Christmas 2021: క్రిస్మస్ సందర్భంగా చాలామంది ఇలా చేస్తారు..
క్రీస్తు జన్మించిన రోజైన డిసెంబరు25న ఏటా క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటారు. కొందరైతే రొటీన్ కి భిన్నంగా ప్లాన్ చేసుకుంటారు. ఎక్కువ మంది ఫాలో అయ్యే విషయాలేంటంటే...
ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్ సందడి మొదలైంది. పిల్లలు-పెద్దలు కలసి వేడుకలు, ప్రత్యేక పార్టీలు జరుపుకుంటున్నారు. కరోనా దెబ్బకు రెండేళ్లుగా గందరగోళంగా ఉన్న పరిస్థితి ఈ ఏడాది కాస్త సెట్టైనట్టే ఉంది. అందుకే అందర్లో పండుగ ఉత్సాహం కనిపిస్తోంది.
- క్రిస్మస్ అంటేనే కానుకల పండుగ. శాంటాక్లాజ్ వచ్చి అందరికీ కానుకలు ఇస్తాడనే విశ్వాసంతో..తమకు ఎలాంటి బహుమతి లభిస్తుందో అనే ఆశగా ఎదురుచూస్తారు. ముఖ్యంగా చిన్న పిల్లలకు ఈ పండుగ అంటే భలే ఇష్టం.
- కొందరు పెద్దలు తాము శాంటాక్లాజ్ గా మారి కుటుంబసభ్యులు, స్నేహితులకు సర్ ప్రైజ్ గిఫ్టులు ఇస్తుంటారు. కొందరైతే పేదలకు ఆహారం, బహుమతులు అందిస్తారు. మరికొందరు వారితోనే వేడుక జరుపుకుంటారు.
Also Read: ఏసు పుట్టి అన్ని వేల సంవత్సరాలైందా.. అప్పుడేం జరిగిందో తెలుసా..
- క్రిస్మస్ అంటేనే ట్రీ, శాంటా క్లాజ్ . అందుకే ఈ పండుగ వచ్చిందంటే వీటిపై చాలా దృష్టి పెడతారు. ఇంటిని అందంగా అలంకరించడం, ఆ చెట్టుకింద బహుమతులు పెట్టి ఇంట్లో వాళ్లని సర్ ప్రైజ్ చేయడం చేస్తుంటారు.
- దాదాపు క్రిస్టియన్స్ అంతా కేక్ కట్ చేసి సంబరాలు చేసుకుంటారు. కొంచెం స్పెషల్ గా జరుపుకోవాలనుకునే వారు రమ్ కేక్, హాట్ చాక్లెట్ మేకింగ్ చేస్తుంటారు. అయితే క్రిస్మస్ సందర్భంగా చాలా మంది ప్రత్యేక వంటకాలను తయారు చేసేందుకు సన్నద్ధమవుతుంటారు. తయారు చేసుకునే అవకాశం లేని వారు కొని తెచ్చుకుని అయినా కేక్ కట్ చేస్తారు.
- చిన్న సందర్భం వచ్చినా ఫ్రెండ్స్ తో కలసి ఎంజాయ్ చేసే కొందరు.. ఇంత పెద్ద వేడుక అంటే స్నేహితులను కలవకుండా ఉంటారా చెప్పండి. అందుకే క్రిస్మస్ సందర్భంగా స్నేహితులు, సన్నిహితులతో కలసి వేడుక జరుపుకుంటారు. ఇంట్లోనే డిస్కో లైట్లు పెట్టేసి పెద్ద పార్టీ అరెంజ్ చేసుకుంటున్నారు.
- చాలామంది ఎక్కువ సమయం వెచ్చించేది ఇంటి అలంకరణకే అని చెప్పుకోవాలి. రోటీన్ కి భిన్నంగా, అత్యంత ఆకర్షణీయంగా ఇంటిని డెకరేట్ చేసుకుంటారు.
Also Read: శాంటా ఇచ్చే బహుమతులు సరదాకి కాదు..సాయానికి...
Also Read: ఆలయంలో ఎన్ని ప్రదక్షిణలు చేస్తున్నారు.. ఏ దేవుడికి ఎన్ని చేయాలో తెలుసా..
Also Read: చెడు మాట్లాడకు.. తథాస్తు దేవతలున్నారు అంటారు కదా.. నిజంగా ఉన్నారా, దీని వెనుక అసలు విషయం ఏంటి..
Also Read: తిరుప్పావై అంటే ఏంటి, ఆండాళ్ ఎవరు.. గోదాదేవి రాసిన 30 పాశురాల ప్రత్యేకత ఏంటి…
Also Read: మంచి భర్త లభించాలన్నా.. సంసార జీవితం సంతోషంగా సాగాలన్నా ఈ నెలరోజులు చాలా ముఖ్యమట...
Also Read: పద్మవ్యూహం అనే మాట పదే పదే వాడేస్తుంటాం కానీ.. పద్మవ్యూహం ఎంత భయంకరంగా ఉంటుందో తెలిస్తే..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి