By: ABP Desam | Updated at : 06 Oct 2021 08:01 AM (IST)
Edited By: RamaLakshmibai
ప్రతీకాత్మక చిత్రం
ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమికి ముందురోజు వచ్చే అమావాస్య రోజున ఎంగిలి పూల బతుకమ్మ పేరుతో ప్రారంభమై దుర్గాష్టమి రోజున సద్దుల బతుకమ్మ పేరుతో ముగుస్తుంది. అంటు వ్యాధులు, కరువు కాటకాల బారినుంచి ప్రజల్ని కాపాడాలని ప్రార్థిస్తూ ప్రకృతి గౌరిని ఆటపాటలతో పూజించే వేడుకే బతుకమ్మ. తెలంగాణ పల్లెల్లో ప్రతీ ఒక్క ఆడపడుచు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే ఈ పండుగ వైభవాన్ని చూసేందుకు రెండు కళ్లు చాలవు. పల్లె పల్లెల్లో జరుపుకునే ఈ పండుగ ఇప్పుడు ఎల్లలు దాటి దేశ విదేశాల్లోనూ ఘనంగా జరుపుకుంటున్నారు. ఇంతకీ బతుకమ్మ అనే పేరు ఎలా వచ్చింది..ఈ పండుగ వెనుక ప్రచారంలో ఉన్న పురాణ, జానపథ కథలేంటో తెలుసుకుందాం.
పురాణ గాథ: దక్షిణ భారతావనిని పాలించిన చోళ వంశ చక్రవర్తి ధర్మాంగదుడు సంతానం కోసం ఎన్నో పూజలు చేయడంతో అమ్మవారి అనుగ్రహంతో ఓ బిడ్డ కలిగింది. ఎన్నో గండాలు దాటి బిడ్డ భూమ్మీదపడడంతో ఆమెకు బతుకమ్మ అని నామకరణం చేశారట. అప్పటి నుంచీ బతుకు ప్రసాదించాలని కోరుతూ బతుకమ్మను కొలుస్తారని పురాణగాథ.
జానపద గాథ: ఏడుగురు అన్నదమ్ములకు ఓ ముద్దుల చెల్లి. అన్నలకు ప్రాణమైనా వదినలకు మాత్రం అసూయ. ఓ రోజు అన్నలు వేటకెళ్లి ఎంతకాలమైనా తిరిగిరావకపోవడంతో వదినల వేధింపులు భరించలేక ఆడబిడ్డ ఇల్లొదిలి వెళ్లిపోయింది. అన్నలు తిరిగొచ్చి జరిగింది తెలుసుకుని నిద్రాహారాలు మాని చెల్లిని వెతికారు. ఓ ఊరి పొలిమేర దగ్గర బావిలో దాహం తీర్చుకుంటూ ఉండగా పెద్ద తామరపూవొకటి వీళ్లవైపు తేలుతూ వచ్చిందట. ఆ రాజ్యాన్నేలే రాజు అన్నదమ్ముల దగ్గర్నుంచి ఆ పూవుని తీసుకెళ్లి తన తోటలో కొలనులో వేయగా చుట్టూ దట్టంగా తంగేడు మొక్కలు మెలిచాయట. ఆతామరే శ్రీలక్ష్మి అవతారంగా భావించి పువ్వులకు బతుకుదెర్వు చూపింది కాబట్టి బతుకమ్మగా పూజించడం మొదలు పెట్టారట. అయితే ఆత్మత్యాగంతో తెలంగాణలో ఓ పల్లెను వరదబారినుంచి కాపాడిన త్యాగమూర్తి బతుకమ్మ అని కొందరు, మహిషాసురుని చంపిన తర్వాత అలసి సొలసి మూర్ఛపోయిన అమ్మవారికి, మహిళలంతా కలిసి పాటలతో స్పృహ తెప్పించే ప్రయత్నమని మరికొందరు చెబుతారు. ఓ రైతు దంపతులకు పిల్లలు పుట్టి చనిపోతున్నారని ఇలా ఏడుగురు పుట్టి చనిపోయారని 8వ బిడ్డకు బతుకమ్మ అని పేరు పెట్టడంతో ఆమె బతికిందనేది మరో కథనం.
తొమ్మిది రోజులపాటు తొమ్మిది రూపాల్లో బతుకమ్మని కొలిచి చివరి రోజు సద్దుల బతుకమ్మని పెద్ద పండగా భావిస్తారు. ఆ రోజు తొమ్మిదిరకాల సద్దులు తయారు చేస్తారు. గునుగ, తంగేడు పూలతోపాటు మిగతా పూలను వలయాకారంగా పేర్చుకుంటూ ఆకర్షణీయంగా బతుకమ్మని తయారుచేసి మధ్యలో పసుపుతో చేసిన గౌరీమాతను పెట్టి చుట్టూ దీపాలతో అలంకరిస్తారు. ఇలా తయారు చేసిన బతుకమ్మను ఇంట్లో పూజ చేసి ఆ తర్వాత బయటకి తీసుకొచ్చి బతుకమ్మ చుట్టూ ఆడిపాడతారు. బొడ్డెమ్మతో మొదలు ఎంగిలిపుప్వు బతుకమ్మ, సద్దుల బతుకమ్మ.. ఇలా దేని ప్రత్యేకత దానిదే.. తొమ్మిది రోజుల పాటు కొనసాగే బతుకమ్మలను బావిలో లేదా నీటి ప్రవాహంలో నిమజ్జనం చేస్తారు..
Also Read: విజయ దశమి ఎందుకు జరుపుకుంటారు.. శరన్నవరాత్రుల్లో అమ్మవారు ఏ రోజు ఏ అలంకారంలో అనుగ్రహిస్తుంది ... ఆ అలంకారం వెనుకున్న విశిష్టత ఏంటి...
Also Read: ఈ రాశుల వారు ఎవ్వరికీ సలహాలు ఇవ్వకండి...వారి ఆర్థిక పరిస్థితి బావుంటుంది...ఏ రాశిఫలితాలు ఎలా ఉన్నాయంటే...
Also Raed: అల్లిపూల వెన్నెల సాంగ్ ఆవిష్కరించిన గౌతమ్ మీనన్, కవిత
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Pitru Paksham 2023: మీరు తీర్చుకోవాల్సిన రుణాల్లో అతి ముఖ్యమైన రుణం ఇది - ఎందుకో తెలుసా!
Pitru Paksham 2023: అక్టోబరు 14 వరకూ పితృ పక్షం - ఈ 15 రోజులు ఎందుకు ప్రత్యేకం!
Vidur Niti In Telugu : ఈ 4 లక్షణాలున్నవారికి జీవితమంతా ఆర్థిక ఇబ్బందులే!
Chanakya Niti: తనకు మాలిన ధర్మం పనికిరాదంటారు ఎందుకు - దీనిపై చాణక్యుడు ఏం చెప్పాడో తెలుసా!
Horoscope Today October 1st, 2023: అక్టోబరు నెల మొదటి రోజు ఏ రాశివారికి ఎలా ఉందంటే!
Tollywood - AP Elections 2024 : టీడీపీ, జనసేనకు 'జై' కొడుతున్న టాలీవుడ్?
MLA Anil: నారాయణ సత్య హరిశ్చంద్రుడా? ఆయన అరెస్ట్ ఖాయమే - మాజీ మంత్రి అనిల్
Hyper Aadi: దయచేసి ఇకనైనా మారండి- తెలుగు సినిమాపై విమర్శకులు చేసేవాళ్లకు 'హైపర్' ఆది పంచ్
LPG Price Hike: వినియోగదారులపై గ్యాస్ బండ, ఒక్కసారిగా రూ.209 పెంపు
/body>