News
News
X

Diwali 2022 Shani Dosha: దీపావళికి పెట్టే దీపాల్లో శనిదోషం తొలగించుకునేందుకు పెట్టేదీపం వేరే!

Diwali 2022 Shani Dosha: ఏలినాటి శని, అష్టమ శని, అర్దాష్టమ శని..ఏదో ఒక దశలో శని కారణంగా ఇబ్బందులు ఎదుర్కోకతప్పదు. దీన్నుంచి ఉపశమనం కలగాలంటే దీపావళి రోజు ఇలా చేయండి..

FOLLOW US: 

Diwali 2022 Shani Dosha: పూజలు, ఉపవాసాలు, నోములు చేస్తే గ్రహదోషాలు పూర్తిగా తొలగిపోవు కానీ ఉపశమనం మాత్రం లభిస్తుందంటారు పండితులు. సాధారణంగా శని దోషం తొలగించుకునేందుకు శనివారం ఆలయాలకు వెళతారు, నవగ్రహాలకు తైలాభిషేకం చేస్తారు, నువ్వులు దానం చేస్తారు..ఇలా ఎన్నో రెమిడీస్ ఫాలో అవుతారు. వాటిలో ఒకటి దీపావళికి పెట్టే నువ్వుల దీపం. 

ఏలినాటి శని
ఏల్నాటి శని ఏడున్నర సంవత్సరాలు ఉంటుంది. ఈ సమయంలో శని సంచారం వల్ల అనారోగ్య సమస్యలు,  దంపతుల మధ్య పరస్పర అవగాహనా లోపం, చికాకులు, ధన నష్టం, విరోధులు పెరగడం, తొందరపాటు మాటలు, వ్యాపారంలో నష్టం, ఉద్యోగంలో పనిభారం ఉంటాయి. 

అర్ధాష్టమ శని
అర్ధాష్టమ శనిదోషం వల్ల ప్రమాదాలు జరగడం, జ్ఞాపకశక్తి తగ్గడం, పెద్దల గురించి ఆందోళన, ఉద్యోగస్తులకు ఒత్తిడి, చికాకులు ఉంటాయి.

అష్టమ శని
రాశి నుంచి 8వ స్థానంలో శని సంచారనాన్ని అష్టమ శని అంటారు.  అష్టమ శని వల్ల ఆయుఃప్రమాణం తగ్గడం, ఆనారోగ్య సమస్యలు ,చికాకులు ఆందోళ ఉంటాయి. 

News Reels

Also Read: దీపాలతో లక్ష్మీదేవికి పలికే ఆహ్వానమే దీపావళి, ఈ చిన్న చిన్న పొరపాట్లు చేయొద్దు!

శని నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు
1. హిరణ్యకశిపుడు మహా బలశాలి. అంత బలమైన రాక్షసుడు శనిదోషం వల్ల మరణించాడు
2. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు 14  సంవత్సరాలు అరణ్యవాసం చేసిందీ శనిదోష ఫలితమే. ఈ దోష నివారణ అనంతరం వానరులతో స్నేహం ఏర్పడి రావణుడిపై విజయం సాధించాడు. 
౩. నలమహారాజు శనిదోషం వల్ల నల్లటి రూపం పొంది ఏడేళ్లు వంటవానిగా జీవితం సాగించాడు.
4. ద్వాపర యుగంలో పాండవులు ఈ శనిదోషం వల్ల 14 సంవత్సరాలు అజ్ఞాతవాసం చేసి అడవుల వెంట తిరిగి నానా ఇబ్బందులు పడ్డారు.
5. ఈశ్వరుడు కూడా శనికి భయపడి చెట్టు తొఱ్ఱలో దాక్కున్నాడు.

శనికి ఎవ్వరూ అతీతులు కాదు. కానీ కొన్ని దోష నివారణలు చేయడం ద్వారా రాబోయే ముప్పు నుంచి కాస్త ఉపశమనం కలుగుతుంది. 

నువ్వులు-నువ్వుల నూనెతో దీపం: దీపావళి రోజు ఉదయాన్నే తలస్నానం చేసి మూడు గుప్పెడల నల్ల నువ్వులు ఓ తెల్లటి గుడ్డలో మూట కట్టాలి. ఒత్తి ఆకారంలో వచ్చేలా మూట కట్టి నువ్వుల నూనెలో నానపెట్టాలి. దీపావళి రోజు సాయంత్రం ఇంట్లో లక్ష్మీపూజ చేసిన తర్వాత తులసికోట దగ్గర దివ్వ కొడతారు. దివ్వ కొట్టి (ఈ పద్దతి కొన్ని ప్రాంతాల వారికి ఉంది కొన్ని ప్రాంతాల వారికి లేదు) ఇంట్లోకి వచ్చాక  బయట దీపాలు పెట్టుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటారు. ఇల్లంతా లక్ష్మీ కళ ఉట్టిపడేలా దీపాలతో అలంకరించి బాణసంచా వెలిగిస్తాం. మొత్తం అంతా పూర్తైంది ఇక ఇంట్లోకి వెళ్లిపోవడమే అనే సమయంలో ఈ నువ్వుల దీపాన్ని వెలిగించాలి.

Also Read: ఈ నెల 25న సూర్యగ్రహణం, దీపావళి 24 లేదా 25 ఎప్పుడు జరుపుకోవాలి!

నువ్వుల దీపాన్ని ప్రత్యేక ప్రమిదలో వెలిగించి ఇంటి ఆరు బయట ఉంచాలి. నగరాల్లో ఉన్నవారైతే ఇంటి గేటు బయట ఓ మూలగా వెలిగించి వెనక్కు తిరిగి చూడకుండా  కాళ్లు కడుక్కుని ఇంట్లోకి వెళ్లిపోవాలి. మూట కట్టిన నువ్వులన్నీ మసైపోయే వరకూ దీపం వెలిగేలా  కర్పూరం పొడి లాంటివి కూడా దానిపై వేయొచ్చు. ఇలా చేయడం ద్వారా శనిదోషం తగ్గుతుందని చెబుతారు. కొందరు ఇంటి ముందు దీపాలు పెట్టడం కన్నా ముందే శనిదీపం వెలిగించి అది పూర్తిగా కొండెక్కిన తర్వాత ఇల్లంతా దీపాలు పెడతారు. అంటే శనని తరిమికొట్టి లక్ష్మీదేవికి ఆహ్వానం పలుకుతున్నామని అర్థం వచ్చేలా. అయితే శనిదీపం ఎప్పుడు పెట్టినా మంచిదే... దీపాల వరుసతో సమానంగా కాకుండా ఆరంభంలో కానీ చివర్లో కానీ వెలిగించడం ఉత్తమం అంటారు పండితులు.

Published at : 13 Oct 2022 12:31 PM (IST) Tags: Dhanteras Diwali 2022 Date Shubh Muhurat diwali Puja and Significance of Diwali Naraka Chathurdasi Balipratipada Yama Dwitiya Diwali-2022 Date Shubh Muhurat Diwali 2022

సంబంధిత కథనాలు

Christmas Tree: క్రిస్మస్‌ పండుగలో క్రిస్మస్‌ చెట్టును ఎందుకు ఉంచుతారో తెలుసా ?

Christmas Tree: క్రిస్మస్‌ పండుగలో క్రిస్మస్‌ చెట్టును ఎందుకు ఉంచుతారో తెలుసా ?

Subramanya Swamy Temple: 300 ఏళ్ల నాటి కుమార సుబ్రహ్మణ్య స్వామి ఆలయం గురించి మీకు ఈ విషయాలు తెలుసా?

Subramanya Swamy Temple: 300 ఏళ్ల నాటి కుమార సుబ్రహ్మణ్య స్వామి ఆలయం గురించి మీకు ఈ విషయాలు తెలుసా?

December 2022 Horoscope: డిసెంబర్ నెల ఈ 5 రాశులవారికి బావుంది, ఆ రాశివారికి అత్యద్భుతంగా ఉంది

December 2022 Horoscope: డిసెంబర్ నెల ఈ 5 రాశులవారికి బావుంది, ఆ రాశివారికి అత్యద్భుతంగా ఉంది

Daily Horoscope Today 28th November 2022: ఈ రాశివారికి ఆదాయం తక్కువ ఖర్చు ఎక్కువ, నవంబరు 28 రాశిఫలాలు

Daily Horoscope Today 28th November 2022: ఈ రాశివారికి ఆదాయం తక్కువ ఖర్చు ఎక్కువ, నవంబరు 28 రాశిఫలాలు

Kaal Bhairav Astami 2022: డిసెంబరు 1 కాలభైరవాష్టమి, దుర్గణాలు తొలగించి సిరి, సంపదలు ఇచ్చే భైరవుడు

Kaal Bhairav Astami 2022:  డిసెంబరు 1 కాలభైరవాష్టమి, దుర్గణాలు తొలగించి సిరి, సంపదలు ఇచ్చే భైరవుడు

టాప్ స్టోరీస్

ఏప్రిల్ నుంచి విశాఖ కేంద్రంగా ఏపీ సీఎం జగన్ పరిపాలన - మంత్రి గుడివాడ అమర్నాథ్

ఏప్రిల్ నుంచి విశాఖ కేంద్రంగా ఏపీ సీఎం జగన్ పరిపాలన - మంత్రి గుడివాడ అమర్నాథ్

Minister Ambati Rambabu : పవన్ సినిమాల్లోనే హీరో, రాజకీయాల్లో పెద్ద జోకర్ - మంత్రి అంబటి రాంబాబు

Minister Ambati Rambabu : పవన్ సినిమాల్లోనే హీరో, రాజకీయాల్లో పెద్ద జోకర్ - మంత్రి అంబటి రాంబాబు

IT Politics : ఐటీ ఎదుట హాజరైన మల్లారెడ్డి కుటుంబీకులు - విచారణ తర్వాత ఫుల్ కాన్ఫిడెన్స్ !

IT Politics : ఐటీ ఎదుట హాజరైన మల్లారెడ్డి కుటుంబీకులు -  విచారణ తర్వాత ఫుల్ కాన్ఫిడెన్స్ !

TS New DGP : నూతన డీజీపీ నియామకంపై తెలంగాణ సర్కార్ కసరత్తు, రేసులో ఆ ముగ్గురు!

TS New DGP : నూతన డీజీపీ నియామకంపై తెలంగాణ సర్కార్ కసరత్తు, రేసులో ఆ ముగ్గురు!