అన్వేషించండి
Advertisement
Ashada Masam 2022 : ఆషాడాన్ని శూన్య మాసం అని ఎందుకంటారు!
Ashada Masam 2022 : ఆషాఢమాసాన్ని శూన్యమాసం అంటారు. ఈ నెలలో వివాహాది శుభకార్యాలు ఏమి చేయరు కానీ ఈ నెలలో ఎన్నో పర్వదినాలున్నాయి. ఇన్ని పండుగలుంటే శూన్యమాసం అని ఎందుకంటారు...
ఆషాడమాసం రాగానే ఎలాంటి శుభకార్యాలు నిర్వహించరు. కొత్తగా తలపెట్టే కార్యక్రమాలన్నీ వాయిదా వేసుకుంటారు. పూరీ జగన్నాథుడి రథయాత్ర, బోనాలు, తొలి ఏకాదశి సహా నెలంతా పండుగలే. అయినా శూన్యమాసం అని పిలుస్తారెందుకు అనే సందేహం వస్తుంది. అసలు కారణం ఏంటంటే..
- పురాణాల ప్రకారం ఆషాఢ మాసంలో శ్రీ మహా విష్ణువు యోగ నిద్రలోకి వెళ్తాడు. ఈ సమయంలో పెళ్లిళ్లు చేసినా, ఇంకేవైనా శుభకార్యాలు నిర్వహించినా భగవంతుడి ఆశీర్వాదాలు ఉండవని భావిస్తారు. అంటే ఏం చేసినా శూన్య ఫలమే అంటారు. అందుకే ఈ నెలలో శుభకార్యాలు నిషేధించారట.
- ఆషాఢ మాసాన్ని అనారోగ్య మాసం అని కూడా అంటారు. అనారోగ్య సమస్యల నుంచి కాపాడమంటూ భక్తులంతా అమ్మవారికి బోనం సమర్పిస్తారు.
Also Read: దేవుడికి దహన సంస్కారాలు, ఈ ఆలయంలో విగ్రహాలను దహనం చేసేస్తారు, మళ్లీ ఇలా ప్రాణం పోసుకుంటాయ్!
పేరుకే శూన్యమాసం కానీ ఎన్నో పండుగలు
- ఆషాడ మాసం ప్రారంభమైన వెంటనే భాగ్యనగరంలో బోనాల సందడి మొదలవుతుంది
- సమస్త జగత్తుకు పరిపాలకుడైన పూరీ జగన్నాధుడి రథ యాత్ర జరిగేది కూడా ఈ మాసంలోనే
- అమ్మలుగన్న అమ్మ ముగ్గురమ్మ మూలపుటమ్మ జగజ్జననీ సకల జీవులకు ఆహారం అందించిన శాకంబరీ దేవిగా దేశమంతటా దర్శనమిచ్చేది ఆషాఢంలోనే. ఈ మాసంలో శాకంబరీ నవరాత్రులు కూడా చేస్తారు
- ఈ మాసంలో ఆషాఢ శుద్ధ పంచమిని స్కంధ పంచమిగా చెబుతారు పండితులు. అలాగే ఆషాఢ షష్టిని కుమార షష్టిగా చెబుతారు. ఈ పవిత్రమైన రోజున సుబ్రమణ్యస్వామిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు
- ఆషాడ మాసంలో వచ్చే సప్తమిని భాను సప్తమి అంటారు. సూర్యుడు ఉత్తరం నుంచి దక్షిణం దిశకు పయనిస్తూ మూడు నెలల తర్వాత మధ్యలో చేరుకుంటాడు. ఆ రోజు పగలు,రాత్రి సరిసమానంగా ఉంటాయి
- ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశి అని మరియు శయన ఏకాదశి అని కూడా అంటారు. ఈరోజునే చాతుర్మాస వ్రతం కూడా ఆరంభమవుతుంది. దీనినే మతత్రయ ఏకాదశి లేదా దేవశయని ఏకాదశి అని కూడా పిలుస్తారు
- ఆషాఢ పూర్ణిమనే గురుపూర్ణిమ అంటారు. మనిషికి జ్ఞానాన్ని అందించేవాడు గురువైతే..లోకానికి జ్ఞానం అందించించిన మహానుభావుడు వేదవ్యాసుడు. ఆయన పుట్టిరోజే గురుపూర్ణిమ
- ఆషాఢ మాసంలోనే దక్షిణాయానం కూడా ప్రారంభమవుతుంది. సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించినప్పటి నుంచీ తిరిగి మకర రాశిలో ప్రవేశించేవరకూ దక్షిణాయనం అంటారు. ఈ సమయంలో సూర్యుడు భూమధ్య రేఖకు దక్షిణంగా సంచరిస్తాడు
Also Read: ఆధ్యాత్మికంగా వటవృక్షానికి ఎందుకంత ప్రాధాన్యత, చుట్టూ దారం ఎందుకు కడతారు!
Also Read: పూరి జగన్నాథుడి విగ్రహాల్లో ఓ బ్రహ్మపదార్థం ఉంటుంది, అదేంటో తెలుసా!
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
పాలిటిక్స్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Dr. Rahul ChaudharyPresident of Administration in NDIIT
Opinion