Garuda Purana: గరుడ పురాణం ప్రకారం రోజుని ఇలా ప్రారంభిస్తే మీకు అపజయం అనేదే ఉండదు!
Garuda Purana: గరుడ పురాణం ప్రకారం, ఉదయాన్నే ఈ 4 పనులు చేస్తే అదృష్టవంతులవుతారు.
Garuda Purana: అష్టాదశ పురాణాల్లో ఒకటైన గరుడపురాణాన్ని సాక్షాత్తూ శ్రీ మహావిష్ణువు తన సారథి అయిన గరుత్మంతునికి ఉపదేశించగా, వేదవ్యాసుడు రచించారు. ఇందులో విష్ణువు గరుడుడికి జనన మరణ చక్రం, ఆత్మ ప్రయాణంతో పాటు విజయవంతమైన, సంతోషకరమైన జీవితాన్ని పొందాలంటే ఏం చేయాలో కొన్ని విషయాలు ప్రస్తావించారు. వాటిని అనుసరించడం ద్వారా, ఒక వ్యక్తి ఆరోగ్యం, సంపద, అదృష్టాన్ని పొందుతారు.
ఈ నియమాలు మీ జీవితాన్ని మారుస్తాయి
ఒక వ్యక్తి ఉదయాన్నే క్రమం తప్పకుండా కొన్ని ప్రత్యేక పనులను చేస్తే తన జీవితంలో గణనీయమైన మార్పులు వస్తాయని గరుడ పురాణం స్పష్టంచేస్తోంది. అలా చేయడం వల్ల దురదృష్టం కూడా అదృష్టంగా మారవచ్చు. ఉదయం సమయం చాలా ప్రత్యేకమైనది, అందువల్ల ఆ సమయంలో మనం చేసే పనుల ఫలితాలు రోజంతా విజయవంతంగా, ఆహ్లాదకరంగా ఉండేలా చేస్తాయి.
Also Read : గరుడ పురాణం ప్రకారం మరణానికి ముందు కనిపించే సంకేతాలేంటో తెలుసా
- రోజూ ఉదయాన్నే నిద్రలేచి, స్నానం చేసి, భగవంతుని దర్శనం చేసుకుని, ఆచారాల ప్రకారం పూజ చేయాలి. ఆ తర్వాత మీ పూర్వీకుల ఆశీస్సులు తీసుకోవాలి. గరుడ పురాణం ప్రకారం భగవంతుడు, పూర్వీకుల ఆశీర్వాదంతో తమ దినచర్యను ప్రారంభించే వారు జీవితంలో ఎల్లప్పుడూ విజయాన్ని పొందుతారు.
- మీరు ఏదైనా తినడానికి ముందు ప్రతిరోజూ దేవునికి నైవేద్యాన్ని సమర్పించడం మర్చిపోవద్దు. ఇలా చేయడం వల్ల సిరుల తల్లి లక్ష్మీదేవి, మాతా అన్నపూర్ణేశ్వరి సహా దేవతలందరూ తమ అనుగ్రహాన్ని ప్రసాదిస్తారు. అలాంటి ఇల్లు ఎల్లప్పుడూ సంపదతో నిండి ఉంటుంది.
- మీకు అవకాశం దొరికినప్పుడల్లా పేదలకు, నిర్భాగ్యులకు సహాయం చేయండి. మీ ఆదాయంలో కొంత భాగాన్ని విరాళంగా ఇవ్వండి. అలాంటి వారి కోసం కొంత సొమ్ము ఖర్చు పెట్టండి. ఈ పనులు చేసిన వ్యక్తి ఈ జన్మలో సకల సుఖాలను పొందడమే కాకుండా మరణానంతరం స్వర్గాన్ని పొందుతాడు. అలాంటి వ్యక్తి జీవితంలో ఎప్పుడూ సంపదకు లోటు ఉండదు.
- గరుడ పురాణం ప్రకారం ప్రతి వ్యక్తి ప్రతిరోజూ ఆత్మపరిశీలన చేసుకోవాలి. తద్వారా అతను తాను తీసుకున్న సరైన, తప్పు నిర్ణయాల మధ్య వ్యత్యాసాన్ని అర్థం చేసుకోగలడు. అంతేకాకుండా భవిష్యత్తులో సరైన నిర్ణయాలు తీసుకోవడానికి అతను వివేకాన్ని పెంపొందించుకోగలడు.
తెల్లవారుజామున నిద్రలేచిన వెంటనే పైన పేర్కొన్న నాలుగు పనులు చేసిన వ్యక్తికి అన్ని విధాలుగా శుభం కలుగుతుంది. ఇది మీకు అదృష్టాన్ని మాత్రమే కాకుండా మంచి ఆరోగ్యంతో పాటు శ్రేయస్సును కూడా అందిస్తుంది.
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.
సెప్టెంబరు 4 నుంచి 10 వరకూ వారఫలాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి