News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X
ఎన్నికల ఫలితాలు 2023

Diwali-2022: దీపావళి రోజు లక్ష్మీ పూజ ఎందుకు చేస్తారు, బాణసంచా ఎందుకు కాలుస్తారు!

Diwali-2022: ఏటా ఆశ్వయుజ అమావాస్య రోజు దీపావళి పండుగ జరుపుకుంటారు. సంతోషాన్ని సంపదలను ఇచ్చే ఈ పండుగరోజున లక్ష్మీపూజ ఎందుకు చేస్తారు..క్రాకర్స్ ఎందుకు కాలుస్తారు..

FOLLOW US: 
Share:

దీపాన్ని పరబ్రహ్మ స్వరూపంగా భావించి దీపావళి రోజు లక్ష్మీపూజ చేసిన అనంతరం ఇల్లంతా దీపాలతో అలంకరిస్తారు. 
 మనోవికాసానికి, ఆనందానికి, నవ్వులకు, సంపదలకు చిహ్నంగా ఈ దీపాన్ని భావిస్తారు. ఆశ్వీయుజ బహుళ చతుర్దశి నుంచి కార్తీక మాసమంతా సంధ్యా సమయంలో మట్టి ప్రమిదలలొ దీపాలు వెలిగిస్తారు. ముఖ్యంగా ఈ రోజు చేసే లక్ష్మీపూజ వెనుక ఓ ప్రత్యేకత ఉంది. పురాణాల్లో దీనికి సంబంధించి ఓ కథ చెబుతారు..

మహాలక్ష్మి పూజ ఎందుకు చేయాలి
దుర్వాస మహర్షి ఒకరోజు దేవేంద్రుని (ఇంద్రుడి) ఆతిథ్యానికి వెళ్లి ఓ హారాన్నిస్తాడు. ఆ హారాన్ని తిరస్కరించిన ఇంద్రుడు తన ఐరావతం మెడలో వేస్తాడు. ఏనుగు ఆ హారాన్ని కాలితో తొక్కేస్తుంది. అసలే  అప్పుడు ఐరావతము ఆ హారాన్ని కాలితో తొక్కివేస్తుంది. అసలే దుర్వాసుడికి కోపం ఎక్కువ..ఇదంతా చూసి కోపంతో రగిలిపోయిన మహర్షి దేవేంద్రుడిని శపిస్తాడు. ఆ శాప పలితంగా తన స్థానాన్ని, సర్వసంపదలను కోల్పోతాడు. దిక్కుతోచని స్థితిలో  శ్రీమహావిష్ణువుని ప్రార్థిస్తాడు. కరుణిగించిన శ్రీ మహావిష్ణువు...ఒక జ్యోతిని వెలిగించి దానిని శ్రీ మహాలక్ష్మీ స్వరూపంగా తలచి పూజించమని ఉపదేశిస్తాడు. ఇంద్రుడు అలా చేసిన తర్వాత పోయిన సరిసింపదలు తరిగొచ్చాయని పురాణ కథనం. అప్పటి నుంచి లక్ష్మీదేవిని పూజించిన వారికిసర్వసంపదలూ చేకూరతాని విశ్వసిస్తారు. 

Also Read: దీపావళికి పెట్టే దీపాల్లో శనిదోషం తొలగించుకునేందుకు పెట్టేదీపం వేరే!
 
ద్వాపరయుగంలో దీపావళి
భూదేవి-వరహా స్వామికి అసుర సమయంలో జన్మించిన నరకాసురుడు..తల్లి చేతిలో మాత్రమే మరణించేలా వరం పొందుతాడు. వరగర్వంతో లోకకంటకుడిగా తయారైన నరకుడు ముల్లోకాలను పట్టిపీడించాడు. నరకాసురుడి బాధలు భరించలేని దేవతలు, మునులు, గంధర్వులు శ్రీహరికి తమ గోడు వెళ్లబోసుకున్నారు. వారి మొర ఆలకించిన శ్రీమహావిష్ణువు ద్వాపర యుగంలో కృష్ణుడిగా అవతరించి సత్యభామతో నరకాసుర సంహారం చేశాడు. నరకుడు చతుర్థశి రోజు మరణించగా ఆ తర్వాత రోజు దీపాలు వెలిగించి సంబరాలు చేసుకున్నారు.

త్రేతాయుగంలో
రావణ సంహారం అనంతరం సతీసమేతంగా అయోధ్యకు చేరుకున్నాడు శ్రీరాముడు. అందుకే దసరాకి రావణ దహనం కార్యక్రమం నిర్వహిస్తారు..దసరా అనంతరం వచ్చే పండుగ దీపావళి. రావణ సంహారం తర్వాత అయోధ్యకు చేరుకోవడంతో ప్రజలంతా దీపాలు వెలిగించి, బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు.  

Also Read: ఈ నెల 25న సూర్యగ్రహణం, దీపావళి 24 లేదా 25 ఎప్పుడు జరుపుకోవాలి!

“సాజ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితం మయా
 గృహాణ మంగళం దీపం త్రైలోక్య తిమిరాపహమ్
 భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే
 త్రాహిమాం నరకాత్ ఘోరాత్ దివ్య ర్జ్యోతి ర్నమోస్తుతే”
'మూడు వత్తులు, నూనెలో తడిపి, అగ్నితో వెలిగించి శుభ ప్రదమైన, మూడు లోకాల చీకట్లను పోగొట్ట గలిగిన దీపాన్ని వెలిగించాను. పరమాత్మునికి ఈ దీపాన్ని భక్తితో సమర్పిస్తున్నాను. భయంకరమైన నరకాన్నుంచి రక్షించే దివ్య జ్యోతికి నమస్కరిస్తున్నాను'. అని అర్థం

బాణసంచా ఎందుకు కాల్చాలి
భారతదేశం వ్యవసాయ ప్రధాన దేశం. చాలా ప్రాంతాల వారి ప్రధాన ఆహారం...శీతాకాలంలోనే వృద్ధి చెందుతుంది. దీపావళితో శీతాకాలం ప్రారంభమవుతుంది. ఈ సమయంలోనే పంటను నాశనం చేసే రకరకాల కీటకాలు వృద్ధి చెందుతాయి. వీటి కారణంగా పంట దిగుబడి తగ్గిపోతుంది. ఈ కీటకాల కారణంగా ప్రజలు అనారోగ్యం పాలవుతారు. ఈ సమస్యకు గంధకం వినియోగం మంచి పరిష్కారం. దీపావళి రోజు బాణసంచా కాల్చడం వల్ల గాలిలో గంధకం పొగ వ్యాపించి కీటకాలను నివారిస్తుంది. 

Published at : 14 Oct 2022 07:02 AM (IST) Tags: Dhanteras Diwali 2022 Date Shubh Muhurat diwali Puja and Significance of Diwali Naraka Chathurdasi Balipratipada Yama Dwitiya Diwali-2022 Date Shubh Muhurat Diwali 2022

ఇవి కూడా చూడండి

Astrology: ఈ 4 రాశులవారు మొండి ఘటాలు, వీళ్లతో అస్సలు వాదించలేం!

Astrology: ఈ 4 రాశులవారు మొండి ఘటాలు, వీళ్లతో అస్సలు వాదించలేం!

Daily Horoscope Today Dec 6, 2023 : ఈ రాశివారు ఈ రోజు ప్రయాణాలకు దూరంగా ఉండడమే మంచిది, డిసెంబరు 6 రాశిఫలాలు

Daily Horoscope Today Dec 6, 2023 :  ఈ రాశివారు ఈ రోజు ప్రయాణాలకు దూరంగా ఉండడమే మంచిది, డిసెంబరు 6 రాశిఫలాలు

Astrology: మీ పిల్లల్లో ప్రత్యేకతేంటో వాళ్ల రాశి చెప్పేస్తుంది, మరి మీకు తెలుసా!

Astrology: మీ పిల్లల్లో ప్రత్యేకతేంటో వాళ్ల రాశి చెప్పేస్తుంది, మరి మీకు తెలుసా!

Christmas Tree: క్రిస్మస్ రోజు ఆ ట్రీ ఎందుకు పెడతారు? ఆ సాంప్రదాయం ఎలా మొదలైంది?

Christmas Tree: క్రిస్మస్ రోజు ఆ ట్రీ ఎందుకు పెడతారు? ఆ సాంప్రదాయం ఎలా మొదలైంది?

Bhishma Niti: పాలకులు దుర్మార్గులైతే ప్రకృతి కూడా తిరుగుబాటు చేస్తుంది -భీష్ముడు చెప్పిన రాజధర్మం ఇదే!

Bhishma Niti: పాలకులు దుర్మార్గులైతే ప్రకృతి కూడా తిరుగుబాటు చేస్తుంది -భీష్ముడు చెప్పిన రాజధర్మం ఇదే!

టాప్ స్టోరీస్

Telangana CM Revanth Reddy: సీఎం అయ్యాక రేవంత్ రెడ్డి తొలి ట్వీట్ చూశారా! వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు

Telangana CM Revanth Reddy: సీఎం అయ్యాక రేవంత్ రెడ్డి తొలి ట్వీట్ చూశారా! వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు

Revanth Reddy: తెలంగాణను ఏలుతున్న ఫ్యామిలీని ముంచేసిన సునామీ రేవంత్ రెడ్డి!

Revanth Reddy: తెలంగాణను ఏలుతున్న ఫ్యామిలీని ముంచేసిన సునామీ రేవంత్ రెడ్డి!

Revanth Reddy Political Career: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానమిది- వివాదాలు, కేసులతోనూ సంచలనమే!

Revanth Reddy Political Career: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానమిది- వివాదాలు, కేసులతోనూ సంచలనమే!

Sandeep Reddy Vanga: వర్మ ‘యానిమల్’ రివ్యూపై స్పందించిన సందీప్ - కొన్ని విషయాలు పక్కన పెట్టాల్సిందే!

Sandeep Reddy Vanga: వర్మ ‘యానిమల్’ రివ్యూపై స్పందించిన సందీప్ - కొన్ని విషయాలు పక్కన పెట్టాల్సిందే!
×