అన్వేషించండి

చీకటిలోనూ వెలుగు: గబ్బిలం నేర్పే లోపలి కన్ను రహస్యం!

చీకట్లో కూడా గబ్బిలాలు ఎలా చూస్తాయి? అదెలా సాధ్యమవుతోంది? సైన్స్ ఏం చెబుతోంది , దీనివెనుకున్న ఆధ్యాత్మిక సందేశం ఏంటి? తెలుసుకుందాం..

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • గబ్బిలాలు కళ్ళకు బదులు ధ్వని ద్వారా చీకటిలో చూస్తాయి.
  • ధ్వని తరంగాలతో వస్తువుల దూరం, ఆకారం సులువుగా గుర్తిస్తాయి.
  • ఇది అంతర్గత దృష్టిని పెంచి అద్భుతాలు చేయమనే ఆధ్యాత్మిక సందేశం.
  • అజ్ఞానం అనే చీకటిని ఆత్మజ్ఞానంతోనే అధిగమించాలని చెబుతుంది.

గబ్బిలాలు చీకట్లో ఎలా చూస్తాయ్ అనే ప్రశ్నకు సమాధానం - కళ్లతో కాదు..ధ్వని ద్వారా చూస్తాయ్.  ఆధ్యాత్మిక వివరణగబ్బిలాలు చీకట్లో కళ్లతో కాకుండా ధ్వని ద్వారా చూస్తాయి.  దీన్ని ఎకోలొకేషన్ అంటారు. సైన్స్ వివరణ గబ్బిలాల నోటి నుంచి లేదా ముక్కు నుంచి ఫ్రీక్వెన్సీ ధ్వనులు విడుదల చేస్తాయి. ఆ ధ్వనులు ముందున్న వస్తువులపై పడి తిరిగి ప్రకంపనలు కలిగిస్తాయ్. ఆ ఎకోను విని...ఎంతదూరంలో ఏం ఉందో, ఎంత పెద్దతో, కదులుతోందా లేదా , ఆకారం ఏంటో గబ్బిలాలు తెలుసుకుంటాయి. అందుకే చీకటిలోనూ అవి ఎటూ తగలకుండా, తడబడకుండా ఎగురుతాయి. ఆహారాన్ని సేకరిస్తాయి. ఇది కేవలం సైన్స్ మాత్రమే కాదు ఆధ్యాత్మిక ప్రయాణానికి లోతైన సందేశం..

లోపల కాంతి ఉంటే బయటకాంతి అవసరం లేదు
 
లోపలి దృష్టి ఉంటే మీరు అద్భుతాలు చేయొచ్చు అని చెప్పే సందేశం ఇది. కళ్లతో చూసేదంతా నిజం అనుకుంటాం కానీ అంతర్ధృష్టి ఉండాలని సూచిస్తోంది గబ్బిలం. కళ్లు మూసుకున్నప్పుడు కూడా సత్యం కనిపించాలంటే జ్ఞాననేత్రం తెరవాలి. ఉపనిషత్తులు చెప్పే ఆత్మను చూడడం అంటే ఇదే

శబ్ధం

గబ్బిలం ధ్వనిని పంపించి తిరిగి వచ్చే ప్రతిధ్వనిని శ్రద్ధగా వింటుంది. ఓంకారం అనే శబ్ధం ద్వారా సృష్టి ఆవిర్భవించింది. అందుకే మనం బయటి శబ్ధాలను కాకుండా లోపలి నుంచి వచ్చే సూక్ష్మ శబ్ధాలను వినగలిగితే జీవితంలో సరైన మార్గం కనిపిస్తుంది. ఇది సాధ్యమవ్వాలంటే నిత్యం జపం చేయాలి. ఓం అని జపం చేసేటప్పుడు కూడా లోపలి నుంచి ప్రతిధ్వనిని వింటాం.  

చీకటి అంటే భయం కాదు అజ్ఞానం

చీకటి అంటే మన కళ్లముందు కనిపించేది కాదు..లోపలున్న అజ్ఞానమే అసలైన చీకటి. గబ్బిలం చీకటికి భయపడదు..అదే విధంగా మనం కూడా భగవంతుడిపై విశ్వాసం, ఆత్మజ్ఞానం ఉంచుకుంటే జీవితంలో చీకటి దశలు కూడా భయపెట్టవు.  

భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పింది కూడా ఇదే

అజ్ఞానంతో కప్పబడిన వాడు చీకటిలో ఉన్నట్టు అని

కళ్లు మూసుకుని చూడడం

ధ్యానం చేసేటప్పుడు మనం కళ్లు మూసుకుంటాం.. బయటి ప్రపంచాన్ని కాకుండా లోపలివైపు చూస్తారం. గబ్బిలం కూడా బయటి కాంతిని కాకుండా లోపలి నుంచి పంపిన ప్రతిధ్వని ద్వారా చూస్తుంది. ఇది ప్రత్యక్ష దృష్టి నుంచి పరోక్ష దృష్టికి మారడం లాంటిది. సాధకుడు బయటి ఇంద్రియాలను అణిచి, లోపలి సాక్షాత్కారాన్ని దర్శించుకోవాలని సూచిస్తోంది

విశ్వాసం

ప్రతి సెకెనుకు ఓ ధ్వనిని పంపి వాటి నుంచి వచ్చే సమాధానాన్ని నమ్ముతుంది గబ్బిలం..అప్పుడే సందేహం లేకుండా ఎగురుతుంది. మన ఆధ్యాత్మిక మార్గంలోనూ ప్రార్థనం, ధ్యానం, జపం చేస్తూ లోపల నుంచి వచ్చే సందేశాన్ని విశ్వసించాలి. ఫలితం వెంటనే కనిపించకపోయినా నిరంతర సాధన చేస్తే దారి కనిపిస్తుంది
 
బయటకు కళ్లు మూసుకో..లోపలి కన్ను తెరువు

చీకటి భయపెట్టలేదు..లోపలి వెలుగు లేకపోతేనే భయం వేస్తుంది

ఇది కేవలం జంతువు సామర్థ్యం కాదు ఆత్మజ్ఞానం పొందాలనుకునే ప్రతి సాధకుడి జీవన మంత్రం

గమనిక: ఆధ్యాత్మికవేత్తలు సూచించిన వివరాలు, ఆధ్యాత్మిక గ్రంధాల్లో పొందుపరిచిన సమాచారం ఆధారంగా అందించిన కథనం ఇది. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.  దీనిని అనుసరించేముందు మీరు విశ్వశించే పండితుల సలహాలు స్వీకరించగలరు 

Frequently Asked Questions

చీకట్లో కూడా గబ్బిలాలు ఎలా చూస్తాయి?

గబ్బిలాలు కళ్లతో కాకుండా, ధ్వని ద్వారా చూస్తాయి. నోటి నుంచి ఫ్రీక్వెన్సీ ధ్వనులు విడుదల చేసి, తిరిగి వచ్చే ప్రకంపనలను విని వస్తువులను గుర్తిస్తాయి. దీన్ని ఎకోలొకేషన్ అంటారు.

గబ్బిలాల అంతర్దృష్టి వెనుక ఆధ్యాత్మిక సందేశం ఏమిటి?

లోపలి దృష్టి ఉంటే అద్భుతాలు చేయవచ్చని గబ్బిలాలు సూచిస్తాయి. అంతర్ధృష్టితో సత్యం కనిపించాలంటే జ్ఞాననేత్రం తెరవాలని ఈ సామర్థ్యం చెబుతోంది.

గబ్బిలాలు శబ్దాలను వినడం ఆధ్యాత్మికంగా దేనికి ప్రతీక?

గబ్బిలం ప్రతిధ్వనిని శ్రద్ధగా విన్నట్లే, మనం లోపలి నుంచి వచ్చే సూక్ష్మ శబ్దాలను వినగలిగితే జీవితంలో సరైన మార్గం కనిపిస్తుంది. ఓం జపం ద్వారా ఇది సాధ్యం.

ఆధ్యాత్మిక కోణంలో

ఆధ్యాత్మికంగా చీకటి అంటే మన కళ్ల ముందు కనిపించేది కాదు, లోపలున్న అజ్ఞానమే అసలైన చీకటి. ఆత్మజ్ఞానం ఉంటే జీవితంలోని చీకటి దశలు భయపెట్టవు.

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

అక్టోబర్ ఆఖర్లో గురు గ్రహం రెండవ సంచారం: ఏ రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుందంటే!
అక్టోబర్ ఆఖర్లో గురు గ్రహం రెండవ సంచారం: ఏ రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుందంటే!
అక్టోబర్‌లో డబ్బు వర్షం కురిసే రాశులు ఇవే! మరికొందరికి ఖర్చులు తప్పవు!
అక్టోబర్‌లో డబ్బు వర్షం కురిసే రాశులు ఇవే! మరికొందరికి ఖర్చులు తప్పవు!
అక్టోబర్‌లో అదృష్టం మారే 5 రాశులు: ఉద్యోగం, ఆర్థిక లాభాలు..మీ రాశి ఉందా?
అక్టోబర్‌లో అదృష్టం మారే 5 రాశులు: ఉద్యోగం, ఆర్థిక లాభాలు..మీ రాశి ఉందా?
30-09-2026 బుధవారం మకర, కుంభ, మీన రాశుల ఉద్యోగం, డబ్బు, కుటుంబం - మీ భవిష్యత్తుకు కీలక సూచనలు!
30-09-2026 బుధవారం మకర, కుంభ, మీన రాశుల ఉద్యోగం, డబ్బు, కుటుంబం - మీ భవిష్యత్తుకు కీలక సూచనలు!
Advertisement

వీడియోలు

Virat Kohli's Century Sparks Viral Moment | కోహ్లీ సెంచరీ కొట్టినా స్పందించని గంభీర్
Virat Kohli Completes 15,000 ODI Runs | కెప్టెన్ గిల్‌తో బంధంపై విరాట్ కోహ్లీ కామెంట్స్
Sunil Gavaskar about Selection Committee | చీఫ్ సెలెక్టర్ పదవిపై గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు
Shubman Gill After Win Over West Indies | విరాట్ పై ప్రశంసలు కురిపించిన కెప్టెన్
King Kohli's Record 55th ODI Century | వన్డేల్లో కింగ్ కోహ్లీ సరికొత్త చరిత్ర
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kalki Bhagavan Passes Away: ఆధ్యాత్మిక గురువు కల్కి భగవాన్ కన్నుమూత.. నేడు తిరుపతి జిల్లాకు పార్థివదేహం తరలింపు
ఆధ్యాత్మిక గురువు కల్కి భగవాన్ కన్నుమూత.. నేడు తిరుపతి జిల్లాకు పార్థివదేహం తరలింపు
Athletics Gold Rush: ట్రాక్ పై భారత మహిళల సంచలన పరుగు.. అథ్లెటిక్స్ లో ఏకైక పసిడితో అదిరిపోయే ముగింపు, ఆఫ్ సెంచ‌రీకి దాటిన భారత్ మెడల్స్ వేట
ట్రాక్ పై భారత మహిళల సంచలన పరుగు.. అథ్లెటిక్స్ లో ఏకైక పసిడితో అదిరిపోయే ముగింపు, ఆఫ్ సెంచ‌రీకి దాటిన భారత్ మెడల్స్ వేట
PM Modi Degree Case: ప్రధాని మోదీ డిగ్రీ కేసు.. అరవింద్ కేజ్రీవాల్‌ అప్పీల్ కొట్టివేత, రూ.25 వేల జరిమానా
ప్రధాని మోదీ డిగ్రీ కేసు.. అరవింద్ కేజ్రీవాల్‌ అప్పీల్ కొట్టివేత, రూ.25 వేల జరిమానా
Onions Price: ఏపీలో రైతు బజార్లలో రూ.35కే కేజీ ఉల్లిపాయలు విక్రయం
ఏపీలో రైతు బజార్లలో రూ.35కే కేజీ ఉల్లిపాయలు విక్రయం
Palle Panduga 3.0: వైసీపీ ఐదేళ్ల కంటే కూటమి రెండేళ్లలో పదింతల రోడ్లు.. 161 నియోజకవర్గాల్లో డొంక రోడ్లు - పవన్ కల్యాణ్
వైసీపీ ఐదేళ్ల కంటే కూటమి రెండేళ్లలో పదింతల రోడ్లు.. 161 నియోజకవర్గాల్లో డొంక రోడ్లు - పవన్ కల్యాణ్
Bowling Coach Reunion: చెన్నై గూటికి ఆ జట్టు మాజీ పేసర్ .. జహీర్ ఖాన్ టీమ్‌లోకి బౌలింగ్ కోచ్ గా రీ ఎంట్రీ
చెన్నై గూటికి ఆ జట్టు మాజీ పేసర్ .. జహీర్ ఖాన్ టీమ్‌లోకి బౌలింగ్ కోచ్ గా రీ ఎంట్రీ
Water Based Battery: చైనా సంచలన ఆవిష్కరణ.. 300 ఏళ్లు పనిచేసే వాటర్ బేస్డ్ బ్యాటరీ!
చైనా సంచలన ఆవిష్కరణ.. 300 ఏళ్లు పనిచేసే వాటర్ బేస్డ్ బ్యాటరీ!
Essar Group US Investment : అమెరికాలో ఎస్సార్ గ్రూప్ భారీ పెట్టుబడి.. అయోవాలో రూ.1.4 లక్షల కోట్ల ఉక్కు కర్మాగారం
అమెరికాలో ఎస్సార్ గ్రూప్ భారీ పెట్టుబడి.. అయోవాలో రూ.1.4 లక్షల కోట్ల ఉక్కు కర్మాగారం
Embed widget