత్వానీ
'కేసు విత్ డ్రా చేసి న్యాయం చేయండి' - హోంమంత్రి అనితను కలిసి ముంబయి నటి కాదంబరి జత్వానీ
Balineni Srinivasa Reddy: జగన్‌ తీరు నచ్చలేదు- పార్టీ నుంచి బయటకు పంపే కుట్రలు చేశారు: బాలినేని కీలక వ్యాఖ్యలు
జగన్‌ తీరు నచ్చలేదు- పార్టీ నుంచి బయటకు పంపే కుట్రలు చేశారు: బాలినేని కీలక వ్యాఖ్యలు
Telangana: తెలంగాణవాసులకు బిగ్ అలర్ట్‌- మీ వాహనం కొని 15 ఏళ్లు దాటిందంటే తుక్కే
తెలంగాణవాసులకు బిగ్ అలర్ట్‌- మీ వాహనం కొని 15 ఏళ్లు దాటిందంటే తుక్కే
Embed widget