అన్వేషించండి

Medaram Jatara 2026: మేడారం వెళ్లే భక్తులు ఈ జాగ్రత్తలు తీసుకుంటే క్షేమంగా ఇంటికి చేరుకుంటారు!

Sammakka Sarakka Jatara 2026: జనవరి ఆఖర్లో జరగనున్న మేడారం జాతరకు సర్వం సిద్ధమైంది. వనదేవతల దర్శనార్థం ముందుగానే భక్తులు బారులు తీరుతున్నారు. మరి ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నారా?

Medaram Sammakka Sarakka Jatara 2026: మేడారం జాతరలో సమ్మక్క,సారలమ్మను దర్శించుకుంటే అన్నీ శుభాలే జరుగుతాయని భక్తుల విశ్వాసం. రెండేళ్లకోసారి జరిగే జాతరకు తెలంగాణ సహా చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. భక్తి సంగతి సరే..కొన్ని జాగ్రత్తలు తీసుకోపోవడం వల్ల, నిర్లక్ష్యం కారణంగా ప్రమాదాలు జరుగుతుంటాయి. రోడ్డు ప్రమాదాలు, తొక్కిసలాటలు, జంపన్నవాగులో స్నానాలు ఆచరించే భక్తులు కొందరు నీట మునిగిపోవడం ఇలాంటివి జరుగుతున్నాయ్. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుని ఎంత క్షేమంగా జాతరకు వెళ్లారో..అంతే క్షేమంగా ఇంటికి తిరిగివెళ్లాలంటే చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. 
 
బంగారం ఆభరణాలు ధరించకపోవడమే మంచిది
  
సాధారణంగా దైవదర్శనాలకు వెళ్లే భక్తులు ముఖ్యంగా మహిళలు పట్టుచీరలు, బంగారు ఆభరణాలు ధరిస్తారు. పట్టుచీరల వరకూ సరే కానీ అత్యంత రద్దీగా ఉండే జాతరకు బంగారు ఆభరణాలు ధరించి వెళ్లడం మంచిది కాదు. ఎందుకంటే జాతర జరిగే నాలుగు రోజుల్లో కోట్ల మంది భక్తులు గుమిగూడుతారు. ఇంత మంది కిక్కిరిసే జాతరలో దొంగతనాలు కూడా అదే స్థాయిలో జరుగుతాయి. అంతరాష్ట్ర ముఠాలకు అడ్డాగా మారే ప్రదేశం కూడా ఇదే. అందుకే వీలైనంతవరకూ బంగారు ఆభరణాలు ధరించడం కానీ తీసుకెళ్లడం కానీ చేయకపోవడమే మంచిది. పర్సులు, ఫోన్లు,  హ్యాండ్ బ్యాగులు జాగ్రత్తగా చూసుకోవాలి. మీ చుట్టుపక్కల ఎవరు అనుమానాస్పదంగా కనిపించినా వెంటనే మీకు సమీపంలో ఉన్న పోలీసులకు సమాచారం అందించండి
 
జంపన్నవాగులో పుణ్యస్నానం ఆచరించండి కానీ...

జంపన్నవాగులో  భక్తులు పుణ్యస్నానం ఆచరించిన తర్వాత గద్దెలపై కొలువైన అమ్మవార్లను దర్శించుకుంటారు. జంపన్నవాగు మూడు అడుగుల లోతులోనే ఉండేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. ప్రవాహ వేగాన్ని నిలువరించేందుకు ఇసుకబస్తాలతో కట్టలు ఏర్పాటు చేశారు. వృద్ధులు, వికలాంగులు, చిన్నారులు ఇబ్బందిపడకుండా స్నానఘట్టాలపై షవర్లు ఏర్పాటు చేశారు. అధికారులు చేసిన ఏర్పాట్లను వినియోగించుకోండి.. చిన్నారులు, వృద్ధుల ప్రాణాలను రిస్క్ లో పెట్టకండి

చిన్నారుల చేయి వదలకండి
 
అప్పటివరకూ చేయి పట్టుకున్నట్టే ఉంటారు అంతలోనే మాయమైపోతారు చిన్నారులు. గట్టిగా అరిచినా, ఏడ్చినా వినిపించుకునే అవకాశం కూడా ఉండదు. అంత రద్దీలో మళ్లీ ఆ చిన్నారులు తల్లిదండ్రులను చేరేవరకూ ఉక్కిరిబిక్కిరి అయిపోతారు. గతేడాది జాతరలో దాదాపు 30 వేలమంది తప్పిపోయి తిరిగి తమవారిని చేరుకునేందుకు ఇబ్బందిపడ్డారు. ఈసారి జాతరలో తప్పిపోయిన వారిని గుర్తించేందుకు జియో ట్యాగింగ్ వినియోగిస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత డ్రోన్ వ్యవస్థను, జియో ట్యాగింగ్ ట్రాకింగ్ సిస్టంతో పాటూ 13 వేలమంది పోలీసు సిబ్బంది, 12 క్రైమ్ డికెక్షన్ బృందాలు పర్యవేక్షించనున్నారు. ప్రభుత్వం, అధికారులు ఎన్ని ఏర్పాట్లు చేసినా కానీ..మీ చిన్నారుల భద్రత భాద్యత మొదటగా మీదే అని గుర్తుంచుకోండి. తప్పిపోతే వెంటనే హెల్ప్ డెస్క్ దగ్గరకు వెళ్లి సహాయం కోరండి. కుటుంబ సభ్యులంతా బృందంగానే వెళ్లాలి

వేగం ప్రమాదం..

భగవంతుడి దర్శనానికే కదా ఆ భగవంతుడే చూసుకుంటాడు అని వేగంగా దూసుకెళ్లకండి. మీరు ఎక్కడికి వెళుతున్నా వేగం ప్రమాదమే. పైగా దారులన్నీ మేడారం వైపే కావడంతో వాహనాల రద్దీ కూడా అదే స్థాయిలో ఉంటుంది. అందుకే వాహనాన్ని జాగ్రత్తగా నడపండి, ట్రాఫిక్ నిబంధనలు పాటించండి. డ్రైవర్ మద్యం తాగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదే అని గుర్తుపెట్టుకోండి.

 గమనిక: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మీ భద్రతకోసం ముందస్తు సూచన మాత్రమే..వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More

టాప్ హెడ్ లైన్స్

చీకటిలోనూ వెలుగు: గబ్బిలం నేర్పే లోపలి కన్ను రహస్యం!
చీకటిలోనూ వెలుగు: గబ్బిలం నేర్పే అంతర్ధృష్టి రహస్యం!
Nag Panchami 2026 Date: నాగ పంచమి 2026 తేదీ, పూజావిధానం, ప్రాముఖ్యత తెలుసుకోండి
నాగ పంచమి 2026 తేదీ, పూజావిధానం, ప్రాముఖ్యత తెలుసుకోండి
Gen Z ఫోటో స్టిల్స్! ఆలయాలను సందర్శించేటప్పుడు ఫొటోలు ఇలా తీసుకుంటే అదిరిపోతాయ్!
Gen Z ఫోటో స్టిల్స్! ఆలయాలను సందర్శించేటప్పుడు ఫొటోలు ఇలా తీసుకుంటే అదిరిపోతాయ్!
714 కోట్ల ఈ పెంట్‌హౌస్ఆ యుష్షును పెంచుతుందా? వాస్తు ఏం చెబుతోంది?
714 కోట్ల ఈ పెంట్‌హౌస్ఆ యుష్షును పెంచుతుందా? వాస్తు ఏం చెబుతోంది?

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PV Sindhu Sports Academy Visakhapatnam: విశాఖలో పీవీ సింధు స్పోర్ట్స్ అకాడమీకి రెండోసారి శంకుస్థాపన జరిగిందా? 
విశాఖలో పీవీ సింధు స్పోర్ట్స్ అకాడమీకి రెండోసారి శంకుస్థాపన జరిగిందా?
AP DSC 2026 Notification: డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
Breaking News: ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
Amritsar Police:జంతర్ మంతర్‌లో ఐఎస్ఐ ముఠాల రెక్కీ! దాడులకు పాకిస్తాన్‌ కుట్ర! 9 మంది అరెస్టు! నిందితుల్లో నలుగురు మైనర్లు!
జంతర్ మంతర్‌లో ఐఎస్ఐ ముఠాల రెక్కీ! దాడులకు పాకిస్తాన్‌ కుట్ర! 9 మంది అరెస్టు! నిందితుల్లో నలుగురు మైనర్లు!
కలుషిత E20 ఇంధనంతో జాగ్రత్త! వెహికల్‌ ఓనర్లకు SIAM హెచ్చరిక - కేంద్రం కీలక ఆదేశాలు
E20 పెట్రోల్‌పై కొత్త ఆందోళన.. దెబ్బతింటున్న ఇంజిన్ పార్ట్స్, పెరుగుతున్న రిపేర్లు!
PM Modi Praises Nara Lokesh: నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
Telangana Cabinet Expansion 2026: కర్ణాటక కేబినెట్ అలకల సీన్‌తో రేవంత్ రెడ్డి ప్లాన్ బీ - తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొత్త వ్యూహం!?
2026: కర్ణాటక కేబినెట్ అలకల సీన్‌తో రేవంత్ రెడ్డి ప్లాన్ బీ - తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొత్త వ్యూహం!?
Donald Trump: అమెరికా అధ్యక్షుడి హత్యకు కుట్ర! భగ్నం చేసిన భద్రతా బలగాలు! నిందితుడి ఇంట్లో తూటాల డంప్!
అమెరికా అధ్యక్షుడి హత్యకు కుట్ర! భగ్నం చేసిన భద్రతా బలగాలు! నిందితుడి ఇంట్లో తూటాల డంప్!
Embed widget