World Biggest Lock: ప్రపంచంలోనే అతి పెద్ద తాళం.. ఇదిగో అయోధ్య రామ మందిరం కోసం సిద్ధం.. బరువు ఎంతో తెలుసా?
ప్రపంచంలోని అతిపెద్ద తాళం అయోధ్య రామమందిరం కోసం సిద్ధమైంది. ఆ తాళం బరువెంతో తెలుసా?
తాళం ఎంత బరువుంటుందంటే.. ఏదో కొన్ని గ్రాములని ఠక్కున చెప్పేస్తారు. రాజుల కాలంలో ఇంకాస్తా ఎక్కువ బరువే ఉండేవి. కానీ ఇప్పుడు అయోధ్య రామమందిరం కోసం వందల కేజీలు ఉండే తాళాన్ని సిద్ధం చేశారు. దాన్ని తీసే తాళం చెవి కూడా తక్కువ బరువు ఉండదండి.. అది కూడా చాలా బరువే. అసలు ఈ తాళాన్ని ఎవరు తయారు చేశారు?
ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్ జిల్లాకు చెందిన సత్యప్రకాశ్ అనే తాళాలు తయారు చేసే వ్యక్తి, అతడి భార్య ప్రపంచంలోనే అతిపెద్ద తాళాన్ని తయారు చేశారు. అయితే దాని తాళం చెవే 30 కిలోల బరువు ఉంటుంది. దీనితోనే ఆ తాళం తెరుచుకుంటుంది. దీనికోసం సుమారు 2 లక్షల రూపాయలు ఖర్చు చేశాడు సత్య ప్రకాశ్. అంతేకాదు.. దీనిపై రాముడి చిత్రం కూడా ఉంటుంది. దీనిని వాళ్లు అయోధ్యలో నిర్మిస్తున్న రామమందిరానికి అంకితం చేయాలని నిర్ణయించుకున్నారు.
10 అడుగుల పొడవు 400 కిలోల బరువు ఉండే తాళాన్ని తయారు చేసేందుకు ఆరు నెలలు శ్రమించాడు సత్యప్రకాశ్. తాళం తుప్పు పట్టకుండా ఉండేందుకు స్టీల్ స్క్రాప్ సీటు కూడా ఉంది. ఈ లాక్‌ని ఇంకాస్త పూర్తి చేయాల్సి ఉంది. కానీ దాని కోసం నిధులు అవసరం. ఆర్థిక సాయం నిమిత్తం ప్రజలను అడిగినట్టు సత్యప్రకాశ్ చెప్పాడు.
उत्तर प्रदेश: अलीगढ़ के एक वृद्ध दंपत्ति क़रीब 300 किलो का एक ताला बना रहे हैं, इसके बाद दंपत्ति की इच्छा राम मंदिर के लिए ताला बनाने की है। सत्य प्रकाश शर्मा ने बताया, "मेरे यहां 100 साल से ज़्यादा से ताला बनाने का काम होता है। अलीगढ़ की पहचान हो इसलिए हमने ये ताला बनाया है।" pic.twitter.com/yZNRnkGSEW
— ANI_HindiNews (@AHindinews) March 17, 2021
ఈ కళను ప్రోత్సహించేందుకు ప్రభుత్వ సాయం అవసరమని సత్యప్రకాశ్ చెబుతున్నాడు. రాముడి కోసం ఈ తాళాన్ని అప్పు చేసి తయారు చేశాడట. గతంలో 300 కేజీల తాళాన్ని తయారు చేసి.. వార్తల్లోనూ నిలిచాడు సత్యప్రకాశ్. తాను తయారు చేసిన తాళాలను రిపబ్లిక్ పరేడ్‌లో చేర్చాలని కోరుకుంటున్నట్లు వెల్లడించాడు. గిన్నిస్‌బుక్ ఆఫ్ రికార్డులో చోటు దక్కాలని కోరుకుంటున్నాడు.
Also Read: Spirituality: మీ ఆలోచనా విధానాన్ని బట్టి మీరెలాంటి భోజనం చేశారో చెప్పొచ్చు...
Also Read: Sankranthi Bramhosthavalu: సంక్రాంతికి శ్రీశైలం మల్లన్న కల్యాణం, భక్తులకు ఈ నిబంధనలు తప్పనిసరి...
Also Read: Bhogi 2022: మీ సరదా సరే..దయచేసి భోగి మంటల్లో ఇవి మాత్రం వేయకండి..
Also Read: Laughing Buddha: ఈ టైప్ లాఫింగ్ బుద్ధ మీ ఇంట్లో ఉంటే.. అదృష్టం దరిద్రం పట్టినట్టు పడుతుందట